Big Stories

Viveka Murder Case : వివేకా సోదరి సంచలన కామెంట్స్.. వాళ్లే హంతకులు..!

Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ఒక అడుగు ముందుకు రెండుఅడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చాలారోజులుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు నోటీసులు ఇచ్చినా అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకావడంలేదు. తన తల్లి అనారోగ్యంతో ఉన్నారని వారంరోజుల వరకు తాను విచారణకు రాలేనని ఇప్పటికే ఆయన సీబీఐకు స్పష్టం చేశారు.

- Advertisement -

కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మీ చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే అవినాష్ రెడ్డి ఉన్నారు. వైసీపీ నేతలు, కొంతమంది ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అక్కడే తిష్ట వేశారు. ఒకదశలో అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందు రెండు సీబీఐ బృందాలు వచ్చాయి. జిల్లా ఎస్పీతోనూ ఈ విషయంపై చర్చించాయి. కానీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెనుకడుగు వేశాయి.

- Advertisement -

మరోవైపు జగన్ కుటుంబ సభ్యుల నుంచి అవినాష్ రెడ్డికి నైతిక మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి సీఎం జగన్ తల్లి విజయమ్మ వచ్చి అవినాష్ రెడ్డి తల్లిని పరామర్శించి వెళ్లారు. తాజాగా జగన్ మేనత్త, వైఎస్ వివేకానందరెడ్డి సోదరి విమలారెడ్డి కూడా అవినాష్ రెడ్డి వద్దకు రావడం ఆసక్తిని రేపింది. ఇదే సమయంలో వివేకా హత్యపై ఆమె సంచలన కామెంట్లు చేశారు.

వివేకాను చంపిన వారు బయట తిరుగుతున్నారని విమలారెడ్డి ఆరోపించారు. తప్పు చేయని వారిని జైల్లో పెట్టారని అన్నారు. అవినాష్‌ను టార్గెట్ చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. తన కుటుంబం ఎవరినీ హత్య చేయలేదని సునీత మొదట చెప్పారని.. కానీ ఆ తర్వాత సునీత మాట మార్చారని విమర్శించారు. తప్పు అని చెప్పినందుకే సునీత తమతో మాట్లాడటం లేదన్నారు. ఆలస్యమైనా న్యాయం జరుగుతుందన్నారు. అవినాష్‌కు ధైర్యం చెప్పడానికి వచ్చానని విమలారెడ్డి స్పష్టం చేశారు.

మొన్న విజయమ్మ, ఇప్పుడు విమలారెడ్డి వచ్చి అవినాష్ రెడ్డికి నైతికంగా మద్దతు తెలపడం ఆసక్తిగా మారింది. కొంతకాలంగా జగన్ కు కుటుంబతో దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి విజయమ్మ తప్పుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. జగన్ కు సోదరి షర్మిలతోనూ విభేదాలొచ్చాయని టాక్ వచ్చింది. అందువల్లే ఆమె తెలంగాణకు వచ్చి వేరే రాజకీయ కుంపటి పెట్టుకున్నారని అంటారు. అదే సమయంలో కొన్నిరోజుల క్రితం షర్మిల కూడా వివేకా హత్యపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరగలేదన్నారు. ఆమె మాటలు సునీతకు మద్దతుగా ఉన్నాయి. మరి ఇప్పుడు స్వయంగా వివేకా సోదరే సునీత తప్పుపట్టారు. ఇలా కుటుంబంలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. మరి వివేకా హత్య చేసిందెవరు? సీబీఐ దర్యాప్తులోనే తేలుతుందా..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News