EPAPER

RGV’s VYOOHAM: ‘వ్యూహం’ టీజర్ సీన్ టు సీన్.. జగనే డబ్బింగ్ చెప్పారా?

RGV’s VYOOHAM: ‘వ్యూహం’ టీజర్ సీన్ టు సీన్.. జగనే డబ్బింగ్ చెప్పారా?
VYOOHAM teaser

Ram Gopal Varma Vyuham Movie(Breaking news in Andhra Pradesh) : ‘వ్యూహం’ అత్యంత వ్యూహాత్మకంగా ఉంది. 2 నిమిషాల 45 సెకన్ల టీజర్ వదిలారు వర్మ. ఇంకే.. టైమ్ బాంబులా పేలుతోంది వ్యూహం అస్త్రం.


సీన్ !: వైఎస్సార్ హెలికాప్టర్‌లో వెళ్తున్న సీన్‌తో ఓపెన్ చేశారు. సెప్టెంబర్ 2, 2009 అని ఆ డేట్ కూడా వేశారు. నల్లమల కొండల్లో హెలికాప్టర్ కూలి పేలిపోతున్న దృశ్యాలను లాంగ్ షాట్‌లో చూపించారు. సో, వ్యూహం సినిమా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పటి నుంచి మొదలవుతుందని అర్థమవుతోంది.

సీన్ 2: కట్ చేస్తే, సీన్ జగన్ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ఒకతనికి ఫోన్ కాల్ వస్తుంది. అతను హైరానా అవుతాడు. వేగంగా పైఅంతస్తులోకి పరుగెడుతుంటారు. కెమెరా అతన్నే ఫాలో అవుతూ వెళ్తుంది. రూమ్ లోకి వెళ్తే.. అక్కడ బనియన్‌లో ఉన్న జగన్ శీర్షాసనం వేసుకుని కనిపిస్తాడు. కెమెరా తలకిందులుగా చూపిస్తూ.. రొటేట్ అవుతుంది. వర్మ మార్క్ టేకింగ్‌ కనిపిస్తుంది ఈ సీన్లో. జగన్‌కు యోగా చేసే అలవాటు ఉందని ఈ సీన్‌తో చెప్పే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది.


సీన్ 3: ఎన్టీఆర్ ఫోటో బ్యాక్ డ్యాప్ నుంచి చంద్రబాబును చూపిస్తారు. బాబుతో పాటు కొందరు టీడీపీ నేతలు సీరియస్‌గా చూస్తూ ఉంటారు. వైఎస్సార్ చనిపోయినట్టే.. ఇక మనదే రాజ్యం అనుకుంటున్నట్టు ఉంటుంది ఆ సీన్.

సీన్ 4: మళ్లీ జగన్ ఇల్లు. భారతి, విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనిల్‌కుమార్.. మిగతా కుటుంబ సభ్యులు టీవీలో వైఎస్సార్ మిస్సింగ్ న్యూస్‌ను చూస్తూ షాకయ్యే సీన్ అది. అంతా హాల్‌లో ఉంటే.. ఆ పక్కనే ఉన్న గదిలో జగన్ ఏడుస్తూ ఉంటాడు. చేతిలో ప్రార్థనా మాల పట్టుకుని.. తండ్రి ఫోటో వైపు తదేకంగా చూస్తూ బాధతో ఏడ్చే దృశ్యాలు అభిమానుల గుండెలను టచ్ చేయడం గ్యారెంటీ.

సీన్ 5: వెంటనే ఫ్రేమ్‌లోకి మళ్లీ చంద్రబాబు వస్తారు. క్రూరంగా, ఆనందం, వికృతంగా నవ్వుతున్నట్టు చూపిస్తారు.

సీన్ 6: రోశయ్య పరామర్శకు రావడం. రోశయ్య క్యారెక్టర్‌లో.. చనిపోయిన రోశయ్యనే తిరిగొచ్చి రియల్‌గా నటించారా అన్నట్టు ఉంటుంది. అచ్చం.. అచ్చు గుద్దినట్టు రోశయ్యలానే అనిపిస్తాడా నటుడు.

సీన్ 7: రోశయ్య సీన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోగానే.. ఆనాటి కాంగ్రెస్ లీడర్ శంకర్రావు క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అధిష్టానం మనిషిగా.. అప్పట్లో జగన్‌తో డీల్ మాట్లాడింది ఆయనే అంటారు. జగన్ సోఫాలో కూర్చొని ఉంటే.. శంకర్రావు క్యారెక్టర్ ఏదో ఫైల్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు. కేసులు, బెదిరింపుల ఫైలో? ఆశపెట్టే తాయిలాల ఫైలో? సినిమాలోనే తెలుస్తుంది.

సీన్ 8: జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసే సీన్. పోలీసులు, సీబీఐ అధికారులు జగన్‌ను బలవంతంగా అరెస్ట్ చేస్తుంటారు. అభిమానులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ స్పాట్‌లో భారతి కూడా ఉంటుంది. ఆమెను ఖాకీలు కట్టిడి చేస్తారు. నడిరోడ్డు మీదే బోరున ఏడుస్తుంటుంది భారతి. ఆనాటి జగన్ అరెస్ట్ విషయాన్ని బాగా ఎమోషనల్‌గానే చూపించారు ఆర్జీవీ.

సీన్ 9: ఇంట్లో జగన్, భారతిలు సీరియస్‌గా ఏదో చర్చించుకుంటుంటారు. ఆ తర్వాత జగన్ ఓదార్పు యాత్ర సీన్స్ వస్తాయి. వెంటనే చదరంగంలో రాజు పావుతో వ్యూహం టైటిల్ వస్తుంది.

సీన్ 10: జగన్, భారతిలు నవ్వుతూ కనిపిస్తారు. విజయోత్సాహంతో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. బహుషా.. జగన్ గెలిచిన న్యూస్ కావొచ్చు అది.

సీన్ 11: అశేష ప్రజానీకం హర్షాతిరేకాల మధ్య.. జగన్ తన సిగ్నేచర్ మార్క్ చేతులెత్తి దండంపెడుతూ.. స్కార్పియో ఎక్కే దృశ్యాన్ని.. బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తారు. అది, సీఎంగా జగన్ ప్రమాణ స్వీకార సందర్భం.

సీన్ 12: ఎండ్ ఫ్రేమ్. ఇప్పటి వరకూ కేవలం ఆర్ఆర్‌తోనే నడుస్తుంది టీజర్ అంతా. లాస్ట్‌లో ఒకే ఒక డైలాగ్ పెట్టారు. “అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు”… ఇదీ జగన్ క్యారెక్టర్ చెప్పే డైలాగ్. కంప్లీట్‌గా జగన్ మాట్లాడినంటే ఉంటుంది ఈ డైలాగ్. ఆయన యాసలోనే.. ఆయనే డబ్బింగ్ చెప్పారా? అనిపించేలా ఉంది.

మొత్తంగా వ్యూహం టీజర్‌తో రాజకీయ దుమారమే. జగన్‌లోని మనకు తెలీని ఎమోషనల్ యాంగిల్‌ను చూపించే ప్రయత్నంలా ఉంది. భారతితో అనుబంధం.. జగన్ వ్యూహాల్లో ఆమె పాత్ర.. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ అనుభవించిన బాధ.. ఆనాటి రాజకీయ ఒత్తిడిలు.. మడమ తిప్పకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగిన.. జగన్ బయోపిక్‌లోని కీలక రియల్ పిక్.. ఈ ‘వ్యూహం’.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×