-చంద్రబాబు సర్కార్ పై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు
-ఏపీలో కరువు, చంద్రబాబు ఇద్దరూ కవలలు
-వారి మధ్య విడదీయరాని సంబంధం
-రాయలసీమలో 54 కరువు మండలాలు ప్రకటించిన ఏపీ
-స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుంది
-కరువు అంతా చంద్రబాబు చలవే
-రైతుల ఉసురు తీస్తున్న బాబు
-ఈ ఏడారి అతివృష్టి, అనావృష్టి ప్రభావం
విశాఖపట్నం, స్వేచ్ఛ:
Vijayasai Reddy: చంద్రబాబు, కరువు అవిభక్త కవలలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం, మరికొన్ని ప్రాంతాలలో అత్యల్ప వర్షపాతం నమోదయింది. దీనితో సరైన వర్షాలు లేక పంటలు పండించుకునేందుకు తగిన నీటి సౌకర్యాలు లేకుండా పోవడంతో చాలా వరకూ కరువు ప్రాంతాలుగా మిగిలిపోయాయి. దీనితో రాయల సీమలో 54 మండలాలను కరువు మండల ప్రాంతాలుగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్ 15 జారిచేసింది.
ఈ జీవోపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు.
బాబు వస్తే కరువు వస్తుంది. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయి. ఐదు జిల్లాలలో 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. జగన్ ప్రభుత్వం హయాంలో రైతులపై భారం పడకుండా ఐదేళ్ల పాటు పంటల బీమా కొనసాగించామన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే పంటల బీమా పథకాన్ని పక్కన పెట్టేసిందని.. బీమా ప్రీమియం కూడా రైతులే కట్టుకోవాలని చెబుతున్నారని అన్నారు. అనవసరంగా రైతుల ఉసురు తీస్తున్న ఈ ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారని అన్నారు.
Also Read: వివేకానంద హత్య కేసు.. ‘బిగ్ టీవీ’ ఇంటర్వ్యూలో సునీల్ కీలక విషయాలు, రేపో మాపో మాస్టర్ మైండ్ అరెస్ట్?
రాష్ట్రంలో కరువు తాండవం
ఇప్పటికే రాష్ట్రంలో దుర్భిక్షం మొదలైంది. రాష్ట్రంలో 54 ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించింది ఏపీ సర్కార్. ఇందుకు సంబంధించి జీవో 15 నారీ చేసింది. చిత్తూరు, అనంతపురం,కర్నూలు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి మండలాలలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయిందని ప్రభుత్వమే తెలిపింది. 27 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది.
బాబు వస్తే కరువు వస్తుంది
చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయి. ఐదు జిల్లాలలో 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి. వైయస్సార్సీపి…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 30, 2024