EPAPER
Kirrak Couples Episode 1

Viral Video : నెట్టింట వీడియో వైరల్ .. వైసీపీ-జనసేనల మధ్య కామెంట్స్ వార్..ఎవరితను ?

Viral Video : నెట్టింట వీడియో వైరల్ .. వైసీపీ-జనసేనల మధ్య కామెంట్స్ వార్..ఎవరితను ?

Viral Video : ఎలక్షన్లు సమీపిస్తున్నాయంటే చాలు.. ఎక్కడ ఏం జరిగినా.. దానిపై అధికార, ప్రతిపక్షాల పార్టీలకు చెందినవారు విమర్శలు చేసుకోవడం పరిపాటిగా మారింది. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత.. ఈ విమర్శలు హద్దులు దాటుతున్నాయి. నేతల రాజకీయ జీవితాల నుంచి వ్యక్తిగత జీవితాల వరకూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు ఏపీ నేతలు చేసే కామెంట్స్ ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ విషయంలో ఏ పార్టీవాళ్లుకీ మినహాయింపు లేదు. మాకు ఆ మాత్రం సంస్కారం ఉందంటూనే.. తనపై, కుటుంబంపై కామెంట్స్ చేసేవారికి ఒక ప్రతిపక్ష అగ్రనేత అధికార పార్టీ నేతలకు చురకలంటిస్తుంటారు.


అసలు విషయానికొస్తే.. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ని చూస్తే భవానీ మాల ధరించి.. చేతిలో జనసేన జెండా పట్టుకుని.. కాలినడకన వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడన్న దానిపై సరైన సమాచారం లేదు కానీ.. ఎవరో ఇతడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఒక యూజర్ “వీడు ఎవడో పిచ్చ నా కొడుకు .రోడ్ల వెంబడి తిరుగుతూ ఉన్నాడు” అని క్యాప్షన్ ఇచ్చారు. అంతే.. దీనిని చూసిన జనసేనులు ఊరుకుంటారా ? ఆ యూజర్ కు కౌంటర్ గా వరుస కామెంట్లు చేశారు. “మీకన్నా దారుణంగా అయితే లేడు కదా.. మీకున్న తెలివితేటలు లేక అలా తిరుగుతున్నాడు.” అని ఒకరంటే.. “ప్రపంచంలో చిత్రవిచిత్ర గాళ్లంతా జనసేన నేనా” “అంతో ఇంతో పిచ్చి లేకపోతే ఆ పార్టీ లో వుండరు” “పవన్ కళ్యాణ్ కి రేపటి రోజున వచ్చే పరిస్థితి ఇలాగే ఉంటుంది” అంటూ వరుసగా విమర్శలు చేయడం మొదలు పెట్టారు వైసీపీ సపోర్టర్స్.

పవన్ కల్యాణ్ పేరు మీద నెగిటివ్ కామెంట్ వస్తే జనసేన కార్యకర్తలు ఊరికే ఉంటారా మరి. అంతకు దారుణంగా కామెంట్స్ చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు మీరంతా దేనికి తిరిగారో చెప్పండంటూ.. రెచ్చిపోయారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో మద్యం తాగుతున్నవారు ఇంతకన్నా దారుణంగా రోగాల బారిన పడి చనిపోయారని ధ్వజమెత్తారు. ఇలా చిన్న వీడియో క్లిప్ పై జనసేన – వైసీపీ కార్యకర్తల మధ్య కామెంట్ల యుద్ధమే జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.


https://twitter.com/varra1987/status/1713872967992836287?s=48

Related News

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లుగగూర్పాటు కలిగించే వాస్తవాలు!

Flood Victims: వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచిన ప్రభుత్వం.. ఎంతంటే?

TTD Assets : టీటీడీ ఆస్తులు, ఆభరణాల సంగతేంటీ? జగన్ టీమ్‌పై సందేహాలు.. చంద్రబాబుకు పవన్ లేఖ!

honorarium: మీరు జూనియర్ న్యాయవాదులా..? అయితే ఈ శుభవార్త మీ కోసమే..

Tirumala Laddu Issue: ఏఆర్ డెయిరీ లారీ వివరాలు విడుదల.. ఎంతకి దిగజారావ్ జగన్ : టీడీపీ ఫైర్

Tirupati Laddu Row: తిరుమలలో భూమన హల్ చల్.. తప్పు చేయలేదనా? పాపాన్ని వదిలించుకోడానికా?

Anjaneyulu: జగన్… సిట్‌తో పాపాల పుట్ట పగలడం ఖాయం: జీవీ ఆంజనేయులు

Big Stories

×