EPAPER

Guntur : వైసీపీలో ఆధిపత్యపోరు.. విడదల రజిని, మర్రి రాజశేఖర్ మధ్య వార్.. అందుకేనా..?

Guntur : గుంటూరు జిల్లా వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. గుంటూరులో మంత్రి విడుదల రజినీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఐతే ఈ కార్యక్రమానికి రీజనల్ కోర్డినేటర్ మర్రి రాజశేఖర్ హాజరు కాలేదు. గుంటూరు,కృష్ణ,ఎన్టీఆర్ జిల్లాల రీజనల్ కోర్డినేటర్ గా మర్రి రాజశేఖర్ పని చేస్తున్నారు.ఇక నూతన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు, ఫ్లెక్సీలోనూ ఆయన ఫోటో కనిపించలేదు.

Guntur : వైసీపీలో ఆధిపత్యపోరు.. విడదల రజిని, మర్రి రాజశేఖర్ మధ్య వార్.. అందుకేనా..?

Guntur : గుంటూరు జిల్లా వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. గుంటూరులో మంత్రి విడుదల రజినీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఐతే ఈ కార్యక్రమానికి రీజనల్ కోర్డినేటర్ మర్రి రాజశేఖర్ హాజరు కాలేదు. గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల రీజనల్ కోర్డినేటర్ గా మర్రి రాజశేఖర్ పని చేస్తున్నారు.ఇక నూతన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు, ఫ్లెక్సీలోనూ ఆయన ఫోటో కనిపించలేదు.


గతకొంతకాలంగా చిలకలూరిపేటలో మంత్రి విడుదల రజనీ, మర్రి రాజశేఖర్ వార్ నడుస్తోంది. అంతే కాదు ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకున్నారు. అప్పట్లో రజిని ,మర్రి గొడవల కారణంగా పల్నాడు జిల్లాకు మరొకరిని రీజనల్ కోర్డినేటర్ గా అధిష్ఠానం నియమించింది. ఇప్పుడు గుంటూరు పశ్చిమకి ఇంచార్జిగా రజిని కార్యాలయం ప్రారంభించారు. ఐతే కార్యాలయ ప్రారంభోత్సవానికి మర్రి రాజశేఖర్ హాజరు కాకపోవడం ఆ పార్టీలో విభేదాలు బయటపడేలా చేసింది.

మర్రి రాజశేఖర్ పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్నారు. జగన్ వెంటే నడుస్తున్నారు. అయితే విడదల రజిని, మర్రి రాజశేఖర్ మధ్య వివాదం 2019లో ఎన్నికల సమయంలో మొదలైంది. 2014లో వైసీపీ తరఫున మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటలో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు. 2019లో మర్రి రాజశేఖర్ కు వైసీపీ టిక్కెట్ దక్కలేదు. ఆయన స్థానంలో విడదల రజినికి జగన్ ఛాన్స్ ఇచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్సీని చేసి మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. రజనీ గెలుపు కోసం పని చేయాలని చెప్పారు.


పార్టీ ఆదేశాలతో నాడు మర్రి .. విడదల రజిని గెలుపుకోసం పనిచేశారు. ఆ ఎన్నికల్లో అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి ఆమె సంచలనం సృష్టించారు. మరోవైపు జగన్ మాట ఇచ్చినా మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి దక్కలేదు. జగన్ కేబినెట్ 2.0లో మాత్రం రజినికి చోటు దక్కింది. ఇలా వైసీపీలో ఆమె ప్రాధాన్యత పెరిగింది. ఈ పరిణామాలతో రజిని, మర్రి రాజశేఖర్ మధ్య దూరం మరింత పెరిగింది. ఇప్పుడు ఆమెకు చిలకలూరిపేట నుంచి స్థాన చలనం కల్పించారు. గుంటూరు వెస్ట్ కు ఇన్ ఛార్జ్ గా రజినిని సీఎం జగన్ నియమించారు. ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×