EPAPER

YSRCP: పక్క చూపులు చూస్తున్న వైసీపీ నేతలు.. ఈ పరిస్థితుల్లో పార్టీ నిలబడుతుందా? భవిష్యత్తు ఏమిటీ?

YSRCP: పక్క చూపులు చూస్తున్న వైసీపీ నేతలు.. ఈ పరిస్థితుల్లో పార్టీ నిలబడుతుందా? భవిష్యత్తు ఏమిటీ?

What is the future of YSRCP in Andhra Pradesh: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ).. ఇప్పుడీ పార్టీ పరిస్థితి ఏంటి? భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడబోయేది దీని గురించే.. గత ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్న సీట్ల సంఖ్య 151. ఈ ఎలక్షన్స్‌లో గెలిచినవి జస్ట్ 11. ఇక్కడే ఆ పార్టీని ప్రజలు ఎలా రీసివ్ చేసుకున్నారో అర్థమైపోయింది. కానీ ఇదంతా గతం.. ఎందుకు ఓడారు? ఎలా ఓడారు? ఈ పోస్ట్‌మార్టమ్‌ ఇప్పుడు చేయడం ఔట్‌ డేటేడ్ అనే చెప్పాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ నిలబడుతుందా? లేదా? అనేది తెలుసుకోవడం అప్‌డేట్.


వైసీపీ నేతల్లో భయం భయం

ఎన్నికల తర్వాత వైసీపీని అబ్జర్వ్‌ చేస్తే మనకు తెలుస్తున్నదేంటి అంటే.. నైరాశ్యంలో నేతలు, నిరాశలో కార్యకర్తలు. అంతకంటే ఎక్కువ డిప్రెషన్‌లో పార్టీ అధినేత వైఎస్ జగన్. రెండు, మూడు రోజులుగా ఆయన జనాల్లో కనిపిస్తున్నారు కానీ.. అంతకుముందు అయితే తాడేపల్లి.. లేదంటే బెంగళూరులో తన ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. ఇవన్నీ చూస్తున్న వైసీపీ నేతల్లో ఇంకాస్త భయం పెరిగింది. ఇది వాళ్ల మోరల్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది.


పక్క చూపులు చూస్తున్న వైసీపీ నేతలు

వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 11, ఎంపీల సంఖ్య నాలుగు. ఇప్పుడీ నెంబర్‌తో ఐదేళ్ల పటు పార్టీని నెట్టుకురాగలరా జగన్? తెలంగాణలో చూస్తూనే ఉన్నాం. 30 మందికిపైగా గెలిచిన పార్టీ పరిస్థితే ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. మరి కేవలం 11 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఇందులో కొందరు టీడీపీ, మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నారని టాక్. ముఖ్యంగా ఎంపీలైతే బీజేపీలో చేరేందుకు మంతనాలు కూడా జరుపుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ లిస్ట్‌లో మిథున్‌ రెడ్డి కూడా ఉన్నారని వినిపిస్తోంది. అందుకే జగన్‌ పార్టీ అస్థిత్వంపైనే ఇప్పుడు ప్రశ్నలు మొదలయ్యాయి.

విజయ సాయిరెడ్డి, సజ్జల ఔట్.. పెద్దిరెడ్డి ఇన్

జగన్ గురించి పొలిటికల్ సర్కిల్స్‌లో ఓ టాక్ ఉంది. ఆయన ఎవరి మాట వినరు.. జగన్ జగమొండి అని. అంతేకాదు పార్టీ నేతలైనా.. అందరితో ఓపెన్ డిస్కషన్ ఉండదని.. చాలా కొద్ది మంది సన్నిహితులతో మాత్రమే ఆయన మంతనాలు జరుపుతారని. కానీ గత ఐదేళ్లలో ఆయన తీసుకున్న డెసిషన్స్‌ను అబ్జర్వ్ చేస్తే.. అందులో కూడా నిలకడ లేదనిపిస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్.. ఎంపీ విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి అంటే వైసీపీలో నెంబర్ టూ అనే పేరు ఉండేది. జగన్‌కు అత్యంత నమ్మకమైన, ముఖ్యమైన వ్యక్తి అనే స్టెచర్‌ ఉండేది. కానీ ఏం జరిగింది? అలాంటి వ్యక్తి క్యారెక్టర్‌పైనే ఇప్పుడు దాడి జరుగుతున్నా పార్టీ నుంచి సరైన స్పందన లేదు.

Also Read: జగన్ లెక్కలు బయటకు.. సాక్షికి రూ.403 కోట్లు, మిగతా 20 పేపర్లకు..

ఎలక్షన్స్‌కు ముందే ఆయనన పక్కన పెట్టేశారు జగన్. మొదట ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తొలగించారు. ఢిల్లీ వ్యవహారాలను చూసుకునే బాధ్యత నుంచి తప్పించేశారు. ఆ తర్వాత జగన్‌, విజయసాయి రెడ్డి కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఇది విజయసాయి రెడ్డి కథ.. నెక్ట్స్‌ సజ్జల రామకృష్ణా రెడ్డి. సజ్జల కూడా జగన్ అంతరంగిక వ్యక్తిగా పేరుంది. ఆయన డైరెక్షన్‌లోనే జగన్ నడిచారన్న టాకూ ఉంది. అంతెందుకు ఏ నిర్ణయమైనా గవర్నమెంట్ తరపున మీడియాకు, ప్రజలకు చెప్పింది ఆయనే కదా. ఇంత చేసిన సజ్జల ఎలక్షన్స్ తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరే వెనకాల కనిపిస్తున్నారు.

ఆత్మస్థై్ర్యాన్ని దెబ్బతీసిన ‘11’ – పరువు కాపాడిన రాయలసీమ
జగన్‌కు కొండంత ధైర్యం రాయలసీమ. కానీ ఆ సీమలో కూడా ఇప్పుడు సిట్యూవేషన్స్ మారిపోయాయి. ఒకప్పుడు రెండు సీట్లు మినహా.. మొత్తం సీమను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.. ఇప్పుడు ఏడు సీట్లకు పరిమితమైంది. ఒక యాంగిల్‌లో చెప్పాలంటే వైసీపీకి వచ్చిన 11లో ఏడు ఇక్కడే గెలిచింది. అంటే పరువు కాపాడింది రాయలసీమే. కానీ ఇది జగన్ ఆత్మస్థైర్యాన్ని గట్టిగానే దెబ్బతీసింది.

లీడర్ల కొరతతో విలవిల..

గతంలో జగన్ ఒక డైలాగ్ అనేవారు. కొట్టారు.. తీసుకున్నాం.. మళ్లీ మా టైమ్ వస్తుంది.. మేమూ కొడతామని.. నీ ఇప్పుడైతే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇలా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఒకటి కాదు.. చాలానే ఉన్నాయి. వాటిలో మొదటిది లీడర్ల కొరత. నిజానికి చాలా మంది లీడర్లంతా జగన్‌పై తిరుగుబాటు జెండాను ఎగురవేశారు. ఇప్పుడు కాదు.. ఎలక్షన్స్‌కు ముందే.. మిగిలిన వాళ్లలో చాలా మంది లోలోపల రగిలిపోతున్నా.. గెలిస్తే పరిస్థితి ఏంటో అనే డౌట్‌తో ఆగిపోయారు. ఇప్పుడు వాళ్లంతా వైసీపీ పార్టీ పెద్దలకు టచ్‌లో కూడా లేరు. కూటమి ప్రభుత్వ పెద్దలతో టచ్‌లో ఉంటున్నారు వారంతా..
సో గ్రౌండ్ లెవల్‌లో లీడర్స్‌ అంతా పార్టీకి దూరమవుతున్నారు.

మారని జగన్ తీరు..

రెండోది.. జగన్ తీరు మారకపోవడం. సింపుల్‌గా చెప్పాలంటే జగన్ ఇన్నాళ్లు అజ్ఞాతవాసం చేశారు. ఈ టైమ్‌లో ఏమైనా రియలైజ్ అయ్యారా? విధానాలను ఏమైనా మార్చుకున్నారా? అంటే.. అది కూడా లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు టెకప్ చేసే టాపిక్స్‌ అలా ఉంటున్నాయి. వినుకొండ మర్డర్ ఇష్యూను హైలేట్ చేయాలని చూశారు. కానీ వారిద్దరు గతంలో ఒకే పార్టీలో అంటే.. వైసీపీలోనే ఉన్నారు. ఇద్దరి మధ్య పర్సనల్‌ రైవర్లీ ఉందని తేలింది. న్ని నార్మల్‌గా ఉంచితే అయిపోయేది. ఇప్పుడు దాన్ని ఢిల్లీ లెవల్లోకి తీసుకెళ్లారు. మరి ప్రజలు ఈ మొత్తం సినారియోను ఎలా రిసీవ్ చేసుకున్నారంటే. జగన్ అసెంబ్లీ డుమ్మా కొట్టేందుకు వేసేందుకు వేసిన స్కెచ్‌ అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ జగన్ వ్యూహం దెబ్బకొట్టిందనే చెప్పాలి.

గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోలేకపోవడం

మూడోది.. జగన్‌కు ఇంకా చాలా విషయాల్లో గ్రౌండ్ రియాలిటీ తెలియడం లేదు. తనను ప్రజలే ఓడించారన్న విషయాన్ని ఆయన ఇంకా నమ్మడం లేదు. కొన్ని సమూహాలు.. సామాజికవర్గాలు కుట్ర చేశాయంటున్నారు. అదేలా సాధ్యం? అనే క్వశ్చన్ ఆయన బుర్రలో ఎందుకు వెలగడం లేదో తెలియడం లేదు. ప్రజలు ఓడించకపోతే ఆయనకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాకుండా పోయింది? ఎందుకు ఓడాం? దానికి కారణాలు ఏంటి? అనే విషయాలను పార్టీ అధినేత తెలుసుకోకపోతే ఎలా?

Also Read: ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఫైర్ లెస్ బ్రాండ్.. పత్తా లేని మాజీ మంత్రి రోజా

దిశానిర్దేశం చేసేవారు లేకపోవడం

నాలుగోది.. ఆయనకు సరైన దిశనిర్దేశం చేసేవారు లేకపోవడం. మొదట విజయసాయి రెడ్డి.. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ తర్వాత అనేక ఐ ప్యాక్ లాంటి సంస్థలు.. సర్వేలు.. వీటన్నింటిపై జగన్ ఆధారపడేవారు. విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేశారు.. సజ్జల ఎక్కడా కనిపించడం లేదు. 175 సీట్లు వస్తాయని సర్వే రిపోర్ట్ ఇచ్చిన ఐప్యాక్‌ను ఇప్పుడు దగ్గరికి కూడా రానిచ్చే పరిస్థితి లేదు. మరి జగన్ ఎవరి డైరెక్షన్‌లో వర్క్‌ చేయబోతున్నాడు? పార్టీ ఫ్యూచర్ స్ట్రాటజీస్‌ను రచించేవారు ఎవరు?

39 పర్సెంట్ ఓట్‌ షేర్‌ను కాపాడుకోవడం ఎలా?

ఐదవది.. ఓట్ షేర్‌ను కాపాడుకోవడం. వైసీపీకి ఈ ఎన్నికల్లో 39 పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది. దానిని వచ్చే ఎన్నికల వరకు కాపాడుకోవాలి. అండ్.. మళ్లీ అధికారంలోకి రావాలంటే మిగతా ప్రజల మనసు గెలుచుకోవాలి. కానీ అది అయ్యే పనేనా? ఎందుకంటే ప్రస్తుతం పార్టీకి అంతో ఇంతో క్యాడర్ ఉంది. ఇండియన్ హిస్టరీలో ప్రాంతీయ పార్టీ విలీనం చేస్తే తప్ప.. కనుమరుగైన పరిస్థితి లేదు. అందులో ఓసారి అధికారంలోకి వచ్చిన పార్టీ కాబట్టి క్యాడర్ ఉంటుంది. కానీ లీడర్ల కొరత మాత్రం వెంటాడుతోంది. నడిపించేవాడు లేకపోతే.. ఎంత సమర్థమైన సైన్యం ఉన్న యుద్ధంలో ఓటమి తప్పదు. అందుకే వాళ్లు కూడా ఎదురుచూసి అటో.. ఇటో షిఫ్ట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి..

సో గ్రౌండ్ లెవల్‌లో క్యాడర్‌ను నడిపించేవారు లేరు. అధినేతకు దిశానిర్ధేశం చేసేవారు లేరు. చుట్టు ముడుతున్న కేసులు.. విఫలమవుతున్న వ్యూహాలు.. పక్క చూపులు చూస్తున్న పార్టీలోని కీలక నేతలు..
అందుకే అంటోంది.. వైసీపీ పరిస్థితి ఇప్పుడు గాల్లో పెట్టిన దీపం లాంటిది అని.. మరి దీనిని జగన్ ఎలా కాపాడుకుంటారు..?

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×