EPAPER

MVV Satyanarayana Missing: విశాఖ మాజీ ఎంపీ మిస్.. కేసుల భయంతోనేనా..?

MVV Satyanarayana Missing: విశాఖ మాజీ ఎంపీ మిస్.. కేసుల భయంతోనేనా..?

Vizag YCP Ex MP MVV Satyanarayana Missing: విశాఖ మాజీ ఎంపీ మిస్ అయ్యారు. ఎక్కడికి వెళ్లారో.. ఏమైపోయారో ట్రేస్ చేద్దామన్నా క్లూ దొరకని పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో ఎంవీవీ సత్యనారాయణ శాసనసభకు పోటీచేసి ఓటమిచెందారు. అంతే అప్పటి నుంచి ఇప్పటివరకు సదరు మాజీ ఎంపీ అడ్రస్ గల్లంతైంది. అసలు ఆయన ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటే ప్రజలకు పార్టీ నాయకులకు కనిపించరా.. విశాఖలో ఆ ప్రజా ప్రతినిధి విషయంలో ఏం జరుగుతుంది?


అవును విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణ కనిపించడం లేదు. అధికారంలో ఉన్న టైంలోనే అరుదుగా కనిపించిన ఆయన.. ఇప్పుడు మొత్తానికి అడ్రస్ లేకుండా పోయారు. ఓ వైపు కేసులు.. మరో వైపు పార్టీకి మెల్లమెల్లగా దూరమవుతున్న పరిస్థితి. విశాఖలో బడా వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ డాన్ ఎవరని అడిగితే టక్కున చెప్పే ఒకే ఒక్క పేరు ఎంవీవి సత్యనారాయణ. విశాఖలో కొమ్మాది,మధురవాడ, భీమిలి నుండి విశాఖ సిటీ, గాజువాక,దువ్వాడ వరకు 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ చూసినా MVV పేరుతో భారీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు దర్శనమిస్తాయి. 20 ఏళ్ల రియల్ ఎస్టేట్ బిల్డర్ వ్యాపారంలో మకుటం లేని మహారాజుగా ఎదిగిన MVVకి రాజకీయాల్లో చిక్కులు ఎదురయ్యాయి.

ఎంత సంపాదించినా అధికారం లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర, అధికారుల దగ్గర తలవంచుకుని ఉండాల్సిందే అని అర్థం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిల్డర్ గా విశాఖలో అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన MVVకి 2014 నుండి 19 మధ్య కాలంలో రాజకీయ నాయకులతో చిక్కులు వచ్చిపడ్డాయి. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కళా వెంకట్రావుకు బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణకి మధ్య వివాదం చెలరేగడంతో ఎంత సంపాదించినా, ఎంత పలుకుబడి ఉన్నా రాజకీయ నాయకులు దగ్గర తలవంచాల్సిందే అని గ్రహించాడు. శపదం చేసి మరీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే సమయంలో ఎంవీవీకి వైసీపీ నుండి ఆఫర్ రావడంతో ఆలోచించకుండా వైసీపీలో జాయిన్ అయ్యాడు. జగన్ వేవ్ లో విశాఖ ఎంపీగా 4414 ఓట్లతో గెలిచి గట్టెక్కారు.


ఎంపీగా గెలిచి రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తడంతో తనకు విశాఖపట్నంలో తిరిగే లేదనుకున్నాడు. 2019 నుండి 2024 వరకు ఐదేళ్లు విశాఖపట్నం ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ విశాఖ అభివృద్ధికి చేసింది శూన్యం. ఐదేళ్ల అధికారంలో ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని విశాఖ నగరంలో విలువైన భూముల్ని అడ్డగోలుగా లాక్కుని అనేక అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టేసి అమ్మేసుకుని కోట్లు సంపాదించేశారని ఆరోపణలు ఉన్నాయి. ఒకపక్క వ్యాపారం మరోపక్క రాజకీయం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఎంవీవీ సత్యనారాయణ జీవితం హ్యాపీగా సాగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతున్న ఎంవీవీ జీవితంలో ఒక మెరుపులాంటి డ్రామా తెర మీదకు వచ్చింది.

అదే ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదాంతం. ఎందుకు కిడ్నాప్ చేశారు ఎవరికి చేశారో ఆ కేసు చిక్కుముడి మాత్రం ఇప్పటికీ వీడలేదు. కొంతమంది వ్యాపార లావాదేవీల కోసమే కిడ్నాప్ జరిగింది అంటే మరికొందరైతే ఒక ఎంపీ కుటుంబానికి కిడ్నాప్ చేస్తే తెలియకుండా ఉంటుందా ఇదొక డ్రామా అంటూ కొట్టిపడేశారు. తర్వాత ఎంపీగా కొనసాగలేను అనుకున్నాడో, ప్రభుత్వం మారుతుందని ముందే భావించాడో తెలియదు కానీ ఏపీలో వ్యాపారం చేయలేను హైదరాబాదుకి మకాం మార్చేస్తాను అక్కడే వ్యాపారాలు చేసుకుంటారని ఆవేశంగా ప్రకటించేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కిడ్నాప్ కేసును తిరగదొడుతామంటోంది. ఎంవీవీ ప్యామిలీ మెంబర్స్ ను విచారణ చేస్తామని స్వయంగా హోంమంత్రి వంగలపూడి అనిత స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఆయన గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయట.

Also Read: శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఏపీలో కూడా మెట్రో రైల్

2024 ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎంవీవి సత్యనారాయణను విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందేమో మంత్రి అయిపోవచ్చు అనుకున్నాడో ఏమో తెలియదు గానీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుండి పూర్తయ్యే వరకు డబ్బులు మంచినీళ్లలా ఖర్చు పెట్టాడట. అయితే అంతా మనం అనుకున్నట్లే జరిగితే ఇంకా విధిరాత ఏముంటుంది… ఎంత ఖర్చు పెట్టినా ఎన్నికల కోసం ఆరు నెలల పాటు నిత్యం ప్రజల్లో తిరిగినా ఓటర్ల చేతిలో ఓటమి చెందాడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాలుగోసారి టీడీపీ నుంచి బరిలో దిగిన వెలగపూడి రామకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యాడు. కౌంటింగ్ రోజు ఉదయం 11 గంటలకే రిజల్ట్ తెలిసి పోవడంతో ఆ రోజు నుంచి స్టిల్ ఇప్పటివరకు ఎంవీవి ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. విశాఖలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి చెందిన తర్వాత ఎంవీవీ సత్యనారాయణపై వరుసగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి.

సిరిపురంలోని CBCNCకి చెందిన క్రైస్తవ భూములను అక్రమంగా లాక్కుని నిర్మాణాలు చేపడుతున్నారని ఆ నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేయాలని జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఒక్కరోజు గడవక ముందే ఎండాడలో ఉన్న హైగ్రీవ భూముల్లో నిర్మాణం చేపడుతున్న నిర్మాణాలపై స్థల యజమాని చిలుకూరి జగదీష్ ఆరిలోవ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. 12.51 ఎకరాలను నకిలీ పత్రాలు సృష్టించి MVV సత్యనారాయణ బలవంతంగా లాక్కుని నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. దాంతో ఆ మాజీ ఎంపీపైపది సెక్షన్లతో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఈ కేసుని స్క్వాష్ చేయాలని ఎంవీవీ హైకోర్టుకు కూడా వెళ్లారు.

అంతేకాదు అధికారం పోగొట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వైపు కూడా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కన్నెత్తి చూడలేదు. ఒకపక్క ఢిల్లీలో ధర్నా చేస్తే విశాఖ నుండి గల్లీ స్థాయి లీడర్లు కూడా హస్తినా వరకు వెళ్లారు.. కానీ మాజీ ఎంపీ హోదాలో ఎంవీవీ సత్యనారాయణ అటువైపు కన్నెత్తి చూడలేదు. దాంతో వైసీపీకి ఎంవీవీకి దూరం పెరుగుతుందని ప్రచారం జోరుగా సాగుతుంది. అదే టైంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. వరుసగా కేసులు నమోదవుతున్న వేళ బీజేపీ అయితే తనను కాపాడుతుందని భావిస్తున్నారట.

అయితే ఇప్పటికే ఎంవీవీ సత్యనారాయణ అక్రమ ఆస్తులపై విచారణ చేపడతామని అధికారంలోకి రాకముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ ప్రకటన చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉంది.. అలాంటప్పుడు ఎంవీవీ బీజేపీలో చేరకుండా పవన్ అడ్డుకుంటున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. దాంతో అటు వైసీపీలో ఉండలేక.. ఇటు బీజేపీలో జాయిన్ కాలేక.. కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థంకాక తల పట్టుకుంటున్నారట.

ఎండ్ వాయిస్: ఏది ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మకుటం లేని మహారాజులాగా ఎదిగిన మాజీ ఎంపీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం మాటేమో కానీ అనేక అవినీతి ఆరోపణలు, భూకబ్జాలను మాత్రం మూట కట్టుకున్నారు. ఇప్పుడు వాటి నుండి బయట పడలేక విశాఖలో ఉండలేక బయటకు వెళ్లలేక ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియక అజ్ఞాతంలో మగ్గిపోతున్నారనేది మాత్రం తెలుస్తుంది.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×