EPAPER

BRS: జగన్ కోసమే ఏపీలో బీఆర్ఎస్సా?.. పవన్ కల్యాణ్ ఊరుకుంటారా?

BRS: జగన్ కోసమే ఏపీలో బీఆర్ఎస్సా?.. పవన్ కల్యాణ్ ఊరుకుంటారా?

BRS: కల్వకుంట్ల కుటుంబం, కొణిదెల కుటుంబం మధ్య మంచి స్నేహం. కేటీఆర్, రామ్ చరణ్ మధ్య సోదర బంధం. ఈ విషయం పవన్ కల్యాణే బహిరంగంగా చెప్పారు. ఇక, పవన్-కేటీఆర్.. పవన్-కేసీఆర్ ల మధ్య కూడా మంచి మైత్రి కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరు జనసేనాని. ఇది సరైన సమయం కాదనేది ఆయన అభిప్రాయం. భవిష్యత్తులో మాత్రం తప్పక తెలంగాణలో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించేశారు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్.. బీఆర్ఎస్ పేరుతో ఏపీలో అడుగుపెట్టడం వల్ల.. ఇక పవన్ కల్యాణ్ తెలంగాణలో తఢాకా చూపిస్తారనే వార్తలు వస్తున్నాయి. అప్పుడిక రాజకీయం మరింత రంజుగా మారడం ఖాయం అంటున్నారు.


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేసీఆర్ అడుగుపెడతారని ఇంతకుముందు ఎవ్వరూ ఊహించలేదు. కానీ, బీఆర్ఎస్ తో అది జరిగిపోయింది. ఏపీలోనూ గులాబీ జెండాలు, బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. అదే జోష్ తో.. తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు, పార్థసారథి, ప్రకాశ్ వంటి వాళ్లు బీఆర్ఎస్ కండువాలు కప్పుకోవడం జరిగిపోయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో చేరిన పలువురికి జనసేన వాసనలు ఉండటం ఆసక్తికరం. తటస్థులు అనే ఇమేజ్ ఉన్న పక్కా పొలిటికల్ లీడర్లనే కేసీఆర్ ఆకర్షిస్తుండటం.. ఆ సెక్షన్ ఇన్నాళ్లూ జనసేనకు అండగా ఉండటం వల్ల.. బీఆర్ఎస్ తో అన్నిటికంటే జనసేన పార్టీకే ఎక్కువ ముప్పు అనే వాదన వినిపిస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ వెనుక ‘కాపు’ కోణం కనిపిస్తుండటం కూడా జనసేనకు డ్యామేజే అంటున్నారు. రహస్య స్నేహితుడు జగన్ కు ఫేవర్ చేసేందుకే బీఆర్ఎస్ తో కేసీఆర్ ప్రయత్నిస్తున్నారనే అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. అందుకే, ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపై అధికార వైసీపీ నేతలు ఎలాంటి విమర్శలకు దిగడం లేదని.. ఆయనొస్తే ఓట్లు చీలి తమకే లాభం అనేలా ధీమాగా ఉన్నారని చెబుతున్నారు.

మరి, ఇంత జరుగుతుంటే జనసేనాని ఊరుకుంటారా? ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. తెలంగాణలో పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నరు. సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఆ సమయం ఇదేనంటున్నారు పార్టీ శ్రేణులు. తెలంగాణవాది కేసీఆర్.. బీఆర్ఎస్ పేరుతో ఏపీలో ఎంట్రీ ఇచ్చారు కాబట్టి.. ఇక జనసేన సైతం తెలంగాణ బరిలో దిగడానికి ఇదే మంచి తరుణం అని చెబుతున్నారు. ఇన్నాళ్లూ తాను తెలంగాణలో రాజకీయం చేస్తే.. మళ్లీ ఆంధ్రోళ్ల పాలన అని అంటారేమోనని పవన్ కాస్త వెనుకంజ వేశారు. కానీ, కేసీఆరే ఏపీకి వస్తే.. ఇక తెలంగాణలో పవన్ ను ప్రశ్నించే వారెవరు?


పవన్ కల్యాణ్ కు తెలంగాణలోనూ ప్రజాభిమానం ఎక్కువే. పార్టీ నిర్మాణం అంత బలంగా లేకపోయినా.. ఆయన్ను అభిమానించే ప్రజలు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కానీ, ఆ అభిమానం ఓట్లుగా మారుతుందా అంటే ఇప్పుడే చెప్పలేం. తెలంగాణ జనసేనలో చెప్పుకోదగ్గ లీడర్లు లేరు. పవన్ ఫోటోతోనే ఎన్నికల బరిలో దిగాలి. ఏపీలో ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్న జనసేనను తెలంగాణలో ఆదరిస్తారా? అంటే డౌటే. ముందు ఏపీలో తాడోపేడో తేల్చుకొని.. ఆ తర్వాత తెలంగాణకి వస్తే బెటర్ అనేది కొందరి వాదన. మరి, కేసీఆర్ ఏపీకి వచ్చేశారని.. జనసేనాని సైతం తెలంగాణ బరిలో దిగుతారా? బీఆర్ఎస్ తో జగన్ కు కలిసొస్తే.. పవన్ ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటారా? అనేది త్వరలోనే తేలుతుంది.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×