EPAPER

Suspected Container Vehicle: ఏపీలో కంటెయినర్ పాలిటిక్స్.. లోకేష్ ట్వీట్.. వైసీపీ కౌంటర్..!

Suspected Container Vehicle: ఏపీలో కంటెయినర్ పాలిటిక్స్.. లోకేష్ ట్వీట్.. వైసీపీ కౌంటర్..!
Suspected container vehicle
Suspected container vehicle

Suspected Container Vehicle at AP CM Camp Office: సీఎం వైఎస్ జగన్ నివాసం ప్రాంగణంలోకి కంటెయినర్ వెళ్లడంపై ఏపీలో పొలిటికల్ దుమారం రేగుతోంది. పోలీసుల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌ ఇంటి దగ్గరికి వెళ్లిన కంటెయినర్‌ను ఎందుకు తనిఖీ చేయలేదని ప్రశ్నించారు. నిబంధనలు ఎందుకు పాటించలేదని నిలదీశారు. ఆ కంటెయినర్‌లో ఏముందని ప్రశ్నించారు. బ్రెజిల్ సరుకా? లిక్కర్ మాఫియా ద్వారా మెక్కిన వేల కోట్లా? ఏపీ సెక్రటేరియట్‌లో ఇన్నాళ్లూ దాచిన దొంగ ఫైళ్లా? అని  లోకేశ్‌ ట్వీట్ చేశారు. డీజీపీ సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు.


నారా లోకేష్ ట్వీట్‌ పై వైసీపీ స్పందించింది. సీఎం వైఎస్ జగన్ ఇంటికి వచ్చిన కంటైనర్ విషయంలో రాద్దాంతం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. జగన్ ఇంట్లోనే సీఎం కార్యాలయం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆఫీసుకు సంబంధించి సామగ్రి కోసం కంటైనర్ వచ్చి ఉండొచ్చని వివరణ ఇచ్చారు. దొడ్డిదారిలో మంత్రైన లోకేష్‌కు ఇవన్నీ ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. డ్రగ్స్‌తో వచ్చిన కంటైనర్ ఎవరిదో అందరికి తెలుసని ఎదురుదాడికి దిగారు. బ్రెజిల్‌ నుంచి వచ్చిన డ్రగ్స్ ఎవరివో అందరికి తెలుసు అని అన్నారు. లోకేష్ బంధువులే డ్రగ్స్ కేసుల్లో ఉన్నారని ఆరోపించారు.

మంగళవారం సాయంత్రం ఓ కంటెయినర్ సీఎం వైఎస్ జగన్ ఇంటి ప్రాంగణంలోకి వెళ్లింది. సాధారణంగా ప్రధాన గేటు దాటాక రెండో చెక్‌పోస్టులో వాహనాలను స్కానింగ్ చేస్తారు. వెనుకవైపు నుంచి రాంగ్‌రూట్‌లో  కంటెయినర్‌ వచ్చింది. అయితే అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది ఆ కంటెయినర్ ను తనిఖీ చేయకుండానే లోపలికి పంపించారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ గేటు వద్ద కంటెయినర్‌ను వెనక్కి తిప్పి గంటసేపు నిలిపి ఉంచారు. ఆ తర్వాత వచ్చిన దారిలోనే కంటెయినర్‌  వెనక్కి వెళ్లిపోయింది. అప్పుడు కూడా ఎలాంటి తనిఖీలు, స్కానింగ్‌ చేయలేదు. కంటెయినర్‌ వాహనం నెంబర్‌ AP 16 Z 0363 . ఈ వాహనంపై పోలీస్‌ స్టిక్కర్ ఉంది. సాధారణంగా జడ్ సిరీస్ ఆర్టీసీ బస్సులకు, పీ సిరీస్ పోలీసు వాహనాలకు ఉంటుంది.  దీనిపైనే అనుమానాలను టీడీపీ వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో లోకేశ్ ట్వీట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


Also Read: అదే సెంటిమెంట్.. జనంలోకి జగన్.. పరదాల మాటేంటి ?

మెయిన్ గేటు నుంచి నుంచి డివైడర్‌ ఎడమ వైపు నుంచి ఈ వాహనాలు సీఎం క్యాంపు కార్యాలయంలోనికి అనుమతిస్తారు. మధ్యలో రెండో చెక్ పోస్టు వద్ద ఆటోమేటిక్ స్కానర్ ఉంటుంది. ఇక్కడ కూడా భద్రతా సిబ్బంది వాహనం నంబర్, వివరాలను సరిచూస్తారు. ముందుగా అనుమతి ఉన్న వాహనాలనైతే ఆ స్కానర్ మీదుగా లోపలికి పంపుతారు.

మంగళవారం సీఎం క్యాంపు ఆఫీస్ లోకి వచ్చిన కంటెయినర్ ప్రధాన గేటు వద్ద ఎడమవైపు రహదారిలో వచ్చింది. రెండో చెక్ పోస్టుకు కాస్త ముందుగానే ఎడమవైపు కాకుండా.. కుడి వైపునకు మళ్లించారు. రాంగ్‌రూట్లోనే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లారు. అందువల్ల రెండో చెకోపోస్టు వద్ద వాహనాన్ని స్కాన్ చేయలేదు.

ఈ కంటెయినర్ ఎందుకు వచ్చింది? అన్ని వాహనాల మాదిరిగా ఎడమవైపు నుంచి కాకుండా రివర్స్ లో వెళ్లడం, అలా వెళుతున్నా భద్రతా సిబ్బంది వాహనాన్ని ఆపకపోవడం ఇవన్నీ సందేహాలకు దారితీస్తోంది. ఈ అంశాలను టీడీపీ లేవనెత్తుతోంది.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×