EPAPER

Vijayasai Reddy Press Meet : అధికారిణితో అక్రమ సంబంధంపై విజయసాయిరెడ్డి క్లారిటీ.. ఆ న్యూస్ ఛానల్స్ ను వదలబోం

Vijayasai Reddy Press Meet : అధికారిణితో అక్రమ సంబంధంపై విజయసాయిరెడ్డి క్లారిటీ.. ఆ న్యూస్ ఛానల్స్ ను వదలబోం

Vijayasai Reddy Gave Clarity About Allegations ( AP political news)  : రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి తోడుగా, కుడిభుజంగా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డికి.. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే. శాంతి అనే వివాహితతో అక్రమ సంబంధం ఉందని వార్తలు రాయడం హేయమని ఫైర్ అయ్యారు వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు. ఆయనపై సోషల్ మీడియాలో, మీడియాలో వచ్చిన ఆరోపణలు అసత్యమన్నారు. ఒక ట్రైబల్ మహిళ కుటుంబంలో వచ్చిన సమస్యపై తన భర్త ఎక్కడో ఒక వివరణ ఇస్తే.. దాన్ని అక్రమ సంబంధంగా చూపించడం దారుణమన్నారు. విజయసాయిరెడ్డిపై కుట్ర జరుగుతోందని, ఆయనపై నింద వేయడం సూర్యూడిపై ఉమ్మి వేసినట్టేనన్నారు. ఆయనపై నిందలు వేసినవారి తాట తీస్తామని జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు.


2024 ఎన్నికలను చూస్తే.. కుట్రలు ఎలా జరుగుతున్నాయో తెలుస్తుందన్నారు విజయసాయిరెడ్డి. వైసీపీ ఓటమికి కారణాలను సమీక్షించుకుంటున్నామని, దానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చూస్తున్నామన్నారు. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక.. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకూ 11 స్థానాల్లోనే వైసీపీ గెలిచినా.. ప్రజల తీర్పుకు కట్టుబడి అధికారం దిగిపోయామన్నారు. కానీ కొత్త ప్రభుత్వ గుండాలు, రౌడీషీటర్లు.. వైసీపీని సపోర్ట్ చేసి ప్రతిఒక్కరినీ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కొడుతూ, రేప్ లు చేస్తూ అకృత్యాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అధికారపార్టీ అండగా ఉందన్న కారణంతో చాలా దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Also Read : ముసలోడే కానీ మహానుభావుడు: బుద్ధా వెంకన్న సెటైర్లు


వైసీపీ నేతలపై బురద చల్లడమే అధికారపార్టీ వాళ్లు పనిగా పెట్టుకున్నారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తన పేరు, ప్రతిష్టలను దెబ్బతీసేందుకు ప్రయత్నించినవారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిన్న విజయవాడలోని తన నివాసానికి ఒక లేడీ, ఒక వ్యక్తి వచ్చారని వాళ్లు ఖచ్చితంగా టీడీపీ చెందినవారే అయి ఉంటారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనకోసం వచ్చింది ఎవరైనా సరే.. రమ్మంటే సింగిల్ గానే వచ్చి తేల్చుకుంటామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చితీరుతుందని, మధ్యంతర ఎన్నికలు జరిగినా వైసీపీదే అధికారమని జోస్యం చెప్పారు.

గడిచిన మూడు రోజులుగా మీడియాలో వచ్చిన వార్తలతో ఒక ఆదివాసి అధికారిణి జీవితంపై బురద చల్లారని, ఘోరమైన తప్పిదం చేశారని ఆరోపించారు. ఈ వార్తలను తొట్టతొలిగా టెలీకాస్ట్ చేసింది మహాన్యూస్ అని ఆరోపించారు. ఆ తర్వాత ఏబీన్, టీవీ5 ఈ అవాస్తవ వార్తలను ప్రసారం చేశాయన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తల్ని టెలీకాస్ట్ చేయడం ఘోరమైన తప్పిదమన్నారు. వాళ్లతో ఎలా క్షమాపణలు చెప్పించాలో తనకు తెలుసన్నారు విజయసాయిరెడ్డి. దీని వెనుక చాలామంది కుట్ర ఉందని తనకు తెలుసని, తన వ్యక్తిత్వమేమిటో తనకు తెలుసన్నారు.

Also Read : విజయసాయి రెడ్డితో నాకున్న పరిచయం ఇదే: అధికారిణి శాంతి వివరణ

తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసిన వంశీకృష్ణ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, వెంకటకృష్ణ, సాంబడు లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తాడులే అనుకుంటే సరిపోదని, పట్టుబడితే చేసితీరుతానన్నారు. రామోజీరావు అంతటి వాడినే సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా వేధించానని.. తననేమీ చేయలేకపోయారని అన్నారు. అలాగే సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ విషయాన్ని తప్పుగా చూపించాయని వారందరిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని, ఆ చర్యలేంటో చెప్పే చేస్తానన్నారు. వంశీకృష్ణ అనే వ్యక్తిని మాత్రం వదలబోనని.. ప్రివిలేజ్ మోషన్ పార్లమెంట్ లో మూవ్ చేస్తానని, ఎడిటర్ స్కిల్డ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్స్ చేస్తానని, అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ కు కంప్లైంట్ చేయిస్తానన్నారు. అలాగే డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తానన్నారు.

ఒక ఆదివాసి ఆడబిడ్డను బజారుకీడ్చి, పేదప్రజలకు సేవ చేయాలనుకునే తనపై కుట్రపన్ని నిందలు మోపిన వారిని వదిలేదే లేదని తేల్చిచెప్పారు. అసభ్యకరమైన రీతిలో న్యూస్ ఛానల్స్ లో ఇష్టారీతిన మాట్లాడితే ఎవరూ ఊరుకోరన్నారు. సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ ను పోలీస్ స్టేషన్ కు వెళ్తారు కానీ.. ఆ వ్యక్తి ఎండోమెంట్ కమిషనర్ కు ఇచ్చారని, అతను కాన్ఫిడెన్షియల్ గా విచారణ చేయాల్సింది పోయి.. మీడియాకెలా లీక్ చేశాడని ప్రశ్నించారు. మీడియాతో కుమ్మక్కై తనపై తప్పుడు ఆరోపణలు చేశారని వాపోయారు. కొందరు వైసీపీ నేతలు కూడా టీడీపీతో కుమ్మక్కై తనపై ఆరోపణలు చేశారని, దీనివెనుక ఎంత పెద్దవారున్నా కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

 

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×