EPAPER

Vijayasaireddy argue to deputy chairman: జగన్ ప్లాన్ ఫెయిల్, రాజ్యసభలో ఊహించని పరిస్థితి?

Vijayasaireddy argue to deputy chairman: జగన్ ప్లాన్ ఫెయిల్, రాజ్యసభలో ఊహించని పరిస్థితి?

Vijayasaireddy argue to deputy chairman: వైసీసీ అధినేత జగన్ ప్లాన్స్ ఎందుకు బూమరాంగ్ అవుతున్నాయా? పార్టీ ఉనికి కోసం ఆయన నానాతంటాలు పడుతున్నారా? అధికార పార్టీపై నిత్యం బురద జల్లడమే అందుకు కారణమా? ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయడమే జగన్ ఆలోచన విధానమా? ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి ఒక్క ఏపీలో ఎందుకుంది? ఇవే ప్రశ్నలు రాజకీయ నేతలతోపాటు ప్రజలను వెంటాడుతున్నాయి.


అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్ వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. అది నెగిటివా.. పాజిటివా అనేది పక్కనబెడితే.. ఒకప్పుడు నవ్వుతూ మాట్లాడే ఆయన, చాలా విషయాల్లో తడబడుతున్నారు. జగన్ ముఖంలో నెగిటివ్ షేడ్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏదో భయం వెంటాడు తున్నట్లు కనిపిస్తోంది. తాము మునుపటి అధినేతను చూడలేకపోతున్నామన్నది ఆ పార్టీ నేతల మాట.

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఢిల్లీలో ధర్నా చేపట్టారు జగన్. జాతీయ నేతలైతే వచ్చారు.. కానీ, మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడ్డారాయన. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30కి పైగా హత్యలు జరిగాయంటున్న జగన్, కనీసం బాధితులను పరామర్శించలేదు. కేవలం వినుకొండ ఘటన జరిగిన బాధితుల వద్దకు మాత్రమే వెళ్లారు. ఈ లెక్కన పార్టీ కార్యకర్తలను సైతం ఆయన పట్టించుకోలేదన్నది ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి.


ఢిల్లీ ధర్నాకు కొనసాగింపుగా రాజ్యసభలో ఏపీలోని శాంతిభద్రతలపై గళమెత్తి చంద్రబాబు సర్కార్‌పై బురద చల్లాలని ప్లాన్ చేశారు. ఆ బాధ్యతను సీనియర్ నేత విజయసాయికి అప్పగించారు జగన్.  గురువారం బడ్జెట్‌పై రాజ్యసభ చర్చ సందర్భంగా మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు దాడులు జరుగుతున్నాయంటూ గొంతెత్తారు.

డిప్యూటీ స్పీకర్ హరివంశ్ జోక్యం చేసుకుని ఆధారాలుంటే చూపాలని కాసింత కటువుగా అన్నారు. ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు చూపాలని కోరారు. ఏపీలో జరుగుతున్న ఘటనలపై సాయంత్రం లోగా ఆధారాలు ఇవ్వాలని లేకుంటే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ALSO READ: వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నాతో చిక్కుల్లో పడ్డారా?

పార్లమెంట్‌లో వైసీపీ నేతల వ్యవహారశైలిని గమనించిన మిగతా ఎంపీలు, ఎవరైనా నిధులు కేటాయించా లని డిమాండ్ చేస్తారని, ఒకరిపై మరొకరు బురద చల్లడమేంటని చర్చించుకుంటున్నారు. ఇలాగైతే ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు ఎలా వస్తాయని అనుకుంటున్నారు. మొత్తానికి జగన్ తాను వేసిన స్కెచ్‌లో తాను బోల్తా పడినట్టు కనిపిస్తోంది.

 

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×