EPAPER

AP Fake Votes: ఏపీలో హాట్ టాపిక్ గా నకిలీ ఓట్లు.. జీరో డోర్ నెంబర్ తో గోల్ మాల్..

AP Fake Votes: ఏపీలో హాట్ టాపిక్ గా నకిలీ ఓట్లు.. జీరో డోర్ నెంబర్ తో గోల్ మాల్..

AP Fake Votes: ఏపీలో దొంగ ఓట్ల లెక్కలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఈ ఫేక్ ఓటర్స్ లెక్కలు పార్టీలను కలవరపెడుతున్నాయి. మీరంటే మీరే దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని వైసీపీ, టీడీపీ పంచాయితీని ఢిల్లీ వరకు తీసుకెళ్లాయి. ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయి నకిలీ ఓట్లు ఉండవు. ఒక్క ఏపీలోనే ఎందుకు ఈ పరిస్థితి? అసలు దొంగ ఓట్లు ఎలా నమోదవుతున్నాయి? వీటికి అడ్డుకట్ట వేసే మెకానిజం ఎన్నికల సంఘం దగ్గర లేదా?


18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు వేసే హక్కు ఉంటుంది. ఎన్నికల సంఘం ఓటరు కార్డు జారీ చేస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి. ఇది రూల్. ఉల్లంఘిస్తే ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఏడాది జైలు శిక్ష లేదంటే జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండూ అమలవుతాయి. కానీ ఈ రూల్స్ గీల్స్ జాన్తా నై అంటూ పెద్ద ఎత్తున డబుల్ ఓటర్లు పుట్టుకొస్తున్నారు. ఒక్కరికే రెండు మూడు చోట్ల ఓటు ఎలా నమోదు చేయించాలో ఏపీలో తెలిసినంతగా బహుశా ఎక్కడా తెలియదేమో. ఎందుకంటే సాఫ్ట్ వేర్ కు చిక్కకుండా.. అక్షరాలు మార్చడం, జీరో డోర్ నెంబర్ తో ఓట్లు నమోదు చేయడం, ఐడీ ప్రూఫ్ ల ట్యాంపరింగ్ మాయాజాలంతో ఓట్లు నమోదు జరుగుతోందన్నది ప్రధాన ఆరోపణ.

అసలు ఈ దొంగ ఓటర్లను ఎవరు సృష్టిస్తున్నారు? ఎందుకు సృష్టిస్తున్నారన్నది ఇప్పటికీ మిస్టరీనే. నిజంగా దొంగ ఓట్లతో గెలిచే పరిస్థితి ఉంటుందా.. ఇవన్నీ పెద్ద డిబేట్ కు కారణమవుతున్నాయి. విషయమేంటంటే.. టీడీపీ నేతలేమో.. ఇదంతా చేస్తున్నది వైసీపీ వాళ్లే అంటారు. సీన్ కట్ చేస్తే.. దీనంతటికీ కారణం టీడీపీ వాళ్లే అని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదంతా చూడ్డానికి ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కానీ అసలు సంగతి మాత్రం తేలడం లేదు. ఈ పంచాయితీ లేటెస్ట్ గా ఢిల్లీ వరకు వెళ్లింది. కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ, టీడీపీ, బీజేపీ పోటా పోటీగా కంప్లైంట్లు కూడా చేశాయి. దొంగ ఓట్ల లెక్క తేల్చాలంటున్నాయి. దీంతో త్వరలోనే కేంద్ర ఎన్నికల బృందం ఏపీకి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలనకు రెడీ అవుతోంది.


ఏపీలో ఏ ఎన్నికలు వచ్చినా ఈ దొంగ ఓట్ల వ్యవహారమే ప్రతిసారి హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇప్పుడిది సార్వత్రిక ఎన్నికలు. మరి సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక దశలో ఏపీలో 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఎన్నికల సంఘమే చెప్పిన సందర్భం. జీరో నెంబర్, బోగస్ ఇంటి నెంబర్లతో 2 లక్షల 51 వేల 767 ఓట్లు ఉన్నట్లు లెక్క తేల్చింది. ఒకే డోర్ నెంబర్ తో పది ఓట్లకు పైగా దాదాపు 57 వేలకు పైగా ఇళ్లు ఉన్నాయన్నది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో 15 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఓటరు జాబితాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్నది టీడీపీ వెర్షన్. కాదు కాదు.. 40 లక్షల 76 వేల 580 దొంగ ఓట్లను ఓటర్ జాబితాలో చేర్పించారని వైసీపీ నేతలు అంటున్నారు. అనడమే కాదు.. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారికి ఫిర్యాదు కూడా చేశారు.

అంటే ఫేక్ ఓట్ల విషయంపై రాజకీయం మరింత రసవత్తరంగా మారిపోయింది. మీరంటే మీరే చేశారని ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ ఇష్యూలో బీజేపీ కూడా ఎంటరైంది. ఇవేం దొంగ ఓట్లు అంటూ ఈసీకి కంప్లైంట్ చేశారు. అధికార పార్టీపై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఏపీలో ఫేక్ ఓట్ల విషయంపై ఏం జరుగుతోంది. నిజంగా అసలు ఎన్ని కొత్తవి చేర్పించారు? వీటిని తొలగించడం ఎలా..? ఈ ఫేక్ ఓట్లతో గెలుపోటములపై ప్రభావం పడుతుందా.. అసలు ఈసీకి వీటిని తొలగించడం సాధ్యమేనా? పార్టీలు ఒకరిపై మరొకరు ఎందుకు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి? ఇవన్నీ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.

ఒక దగ్గర ఓటు ఉన్నా అదే సెగ్మెంట్ లో మరో చోట, మరో అడ్రస్ తో, మరో ఐడీతో, పేర్లలో అక్షరాలు మార్చి.. ఐడీ ప్రూఫ్ లను ట్యాంపర్ చేసి.. ఫోటోలు మార్చి, ఇంటి పేర్లు మార్చి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న సానుభూతి పరులను చేర్చి.. డుప్లికేషన్ లో దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుని పకడ్బందీగా దొంగ ఓట్లు నమోదు చేయించారన్నది అసలు అభియోగం. డుప్లికేట్ ఓటు ఎలా రెడీ చేయాలో చాలా బాగా తెలుసుకున్నారు. భయం అసలే లేదు. ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో ఇలా లక్షల్లో నకిలీ ఓట్లు లిస్టులోకి వచ్చేశాయి. దీంతో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఆఫీసర్లది.

ఫేక్ ఓట్ల విషయంలో తప్పు మాది కాదంటే మాది కాదు అని వైసీపీ, టీడీపీ ఢిల్లీకి పంచాయితీని తీసుకెళ్లాయి. అంతా పక్క పార్టీ వారే చేశారని ఒకరిపై మరొకరు కంప్లైంట్లు కూడా ఇచ్చుకున్నారు. ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వెర్షన్ ఇప్పుడు చూద్దాం. అందరికంటే ముందుగానే ఢిల్లీలో సీఈసీని కలిసి ఫేక్ ఓట్లపై కంప్లైంట్ చేసిన పార్టీ కూడా ఇదే. వైసీపీ నేతల అనుమానం ఏంటంటే.. మైడ్యాష్ బోర్డ్ డాట్ కామ్ పేరుతో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందంటున్నారు. అమెరికా, లండన్ సర్వర్‌లో ఓటర్ల డేటా స్టోర్‌ చేస్తున్నారని, పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ ఎంపీలు. తండ్రి పేరు, ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్‌ను రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారని, పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశామని చెబుతున్నారు. ఏపీలో టీడీపీ నేతలు 40లక్షల 76 వేల ఓట్లను ఒకే ఫొటోతో ఇంటి పేరు​ మార్చి పలు ప్రాంతాల్లో నమోదు చేసినట్లు వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. ఓటర్లుగా టీడీపీ సానుభుతిపరుల పేరు నమోదు చేశారని.. హైదరాబాద్‌, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లో నివసిస్తున్న వాళ్ల ఓట్లు ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారంటున్నారు.

దొంగ ఓటర్ల వ్యవహారంపై విచారణ చేసి ఆ ఓట్లను తొలగిస్తున్న బూత్‌ లెవల్‌ సిబ్బందిపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని వైసీపీ ఎంపీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ సానుభూతిపరుల ఓటర్లను తొలగించేందుకు ఫాం-7 దరఖాస్తులను బీఎల్‌ఓలకు టీడీపీ నేతలే ఇస్తూ.. కావాలనే తొలగించేలా చేస్తున్నారంటున్నారు. క్షేత్రస్థాయిలో నిజాలు వెలుగు చూస్తుండడంతో బీఎల్ఓలను టీడీపీ బ్లాక్ మెయిల్ చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్ వెరిఫికేషన్ పేరుతో ప్రతి 30 ఇళ్లకు ఒక టీడీపీ కార్యకర్తను నియమిస్తున్నారని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఆ కార్యకర్త 30 కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించి లండన్ సర్వర్ లో భద్రపరుస్తున్నారన్నారు. ప్రభుత్వ అధికారిగా లేదంటే ఎన్నికల కమిషన్ నుంచి వచ్చామని మభ్యపెడుతూ వివరాలు సేకరిస్తున్నారంటున్నారు. ఇలా తీసుకున్న సమాచారాన్ని విశ్లేషించి తమ ఓటర్లు కాదు అనుకుంటే వారి ఓట్లు తొలగించేలా తప్పుడు దరఖాస్తులు చేస్తున్నారంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏంటన్నది తేల్చాల్సింది ఎన్నికల సంఘమే.

ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు దొంగే దొంగ అన్నట్లు వ్యవహరిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీలో తొలగించిన ప్రతి ఓటుపై నిశిత పరిశీలన చేయాలన్న ఆయన.. ఓట్ల తొలగింపుపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో వ్యవస్థలను మేనేజ్‌ చేసి.. ఓటర్ల జాబితాలో అక్రమాలు చేశారని, టీడీపీ చేసిన ఆ తప్పులను తాము సరిదిద్దామని సజ్జల అంటున్నారు.

మొత్తంగా దొంగ ఓట్ల వ్యవహారం ముందు ముందు మరింతగా హాట్ టాపిక్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మాటల యుద్ధం కొనసాగే ఛాన్స్ ఉంది. ఇంత భారీ స్థాయిలో దొంగ ఓట్లను తొలగించే పరిస్థితి ఈసీకి ఉంటుందా.. అంత సిబ్బంది ఉన్నారా.. అంతటి మెకానిజం ఉందా.. మాన్యువల్ గా చెక్ చేయడం సాధ్యమేనా.. ఉన్న కొద్దిపాటి సమయంలో ఇతరత్రా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు దొంగ ఓట్ల ఏరివేత అయ్యే పనేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

.

.

Related News

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Big Stories

×