EPAPER

Vizianagaram Politics : బొత్సకి పక్కలో బళ్లెం.. మజ్జి శ్రీను బొత్సకి చెక్ పెట్టనున్నారా?

Vizianagaram Politics : ఉత్తరాంధ్రలో ఎదురులేని నాయకుడిగా ఎదిగిన బొత్స సత్యనారాయణకు ఇప్పుడు ఫ్యామిలీలోనే ప్రత్యర్థి తయారయ్యారా? విజయనగరం జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పేస్థాయికి ఎదిగిన బొత్సాకు సొంత మేనల్లుడే ఏకు మేకవుతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానం వస్తోంది. బొత్సా స్టేట్ లీడర్ అయిన నాటి నుంచి జిల్లా బాధ్యతలు ఎంతో నమ్మకంతో తన మేనల్లుడైన చిన్న శ్రీనుకు అప్పగించారు బొత్సా. అలాంటిదిప్పుడు ఆ మామ అల్లుళ్ల మధ్య ఆధిపత్యపోరు ఎందుకు మొదలైంది?నిజంగా వారిద్దరికి చెడిందా? లేకపోతే ఇద్దరు తమకు కష్టమని వైసీపీ పెద్దలే ఆ గ్యాప్ క్రియేట్ చేశారా?

Vizianagaram Politics : బొత్సకి పక్కలో బళ్లెం.. మజ్జి శ్రీను బొత్సకి చెక్ పెట్టనున్నారా?

Vizianagaram Politics : ఉత్తరాంధ్రలో ఎదురులేని నాయకుడిగా ఎదిగిన బొత్స సత్యనారాయణకు ఇప్పుడు ఫ్యామిలీలోనే ప్రత్యర్థి తయారయ్యారా? విజయనగరం జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పేస్థాయికి ఎదిగిన బొత్సాకు సొంత మేనల్లుడే ఏకు మేకవుతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానం వస్తోంది. బొత్సా స్టేట్ లీడర్ అయిన నాటి నుంచి జిల్లా బాధ్యతలు ఎంతో నమ్మకంతో తన మేనల్లుడైన చిన్న శ్రీనుకు అప్పగించారు బొత్సా. అలాంటిదిప్పుడు ఆ మామ అల్లుళ్ల మధ్య ఆధిపత్యపోరు ఎందుకు మొదలైంది?నిజంగా వారిద్దరికి చెడిందా? లేకపోతే ఇద్దరు తమకు కష్టమని వైసీపీ పెద్దలే ఆ గ్యాప్ క్రియేట్ చేశారా?


గురు శిష్యులులా ఉండే బొత్స సత్యనారాయణకి, మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (అలియాస్ చిన్న శ్రీనుకి) మధ్య రాజకీయంగా ఆధిపత్యపోరు మొదలైందన్న టాక్. విజయనగరం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం మారిందట . ప్రస్తుత రాజకీయాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే నాయకుడు బొత్స సత్యనారాయణ. సత్తిబాబు కంటే తలలు పండిన నేతలు ఎందరు ఉన్నా ఆయన తనదైన శైలిలో చక్రం తిప్పుతూ ఫోకస్ అయ్యారు.

పీఏసిఎస్ అధ్యక్షుడిగా , డీసీసీబీ ఛైర్మన్‌గా, ఎంపీగా ,3 సార్లు చీపురుపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర బొత్సాది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా ఉన్న టైంలో ఆయన పేరు ముఖ్యమంత్రి రేసులో కూడా వినిపించింది. అలా రాజకీయంగా ఎదుగుతూ వచ్చిన బొత్స. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు . ముఖ్యంగా 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక బొత్స మొదటిసారి చీపురుపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి. వైఎస్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. ఇక అక్కడి నుండి బొత్స వెనుదిరిగి చూసుకోలేదు. జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన బీసీ నేతగా, కాపుల్లో పట్టున్న నేతగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు .


అలాంటి ఫామ్‌లో ఉన్నపుడే విజయనగరం జిల్లా రాజకీయ బాధ్యతలను మేనల్లుడు చిన్న శ్రీనుకి అప్పగించారు బొత్స. సొంత అన్నదమ్ములను కూడా కాదని జిల్లాను మేనల్లుడు చేతిలో పెట్టారు. నాయకులైనా, కార్యకర్తలైనా, ఆఖరికి అధికారులైనా చిన్న శ్రీను దగ్గరకి వెళ్ళాల్సిందే. అప్పట్లో షాడో నేతగా చిన్న శ్రీను చెప్పిందే వేదం. ఆయన చెప్తే బొత్సా చెప్పినట్లే అన్నట్లు సాగుతూ వచ్చింది వ్యవహారం. స్టేట్ లో తాను చెప్పినట్లు జరిగేలా అధికారం చలయించిన బొత్స. జిల్లాలో మేనల్లుడిని పెట్టి కధ నడిపించేవారు .

జిల్లాలో వోక్స్ వేగన్ కుంభకోణం అంటూ ఎన్ని ఆరోపణలు వచ్చినా బొత్స హవా తగ్గలేదు. ఆఖరికి తనకి రాజకీయ జీవితాన్నిచ్చిన మాజీ మంత్రి సాంబశివరాజు. రాజకీయ చరమాంకంలో ఎక్కడ నుంచి పోటీ చేయాలో కూడా బొత్స నిర్ణయించే స్థాయికి వచ్చారంటే. ఆయన నెరిపిన రాజకీయం ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జిల్లాకు ఏ అధికారి రావాలి, ఎవరు కలెక్టర్ గా ఉండాలో కూడా బొత్స నే నిర్ణయించే వారనే టాక్ ఉంది. జిల్లాలో బొత్స సోదరులు ఎమ్మెల్యేలుగా, భార్య ఝాన్సీ ఎంపీగా గెలిచారంటేనే అర్థమవుతుంది ఆయన రాజకీయం.

అయితే జిల్లాలో ఆ ప్రాభవం మసకబారుతున్నట్లు కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు రెండుదశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసించిన బొత్సను ఇపుడు మేనల్లుడు చిన్న శ్రీను నిద్రపట్టకుండా చేస్తున్నాడట. మామ కల్పించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చాప కింద నీరులా సొంత ఇమేజ్ పెంచుకున్నాడు. మామకు మించిన అల్లుడిలా తయారయ్యారంటున్నారు. ఎమ్మెల్యేలను, యంత్రాంగాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకుంటున్నారట. అలా ఆయన పెత్తనమే మామ అల్లుళ్ల మద్య వైరం పెంచేలా చేసిందంటున్నారు.

ఎలా అయినా మంత్రి కావాలనేది చిన్న శ్రీను ఆశని ఆయన అనుచరులు చెప్తుంటారు. దానికి క్రమంగా గ్రౌండ్ చేసుకుంటూ వచ్చిన ఆయన వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మామతో సంబంధం లేకుండా ఏకంగా సీఎం జగన్ ని కూడా డైరెక్ట్ గా కలవగలిగే స్థాయికి ఎదిగారు. ఇపుడు ఏకంగా మేనమామ కుటుంబానికే ఎసరు పెట్టే పనిలో పడ్డారంట. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో చిన్న శ్రీనుకి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ గా, తరువాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్ అవకాశం కల్పించారు. అక్కడి నుంచి శ్రీను గేర్ మార్చి మరింత స్పీడ్ పెంచారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవ్వడానికి కార్యాచరణ మొదలుపెట్టారంట.

అందులో భాగంగానే బొత్సని రాజ్య సభకి పంపి చీపురుపల్లి సీటు తనకి కేటాయించాలని కోరారట చిన్న శ్రీను. అంతేకాదు నెల్లిమర్ల సీటు కావాలని పట్టుబట్టిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని. విశాఖ ఎంపీ క్యాండిడేట్‌గా పంపించి నెల్లిమర్లలో తన వియ్యంకుడు బద్దుకొండ అప్పలనాయుడుకి పార్టీలో పోటీ లేకుండా చక్రం తిప్పారట. అప్పటి నుంచి బొత్స , చిన్న శ్రీను మద్య వైరం బాగా ముదురిందంటున్నారు. మరోవైపు బొత్స అనుయాయులు కూడా చిన్న శ్రీనుని పట్టించుకోవడం లేదని దూరం పెట్టారనే గుసగుసలు వినిపస్తున్నాయి .

చిన్న శ్రీను దగ్గరకి వెళ్లారని తెలిస్తే బొత్స కూడా వారిని తన గుమ్మం కూడా తొక్కనీయడం లేదంట. అటు చిన్న శ్రీను కూడా తన అనుయాయులు ఎవరైనా బొత్స దగ్గరకి వెళ్ళినట్లు తెలిస్తే సీరియస్ అవుతున్నారనే టాక్ నడుస్తోంది. అదేదో సినిమాలో రావుగోపాలరావు చెప్పినట్లు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు అన్నట్లు ముదిరిపోయిందంట మామఅల్లుళ్ల ఆధిపత్య పోరు.

దానిపై కొందరు చిన్న శ్రీను వద్ద ప్రస్తావించగా తాను ఎస్. కోట లేదా ఎచ్చెర్ల నియోజకవర్గాలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినా అందుకు బొత్స మోకాలొడ్డారని ఇపుడు విజయనగరం ఎంపి టికెట్ ఇప్పించారని అంటున్నారంట. తాను ఎంపీగా పోటీచేస్తే. తనను తప్పించి జడ్పీ ఛైర్మన్ పదవిని తనకు అనుకూలంగా ఉండేవారికి ఇచ్చుకోవాలని బొత్స చూస్తున్నారని తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చారట. అంతేకాకుండా తనని ఎంపిగా కూడా గెలవనీయకుండా చేస్తారేమో అని చిన్న శ్రీను అనుమానిస్తున్నారంట.

మరోవైపు బొత్స వారి మధ్య ఉన్న గ్యాప్ గురించి అనుయాయులు అడుగుతుంటే ఏ పదవి కావాలో ఎంచుకోవాలని, రెండు కావాలంటే ఎలా అని తిరిగి ప్రశ్నిస్తున్నారట ఎంతోమంది పార్టీ కోసం కష్టపడుతున్నారని ఒకరికే రెండు అవకాశాలు ఉండవని అంటున్నారట. నెల్లిమర్లలో తన భార్య ఝాన్సీకి సీటు అడుగుతుంటే ఒకే జిల్లాలో పక్క పక్క నియోజకవర్గంలో రెండు సీట్లు భార్యభర్తలకు ఎలా ఇస్తారని చిన్నశ్రీను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి రాకుండా చేశాడని మేనల్లుడు కదా అని పగ్గాలు ఇస్తే తనకే పక్కలో బల్లెం లా మారాడని బొత్స ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట.

అదలా ఉంటే చిన్న శ్రీనుకి, బొత్సకి మధ్య గ్యాప్ పెంచింది వైసీపీ పెద్దలేనంటున్నారు. ఆ ఇద్దరు కలిసి ఉంటే జిల్లాలో తామేమీ చేయలేమని వ్యూహాత్మకంగా పావులు కదిపారంటున్నారు. అందులో భాగంగానే మామ,అల్లుళ్ళు ఇద్దరికీ ప్రాధాన్యత కల్పించి ఆధిపత్యపోరు రాజుకునేలా చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి వారిద్దరి మధ్య ఉన్నది నిజంగా ఆధిపత్య పోరా? లేకపోతే మామ అల్లుళ్ళు ఇద్దరు వైసీపీ ట్రాప్ లో పది ఒకరికి ఒకరు దెబ్బ తీసుకుంటున్నారా? అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరి చూడాలి ఈ పరిణామాలు ఎటు నుంచి ఎటు దారి తీస్తాయో?

Tags

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×