EPAPER

Kotamreddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాప్!.. జగన్ కు చిక్కేనా? వాట్ నెక్ట్స్?

Kotamreddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాప్!.. జగన్ కు చిక్కేనా? వాట్ నెక్ట్స్?

Kotamreddy: ఫోన్ ట్యాపింగ్. చిన్న నేరం కాదు. అప్పట్లో తన ఫోన్ ట్యాప్ చేశారంటూ.. సీఎం కేసీఆర్ కు చుక్కలు చూపించారు చంద్రబాబు. ఆ ఫోన్ ట్యాప్ ఎపిసోడ్ నుంచి బయటపడేందుకే.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుతో కేసీఆర్ డీల్ కుదుర్చుకుని వెనక్కి తగ్గారని అంటారు. అంత సీరియస్ గా ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి. గతంలో సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ పై గట్టి హెచ్చరికలే జారీ చేసింది. అందుకే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఇప్పుడు వైసీపీ సర్కారును షేక్ చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని పొలిటికల్ గా ఇరకాటంలో పడేయడమే కాకుండా.. కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేస్తానని కోటంరెడ్డి వార్నింగ్ ఇవ్వడం మరింత షాకింగ్ పరిణామం.


వెంటనే అలర్ట్ అయిన సీఎం జగన్.. సలహాదారు సజ్జల, ఏపీ హోం సెక్రటరీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో ఎలా ముందుకు పోదామని చర్చించారు. ఆ మీటింగ్ అవుట్ కమ్ ఏంటో తెలియాల్సి ఉంది.

ఎమ్మెల్యే కోటంరెడ్డి.. తన ఫ్రెండ్ తో ఫోన్లో మాట్లాడారు. వాళ్లు మాట్లాడుకున్న ఆ వాయిస్ క్లిప్ ను ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు.. కోటంరెడ్డికి పంపించి బెదిరించారట. వైసీపీకి వ్యతిరేకంగా అడుగులు వేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారట. తామిద్దరం ఐ ఫోన్లో మాట్లాడుకుంటే ఈ వాయిస్ ఐపీఎస్ అధికారికి ఎలా వచ్చిందని? అంటే, తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కోటంరెడ్డి మీడియా సాక్షిగా ఆ విషయమంతా వెల్లగక్కారు. ఐపీఎస్ సీతారామాంజులు తనకు పంపిన ఆ ఆడియో క్లిప్ కూడా చూపించారు.


కట్ చేస్తే, వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మంత్రి అమర్నాథ్ రెడ్డి రంగంలోకి దిగి.. అది ఫోన్ ట్యాపింగ్ కాకపోవచ్చు.. కాల్ వాయిస్ రికార్డింగ్ కావొచ్చంటూ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేశారు. అందుకు, కోటంరెడ్డి మళ్లీ కౌంటర్ ఇచ్చారు. తాను, తన ఫ్రెండ్ ఐ ఫోన్లో మాట్లాడుకున్నామని.. ఐ ఫోన్లో కాల్ రికార్డింగ్ కుదరదని.. ఇది పక్కా ఫోన్ ట్యాపింగేనని తేల్చిచెప్పారు. తన ఫోన్ చాలా కాలంగా ట్యాప్ అవుతోందని.. తన మీద నమ్మకం లేని పార్టీలో తాను ఉండలేనంటూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయలేనంటూ.. కుదిరితే టీడీపీ నుంచి బరిలో దిగుతానంటూ.. ప్రకటించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

అటు, ఎమ్మెల్యే కోటంరెడ్డి కామెంట్లపై సజ్జల స్పందించారు. కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాకే ఇలా కామెంట్లు చేస్తున్నారని..
ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు సజ్జల.

మరి, సజ్జల అన్నట్టుగానే కోటంరెడ్డిపై యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తారా? వేటు వేస్తారా?

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×