EPAPER

Joy Jemima Honey Trap Case: అసలు ఎవరు ఈ జాయ్ జెమిమా? ఆమె ఉచ్చులో పడే మగాళ్లను ఏం చేస్తోంది?

Joy Jemima Honey Trap Case: అసలు ఎవరు ఈ జాయ్ జెమిమా? ఆమె ఉచ్చులో పడే మగాళ్లను ఏం చేస్తోంది?

Joy Jemima Honey Trap Case: నేను ప్రేమిస్తున్నాను.. నువ్వే కావాలి.. నువ్వు లేక నేను లేను.. పెళ్లి చేసుకుందాం.. ఇదేదో సినిమా టైటిల్స్ అనుకుంటే పొరపాటే, ఈ మాటలు ఓ మాయలేడీ అస్త్రాలు. ఇవే మాటలకు బోల్తా పడ్డ కొందరు యువత.. నేడు పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతున్నారు. మరి కొందరు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా కొందరు ఉన్నదంతా ఊడ్చేశాం. ఇంకేముంది మా చెంత.. మాకు న్యాయం చేయాలంటూ లబోదిబోమంటున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో అందరికీ ప్రేమను పంచి, వంచించి మోసం చేసిన కిలాడి లేడీ ఈమె. ప్రేమ మోజులో ఉన్న యువతను ఆకట్టుకోవడంలో ఈమె తర్వాతే ఎవరైనా. అందుకే యువతకు ఆ మాటలకు, ఆమె అందానికి దాసోహమై నేడు అసలు విషయాన్ని తెలుసుకొని.. పోయాం మోసం.. పోయాం మోసం అంటూ రాగాలను తీస్తున్నారు. ఇంతకు ఆ మాయలేడీ ఎవరనుకుంటున్నారా.. యువత ప్రవేట్ వీడియోల సామ్రాజ్యానికి రాణిగా పరిచయమైన కిలాడి లేడీ జాయ్ జెమీమా.


కిలాడి లేడీ ఉదంతం వెలుగులోకి వచ్చిందిలా..
వైజాగ్ కు చెందిన ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు వైజాగ్ పోలీసులు. అమెరికాలో జాబ్ చేస్తున్న ఆ యువకుడు.. తాను జాయ్ జెమీమా అనే యువతి చేతిలో మోసపోయానని, తన ప్రవేట్ వీడియోలతో చిత్రహింసలు చేస్తుందని ఫిర్యాదు ఇచ్చాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు ముమ్మరం చేశారు. తొలుత కేసును తక్కువ అంచనా వేసిన పోలీసులకు మినిట్ టు మినిట్ ఈ కేసులో షాకుల మీద షాకులు తగిలాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు.. చాలా మంది యువత, కిలాడీ లేడీ బారిన పడి మోసపోయారని ఆధారాలు సేకరించి.. చివరకు జెమీమాను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టేశారు.

ఎవరు ఈ జాయ్ జెమీమా..
వైజాగ్ లోని మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీలో జాయ్ జెమీమా నివసిస్తుంది. ఉన్నత విద్యను కూడా పూర్తి చేసుకుంది. సోషల్ మీడియాలో మంచి పట్టు ఉంది ఈమెకు. అయితే అదే సోషల్ మీడియాతో మోసం చేయవచ్చని భావించింది. అతి తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తాలని అనుకుంది. అందానికి అందం, అంతే స్థాయిలో కవ్వింపు మాటలు జెమీమా సొంతం. అందుకే కొందరిని తన ముఠాలో కలుపుకొని ఇక తన నేర సామ్రాజ్యానికి పునాది వేసింది.


కవ్వింపు మాటలు.. ఆకట్టుకొనే ఫోటోలు..
నేటి యువతలో కొందరికి లవ్ అంటే జివ్వుమనాల్సిందే. మరీ నెలనెలా లక్షలు సంపాదిస్తున్న యువతకు మాత్రం ఎంజాయ్ మెంట్లు, లవ్వులు కాస్త దగ్గరగానే ఉంటాయి. అందుకే జెమీమా టార్గెట్ నెలనెలా లక్షలు సంపాదిస్తున్న యువతపై మళ్లింది. అలాంటి వారినే సెలెక్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా పరిచయం కావడం, అంతటితో ఆగక తన అందమైన ఫోటోలు సెండ్ చేయడం, ఫోన్ నెంబర్లు తెలుసుకొని, రోజూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేక నేను లేను అంటూ ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకోవడం ఈమె దినచర్యగా మార్చుకుంది. ఈమె వలలో పడుతున్న యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. జెమీమా ఆనందం అంతా ఇంతా కాదు.

లవ్ ఓకే కానీ వాట్ నెక్స్ట్..
తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనుకున్న జెమీమా.. లవ్ అంటూ దగ్గరకు కాగానే యువకులకు నమ్మకం కలిగేంత వరకు సైలెంట్ గా ఉండేది. ఆ తర్వాత కలుద్దాం రమ్మంటూ ఫోన్ లు చేసేది. ఆమెను కలిసేందుకు వచ్చిన వారితో.. కవ్వింపు మాటలతో.. ప్రవేట్ స్థలానికి తీసుకువెళ్ళేదట. అక్కడే తన ప్లాన్ అమలు చేసేది జెమీమా. మాటలతో బురిడీ కొట్టించి, మత్తు మందు ఇచ్చేది నమ్మి వచ్చిన యువతకు. ఇక అంతే అబ్బాయిల ప్రవేట్ వీడియోలు తీసి తన మొబైల్ ఫోన్ లో భద్రపరుచుకోవడం, ఆ తర్వాత వారిని బెదిరించడం తన అలవాటుగా మార్చుకుంది ఈమె.

తొలి ఫిర్యాదుతో వాస్తవాలు వెలుగులోకి..
వైజాగ్ కు చెందిన ఓ యువకుడు, అమెరికాలో ఉంటున్నాడు. జాబ్ చేస్తున్న అతనికి సోషల్ మీడియా ద్వారా జెమీమా పరిచయమైంది. ఆ పరిచయం ఫోన్ ల వరకు వెళ్లింది. మాటల్లో రోజురోజుకు హుషారు కూడా పెరిగింది. చివరకు అతని ఇంటి అడ్రస్ తెలుసుకొని, అక్కడికి వెళ్లి తాను సదరు యువకుడికి మంచి ఫ్రెండ్ అంటూ పరిచయం చేసుకొంది. చివరకు పెళ్లి చేసుకుంటానని చెప్పగానే, ఆ కుటుంబం కొంత వెనుకడుగు వేశారు, చివరకు అమెరికా వెళ్లిపోయారు. తన ప్లాన్ వర్కౌట్ కాక, తరచూ ఫోన్ చేసి ప్రేమ అంటే ఇదేనా.. నన్ను కలువు.. నేనెంటో, నా ప్రేమ ఏమిటో తెలుస్తుందంటూ చెప్పేది. ఇక ఆ మాటలు నమ్మిన యువకుడు నేరుగా విమానమెక్కి వైజాగ్ కు వచ్చేశాడు. ఇంకేముంది చక్కగా వెల్ కమ్ బోర్డు పట్టిన జెమీమా.. తన ఇంటికి తీసుకువెళ్లింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం మత్తు మందు ఇచ్చి, అతని ప్రవేట్ వీడియోలు తీసింది. బెదిరింపులకు పాల్పడింది.

పెళ్లి చేసుకుంటానన్నా వదలని జెమీమా..
వైజాగ్ యువకుడికి ప్రవేట్ వీడియోలు చూపించి జెమీమా బెదిరింపులకు పాల్పడగా.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అప్పుడే తన ముఠాను రంగంలోకి దింపిన ఆమె, లేదు.. కుదరదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడింది. చివరకు ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకున్నారు ఇద్దరు. ఆ ఫోటోలు కూడా తన వద్ద ఉంచుకున్న జెమీమా, ఇంట్లోనే అతడిని బంధించి రోజూ వేధించేది. పెళ్లి చేసుకుంటానని తెలిపినా కూడా వేధింపులు ఎక్కువ కాగా, తన వద్ద ఉన్న డబ్బులు లక్షల్లో ఇచ్చాడట ఆ యువకుడు. చివరకు తప్పించుకుందామని అనుకున్నా.. తన ముఠాతో చంపేస్తానని బెదిరించిందట జెమీమా. చివరకు ఈనెల 4వతేదీన అక్కడి నుండి తప్పించుకున్న యువకుడు అసలు విషయాన్ని పోలీసులకు చెప్పాడు.

రోజురోజుకు పెరుగుతున్న జెమీమా భాదితులు..
ముందుగా వైజాగ్ కు చెందిన యువకుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు ముమ్మరం చేశారు. చివరికి జెమీమాను అరెస్ట్ చేసి విచారించారు. ఈ విచారణలోనే షాకింగ్ న్యూస్ తెలిసింది పోలీసులకు. హనీట్రాప్ పేరిట యువకులకు వల వేసి మత్తు మందు ఇవ్వడం, ప్రవేట్ వీడియోలు తీయడం, ఆపై బెదిరించడం ఇదే ఈమె వృత్తిగా ఎంచుకుందని తెలుసుకున్నారు. అలాగే ఈమెకు సహకరిస్తున్న ముఠా అంతు తేల్చేందుకు పోలీసులు ముందడుగు వేసి, వారి కోసం గాలింపు చేపట్టారు.

Also Read: Aliens: ఏలియన్స్ జాడ దొరికేసింది..! ఇదిగో సాక్ష్యాలు.. సంచలనం రేపుతున్న రిపోర్ట్..

నిద్ర పోలేకున్నా అంటూ వెలుగులోకి మరో భాదితుడు..
జెమీమాను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న మరో భాదితుడు తన ఆవేదన వెళ్లగక్కుతూ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ కాగా, జెమీమా కిలాడీ కాదు జగత్ కిలాడీ లేడీ అంటూ పోలీసులు గుర్తించారు. ఈ భాదితుడు కూడా ఆమె చేతిలో మోసపోగా, మత్తు మందు ఇచ్చిన క్రమంలో సైడ్ ఎఫెక్ట్ రాగా, చర్మం మొత్తం ఎర్రబారి పోయింది. ఒళ్లంతా పుండ్లుగా మారగా, నిద్రపోలేని రాత్రులు గడుపుతున్నట్లు, పోలీసులు మంచి పని చేశారని అభినందనలు కూడా తెలిపాడు. ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దంటూ ప్రభుత్వాన్ని కోరాడు.

తెలుగు రాష్ట్రాల్లో జెమీమా భాదితులు..
హనీట్రాప్ కేసులో జెమీమాను అరెస్ట్ చేసినట్లు వైజాగ్ సీపీ బాగ్చి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో భాదితులు ఉన్నట్లు, అది కూడా పదుల సంఖ్యలో జెమీమా గ్యాంగ్ బారిన యువకులు పడ్డారని, వారు ఫిర్యాదులు ఇవ్వవచ్చని సూచించారు. ఇక అంతే సీపీ చెప్పిన మాటతో హైదరాబాద్ నుండి కూడా ఓ యువకుడు నేను కూడా లక్షలు ఇచ్చాను, నన్ను కూడా మత్తు మందు చల్లి మోసం చేసిందంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా రోజురోజుకు భాదితుల ఫిర్యాదులు అధికం కావడంతో, ముఠా ఆటకట్టించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

అందాన్ని పెట్టుబడిగా ఎంచుకొని, యువత అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రెండు తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన మాయలేడీ జెమీమా చివరకు కటకటాలపాలు కాగా, మోసపోయిన వారు ఒక్కొక్కరిగా బయటకు రావడం విశేషం. ఇటువంటి మోసాలను చూసైనా.. యువత అపరచిత పరిచయాల పట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు. మొత్తం మీద ఈ కేసును ఛేదించిన వైజాగ్ పోలీసులకు జేజేలు పలుకుతున్నారు భాదితులు. సోషల్ మీడియా పరిచయాలలో ఆకట్టుకొనే అందమంటూ ఆకర్షితులవుతున్నారా.. చివరకు ఇలాంటి లేడి కేడీల చేతిలో మోసపోతారు.. జర జాగ్రత్త సుమా !

Related News

AP CM Warning: ఎమ్మెల్యేలకు బాబు స్ట్రాంగ్ వార్నింగ్.. అందులో వేలు పెట్టారో.. ఒప్పుకోనంటూ హెచ్చరిక

YS Sharmila: ఆర్టీసీ బస్సెక్కిన వైయస్ షర్మిళ.. కండక్టర్ కు ప్రశ్నల వర్షం.. అంత మాట అనేశారేంటి ?

Tension In YCP Leaders: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. పొంతన లేని సమాధానాలు, సీఐడీకి ఇచ్చే ఛాన్స్

AP Govt on BigTV News: మద్యం ప్రియుల డిమాండ్స్‌తో ‘బిగ్ టీవీ’ కథనం.. కిక్కిచ్చే న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Rain Alert: బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

Duvvada Srinivas Madhuri: అమ్మో దువ్వాడ.. మాధురి.. ఇంత స్కెచ్ వేశారా.. అంతా ప్లాన్ ప్రకారమేనా?

Ram Mohan Naidu: 3 రోజుల్లో 30 కి పైగా బెదిరింపులు.. విమానయాన శాఖ అలర్ట్.. ఇంతకు బెదిరింపులకు పాల్పడింది ఎవరంటే ?

Big Stories

×