EPAPER

Vijayasai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డిపై కుట్రలు చేసింది ఆయనేనా?

Vijayasai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డిపై కుట్రలు చేసింది ఆయనేనా?

Who is the YCP leader targeted Vijayasai Reddy: వైసీపీలో ఇప్పుడిప్పుడే లుకలుకలు బయటపడుతున్నాయి. ఒకరి మీద మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సజ్జలపై విమర్శలు చేయడం మొన్నటి వరకూ చూశాం. కానీ, ఈ సారి ఏకంగా విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపింగ్‌గా మారింది. తన ఇమేజ్‌ను దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కుట్రల్లో తమ పార్టీ నేతలు కూడా భాగమయ్యారని ఆయన ఆరోపించారు. అయితే.. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసే అంతటి వారు ఎవరున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న.


పార్టీలో సాధారణ ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఆయన్ని టార్గెట్ చేయలేరు. ఒకవేళ అలాంటి వారు చేసినా.. వారి వెనక ఎవరిదో పెద్ద హస్తమే ఉంటుంది. అయితే.. ఇప్పుడే కాదు.. గతంలో కూడా  ఓసారి విజయసాయి రెడ్డిని జగన్ పక్కన పెట్టారనే వార్తలు వచ్చాయి. వార్తలు మాత్రమే కాదు.. అప్పట్లో పార్టీలో విజయసాయిరెడ్డి ప్రియారిటీ చూస్తే అదే అనిపిస్తోంది. పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించారు. ఆ బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు. ఇదంతా సజ్జల చేయించారనే అనుమానాలు కూడా అప్పట్లో వచ్చాయి. అంతేకాదు. పార్టీలో ప్రియారిటీ తగ్గిందని గ్రహించి విజయసాయిరెడ్డి కూడా తన వైఖరి మార్చుకున్నారని చాలా మంది చెప్పారు.

చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ట్విట్టర్‌లో టీడీపీపై, చంద్రబాబుపై విరుచుకుపడిన విజయసాయి రెడ్డి ఆ మధ్య సైలంట్ అయ్యారు. తన విమర్శల పదును తగ్గించారు. గత ప్రభుత్వాన్ని ప్రశంసించడం తప్పా.. పెద్ద ప్రతిపక్షాలపై విమర్శల జోలికి వెళ్లలేదు. తన పరిధిలో ఉన్న పని తాను చేసుకుంటూ పోయేవారు. అయితే.. ఎన్నికలు దగ్గరపడేసరికి మరోసారి జగన్.. విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల బాధ్యతలు ఆయనకే ఇచ్చారు. దీంతో మళ్లీ యాక్టివ్ అయ్యారు విజయసాయిరెడ్డి. అయితే.. అప్పుడు కూడా విజయసాయిరెడ్డపై సజ్జల రామకృష్ణారెడి కుట్రలు చేశారని అనుమానాలు ఉన్నాయి.


Also Read: జగన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్, ఒక్క ఓటమితో..

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలంతా ఖాళీ అయిపోయారు. అసలు పోటీ చేయడానికి కూడా ఎవరూ లేరు. అలాంటి టైంలో నెల్లూరు ఎంపీగా జగన్ విజయసాయిరెడ్డి పేరు ప్రతిపాదించారు. గెలిచే అవకాశం లేనపుడు ఆయన పేరు తెరపైకి తీసుకొని రావడం నిజంగా ఆయనను రాజకీయంగా తొక్కేడమేనని చాలా మంది అన్నారు. ఈ ప్రతిపాదన వెనుక సజ్జల ఉన్నారన అప్పుడు టాక్ నడించింది. ఎట్టకేలకు విజయసాయిరెడ్డే స్వయంగా తనపై వైసీపీ నేతలు కూడా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. దీంతో.. ఇప్పుడు మరోసారి సజ్జల వైపే అందరి చూపు పడింది.

విజయసాయిరెడ్డి మరో విషయం కూడా చెప్పారు. తన సొంతంగా ఓ ఛానెల్ పెడుతున్నానని ఆయన అన్నారు. రెండేళ్ల క్రితమే పెట్టాలనుకున్నానని.. జగన్ వద్దని చెప్పడంతో ఆగిపోయానని చెప్పారు. ఇక్కడే మరో అనుమానానికి కూడా తావిస్తుంది. తమకు అనుకూలంగా ఓ ఛానెల్ వస్తుందంటే జగన్ ఎందుకు వద్దనుకున్నారు? అనేది ప్రశ్న. విజయసాయిరెడ్డిని ఎందుకు అడ్డుకున్నారు అనే అనుమానాలు వస్తున్నాయి. రెండేళ్ల క్రితం అంటే.. వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రియారిటి తగ్గిందనే ప్రచారం జరుగుతున్నప్పటి మాట. అంటే.. ప్రియారిటీ తగ్గింది కాబట్టే విజయసాయిరెడ్డి సొంతగా ఛానెల్ పెట్టి తనేంటో చూపించాలి అనుకున్నారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి ఛానెల్ పెడితే.. తనకు ఇబ్బంది అవుతుందని జగన్ భావించి ఉంటారు. అందుకే వద్దని అని ఉంటారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విజయసాయిరెడ్డి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఎన్నో సంచలనాలకు దారి తీసింది.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×