EPAPER

Vidadala Rajani Guntur West Politics: గుంటూరు వెస్ట్‌లో వ్యూహం మార్చిన జగన్.. టిడిపికి చెక్ పెట్టేందుకు బరిలోకి రజని!

Guntur West Politics | మొన్నటి వరకు ఆ నియోజకవర్గంలో అభ్యర్ధి బలంతో పని లేకుండా కచ్చితంగా తామే గెలుస్తామన్న ధీమాతో కనిపించింది తెలుగుదేశం పార్టీ.

Vidadala Rajani Guntur West Politics: గుంటూరు వెస్ట్‌లో వ్యూహం మార్చిన జగన్.. టిడిపికి చెక్ పెట్టేందుకు బరిలోకి రజని!

Vidadala Rajani Contest coming elections from Guntur West: మొన్నటి వరకు ఆ నియోజకవర్గంలో అభ్యర్ధి బలంతో పని లేకుండా కచ్చితంగా తామే గెలుస్తామన్న ధీమాతో కనిపించింది తెలుగుదేశం పార్టీ. అయితే ఇప్పుడు ప్రత్యర్ధి పార్టీ కేండెట్ దూకుడుతో .. సీన్ మారుతున్నట్లు కనిపిస్తోంది. ఆ సెగ్మెంట్లో మారుతున్న రాజకీయ వాతావరణం చూస్తూ .. బలమైన నాయకుడు ఉంటే మాత్రమే తమ పార్టీ గెలుస్తుదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అసలింతకీ ఆ నియోజకవర్గం ఏది?.. అక్కడ నడుస్తున్న పాలిటిక్స్ ఏంటి..?


తొలిసారి గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన విడదల రజని అప్పటి మంత్రి సీనియర్ తెలుగుదేశం నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు పై అనూహ్య విజయం సాధించారు. రెండవసారి చేసిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కూడా దక్కించుకోగలిగారు. కానీ ఇప్పుడు జగన్ ఆమెకు స్థానచలనం కల్పించి.. గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి మార్చారు.

గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో గుంటూరు వెస్ట్ ఒకటి. గుంటూరు వెస్ట్ తెలుగుదేశానికి కంచుకోట లాంటి సీటు .. 2019 ఎన్నికలలో జగన్ ప్రభంజనంలోనూ ఇక్కడ టీడీపీ 4000లకు పైగా మెజారిటీతో గెలిచింది. అయితే తర్వాత ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీ పంచన చేరారు. అయితే ఆ సారి ఆయన్ని పక్కన పెట్టేసిన వైసీపీ… విడుదల రజనీని వెస్ట్‌కి షిఫ్ట్ చేసింది. సమన్వయ బాధ్యతలు చేపట్టిన మొదట్లో ఆమెగుంటూరు వెస్ట్ సీట్ లో కొంచెం ఇబ్బంది పడ్డట్లు కనిపించారు.


గుంటూరు వెస్ట్‌లో గెలుపు అనేది అంత తేలికైన విషయమేమి కాదన్న విషయం రజనికి కూడా బాగా తెలుసు. అందుకే ఆమె అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. స్థానికంగా ఉన్న ప్రతి వైసీపీ నేతని కలుపుకుపోతూ.. ప్రతి రోజు నియోజకవర్గంలో ఎదో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటూ .. నిత్యం ఆమె ప్రజల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.

తనశైలికి భిన్నంగా రజనీ ఒద్దికగా వ్యవహరిస్తున్న తీరుతో గుంటూరు వెస్ట్ లో తమకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వైసీపీ అంచనా వేసుకుంటోంది. విడుదల రజిని గుంటూరు నగరంలో ప్రచారం చేస్తున్న తీరు .. తనని తాను బలమైన నాయకురాలిగా ఫోకస్ చేసుకుంటున్న స్టైల్‌ చూస్తూ.. వైసీపీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఎక్కడ చూసినా పెద్దపెద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలు .. క్యాడర్ ని ఉత్తేజపరిచే విధంగా ఆమె తన ఆఫీసులో ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్.. కార్యాలయానికి వస్తున్న నాయకులతో మాట్లాడుతున్న విధానం .. ఇవన్నీ పార్టీకి ప్లస్ అవుతున్నాయన్న సంబరం వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది.

ఆ క్రమంలో ప్రస్తుతం అక్కడి టీడీపీ శ్రేణులుకూడా ఆలోచనలో పడినట్లు కనిపిస్తున్నాయి. రజనీని సమర్ధంగా ఎదుర్కోవాలంటే బలమైన నాయకులు అయిన ఆలపాటి రాజా.. జనసేన లీడర్ బోయిన శ్రీనివాస్ యాదవ్ వంటి వారు గుంటూరు వెస్ట్ నుంచి బరిలోకి దిగాలంటున్నారు. అలా కాకుండా ఎవరికి పడితే వారికి టికెట్ ఇస్తే .. రజనీకి మేలు చేసినట్లు అవుతుందన్న కలవరం వారిలో కనిపిస్తోంది.

మరో వైపు తెలుగుదేశానికి బలమైన స్థానమే అయినప్పటికీ ఇక్కడనుంచి ఎవరు పోటీలో ఉంటారనేది తెలియక క్యాడర్ సతమతమవుతోంది. మేము అంటే మేము అంటూ డజనుకు పైగా అభ్యర్థులు ఇక్కడ నుండి పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు అన్నివిధాలా బలమైన అభ్యర్థిగా మంత్రి విడదల రజని ప్రచారంలో దూసుకుపోతుంటే .. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇంకా కనీసం అభ్యర్థిని ప్రకటించకపోవడం.. తెలుగుదేశం, జనసేన శ్రేణులను కలవరపెడుతోంది. ఏదేమైనా చూడాలి విడదల రజనీ దూకుడుకి టీడీపీ ఎలా బ్రేకులు వేస్తుందో?

Tags

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×