EPAPER

Kovuru Politics | కోవూరులో అన్నాదమ్ముల హైడ్రామా!.. నల్లపురెడ్డి బ్రదర్స్ మధ్య విభేదాలు!

Kovuru Politics | కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన సోదరుడు రాజేంద్రల మధ్య విభేదాలు రచ్చకెక్కడం వైసీపీలో కలకలం రేపుతోంది. ఇంతకాలం అపూర్వ సహోదరుల్లా కనిపించిన అన్నదమ్ముల మధ్య ఎన్నికల ముందు విభేదాలు బహిర్గతమవ్వడం కోవూరు వైసీపీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తున్నాయంట.

Kovuru Politics | కోవూరులో అన్నాదమ్ముల హైడ్రామా!.. నల్లపురెడ్డి బ్రదర్స్ మధ్య విభేదాలు!

Kovuru Politics | కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన సోదరుడు రాజేంద్రల మధ్య విభేదాలు రచ్చకెక్కడం వైసీపీలో కలకలం రేపుతోంది. ఇంతకాలం అపూర్వ సహోదరుల్లా కనిపించిన అన్నదమ్ముల మధ్య ఎన్నికల ముందు విభేదాలు బహిర్గతమవ్వడం కోవూరు వైసీపీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తున్నాయంట. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యే తమ్ముడు ఆన్నకు వ్యతిరేకంగా మాట్లాడటం.. ఆవేదన వ్యక్తం చేస్తుండటం.. వెనుక ఏదైనా వ్యూహం ఉందా?.. అన్నను టార్గెట్ చేసి ..అన్న కొడుకుపై ప్రేమ చూపించడం వెనుక ఉన్న మతలబు ఏంటి..?


ఉమ్మడి నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. దివంగత మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లా రాజకీయాల్లో నల్లపురెడ్డి కుటుంబం ఒకప్పుడు చక్రం తిప్పింది. తండ్రి తర్వాత ప్రసన్నకుమార్‌రెడ్డి సైతం రాజకీయాల్లో తనదైన స్టైల్ చూపిస్తూ దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కోవూరు ఎమ్మెల్యేగా వైసీపి నుంచి గెలిచి కొనసాగుతున్నారు.

నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి వారసుల్లో మరొకరు నల్లపు రెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తమ్ముడాయన. ఇటీవల కాలం వరకు ఇద్దరూ అపూర్వ సోదరులుగా పలు సందర్భాల్లో వేదికలపై కనిపించారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని పలు సందర్భాల్లో ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను ఇరువురు స్పష్టం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రసన్నకుమార్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని .. రాజేంద్ర కుమార్‌రెడ్డి డిమాండ్ చేయడం జిల్లా వైసీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. ప్రసన్న కుమార్ రెడ్డి వైఖరితో తన తండ్రి శ్రీనివాసులరెడ్డికి కళంకం ఏర్పడే పరిస్థితి ఉందని రాజేంద్రకుమార్ అంటున్నారు స్పష్టం చేశారు. ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇదే విషయాన్ని తెలియజేస్తానని బహిరంగ ప్రకటన చేశారు.


దీంతో సైలెంట్ గా ఉన్న కోవ్వూరు నియోజకవర్గ రాజకీయం గరం గరం గా మారింది. అధికార ప్రతిపక్ష విమర్శల పరంపర మామూలే. అయితే స్వపక్షంలోనే విపక్షం అన్నట్లు సోదరుడే విమర్శలు ఎక్కు పెట్టడంతో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇరకాటంలో పడ్డట్లైంది. సొంత సోదరుడే ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వవద్దని సీఎంను అభ్యర్థించడం వెనుక మతలబు ఏంటి అన్న కోణంలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. అన్నకి టికెట్ వద్దంటున్న తమ్ముడు.. అన్న కొడుకుపై ప్రేమ ఒలకపోస్తున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి కుమారుడు రజత్‌కుమార్ రెడ్డికి ఈసారి జరిగే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలంటున్నారు. అలా తనకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక లేదని చెప్తూనే .. సొంత కొడుకుతోనే అన్న ప్రసన్నకుమార్‌కి చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్నారు.

నల్లపురెడ్డి ఫ్యామిలీలో సడన్‌గా ఈ ట్విస్ట్ ఏంటా అని ఆరా తీస్తే .. అసలు విషయం బయటపడింది. కొంతకాలంగా అన్నదమ్ముల కుటుంబాల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని .. ఆ రెండు కుటుంబాలకు దగ్గరగా ఉండే వారు చెప్తున్నారు. ఆ విభేదాలు ఇప్పుడు బట్టబయలు అయ్యాయని పేర్కొంటున్నారు. ఇటీవల కోటలో జరిగిన వారి కుటుంబ కార్యక్రమానికి కూడా నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి కుటుంబం దూరంగా ఉంది. దాన్నిబట్టి రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. విభేదాలతోనే నలపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి తన సోదరుడు ప్రసన్న కుమార్ రెడ్డి పై వ్యతిరేక గళం వినిపించారా? లేదా?.. కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలవాలన్న కోరికకు అలా బయటపెట్టారా? అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది.

నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసుడిగా తాను కూడా గుర్తింపు గౌరవం పొందాలనుకోవడం తప్పు కాదు కదా? అని రాజేంద్రకుమార్ సన్నిహితుల వద్ద అంటున్నారంట. అందుకే ఇప్పుడు వ్యతిరేక గళం వినిపించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అది స్ఫష్టంగా చెప్పకుండా.. తన అన్న ప్రసన్నకుమార్‌ నియోజకవర్గ వైసీసీ శ్రేణులను, ప్రజలను పట్టించుకోవడం లేదని ప్రచారం మొదలుపెట్టారంటున్నారు. ఆ నెగిటివ్‌తో ఆయన ఓడిపోతే .. తండ్రి ప్రతిష్టకు భంగమని అంటున్నారంట. ఆ క్రమంలోనే రాజేంద్ర తాజాగా ఇలాంటి ప్రకటన చేశారని.. అది స్వయంగా చెప్పకుండా వాట్సప్‌లో ఆడియో పోస్ట్ పెట్టారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఏదేమైనా సిట్టింగ్ రాజేంద్ర కుమార్‌ గ్రూపులో పోస్ట్ చేసిన ఆడియో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే విషయంపై కొవ్వూరు నియోజకవర్గం లో చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కుమారుడికి టికెట్ ఇవ్వాలని రాజేంద్ర కుమార్ రెడ్డి ఎందుకు పేర్కొన్నారు అనే అంశంపై కూడా రాజకీయ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఏదేమైనా ఈ విషయంపై ఇప్పటివరకు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నోరుమెదపలేదు. సోదరుడే కంట్లో నలుసుగా మారిన ఎన్నికలవేళ .. ఎమ్మెల్యే సర్దుబాటు ధోరణితో కుటుంబ విభేదాలను సరిచేసుకుంటారా? .. లేక రాజేంద్ర కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు దీటుగా బదులుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×