EPAPER
Kirrak Couples Episode 1

Vemireddy Prabhakar Reddy : మెట్టు దిగి వచ్చిన వేమిరెడ్డి.. నెల్లూరు ఎంపీగా పోటీ..

Vemireddy Prabhakar Reddy Vs CM Jagan : వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్యక్ష రాజ‌కీయాల్లో బ‌రిలోకి దిగ‌నున్న నెల్లూరు పెద్దారెడ్డి వేమిరెడ్డి మౌనానికి కారణం ఏంటి..? తన పార్ల‌మెంట్ నియోజకవర్గ ప‌రిధిలోని రెండు మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులను మార్చాలని పట్టుబడుతున్న ఆ వైసీపీ పెద్దారెడ్డి పార్టీ అధిష్టానం బుజ్జగింపులోతో వెనక్కి తగ్గుతున్నారా? నిన్న మొన్నటి వరకు అభ్యర్థులను మార్చే వరకు తగ్గేదే లేదన్న ఆయనకు అధిష్టానం ఎలాంటి హామీ ఇచ్చింది? గత ఎన్నికల్లో కీరోల్ పోషించి జిల్లాలోని 10 స్థానాలను గిఫ్ట్ గా అందించిన పెద్దారెడ్డికి అధిష్టానం పిలిచి ఏమి చెప్పింది?

Vemireddy Prabhakar Reddy : మెట్టు దిగి వచ్చిన వేమిరెడ్డి.. నెల్లూరు ఎంపీగా పోటీ..

Vemireddy Prabhakar Reddy : వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్యక్ష రాజ‌కీయాల్లో బ‌రిలోకి దిగ‌నున్న నెల్లూరు పెద్దారెడ్డి వేమిరెడ్డి మౌనానికి కారణం ఏంటి..? తన పార్ల‌మెంట్ నియోజకవర్గ ప‌రిధిలోని రెండు మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులను మార్చాలని పట్టుబడుతున్న ఆ వైసీపీ పెద్దారెడ్డి పార్టీ అధిష్టానం బుజ్జగింపులోతో వెనక్కి తగ్గుతున్నారా? నిన్న మొన్నటి వరకు అభ్యర్థులను మార్చే వరకు తగ్గేదే లేదన్న ఆయనకు అధిష్టానం ఎలాంటి హామీ ఇచ్చింది? గత ఎన్నికల్లో కీరోల్ పోషించి జిల్లాలోని 10 స్థానాలను గిఫ్ట్ గా అందించిన పెద్దారెడ్డికి అధిష్టానం పిలిచి ఏమి చెప్పింది?


నెల్లూరు జిల్లా పాలిటిక్స్‌లో రెడ్డి నేతల డామినేషన్ గురించి వేరే చెప్పనవసరం లేదు. అందులో వైసీపీలో బ‌ల‌మైన నేత‌గా ఎదుగుతున్న రాజ్య‌స‌భ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీలో పెద్దారెడ్డి అనిపించుకుంటున్నారు. ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌గా ఉన్న వేమిరెడ్డి గ‌తంలో టీడీపీ నుంచి రాజ్య‌స‌భ ఆశించి భంగ‌ప‌డ్డారు. వైసీపీ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన వేమిరెడ్డి ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వైసీపీ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. 2019 ఎన్నిక‌ల్లో జిల్లాలోని ప‌ది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజయం సాధించడంలో తనవంతు పాత్ర పోషించారు.

ప‌దికి ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల‌ను గెలిపించి జ‌గ‌న్ కి గిఫ్ట్ గా ఇచ్చారు వేమిరెడ్డి. ఇటీవ‌ల జిల్లా వైసీపీలో చోటుచేసుకున్న విభేదాల‌ను దృష్టిలో ఉంచుకుని ..రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉంటూనే జిల్లా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని స్వీక‌రించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో లోక్‌సభకు పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ చేసిన సూచనతో ఆయన నెల్లూరు ఎంపీగా పోటీకి సిద్దమవుతున్నారంట. వాస్త‌వానికి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ రాజ్య‌స‌భ స‌భ్యునిగా కొన‌సాగాల‌ని వేమిరెడ్డి వ‌ర్గం భావిస్తోంది. అయితే జిల్లాలో ఉన్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకున్న వైసీపీ అధిష్టానం వేమిరెడ్డిని ఎంపీగా పోటీచేయాల‌ని చెప్పిందంట.


నెల్లూరు పార్ల‌మెంట్ నియోజకవర్గ ప‌రిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల స‌మ‌న్వ‌య స‌మావేశాల‌ను వైసీపీ రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్ విజ‌య‌సాయి రెడ్డి నేతృత్వంలో నెల్లూరులో నిర్వ‌హించి.. నేత‌ల మ‌ధ్య ఉన్న భేదాభిప్రాయాల‌ను ప‌క్క‌న పెట్టే ప్ర‌య‌త్నం చేశారు వేమిరెడ్డి.. అయితే మూడు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న వ‌ర్గ‌విభేదాలు మాత్రం కొలిక్కి రావడం లేదంట.. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్యేక దృష్టి పెట్టిన ఆయన.. అక్క‌డ అభ్య‌ర్థుల‌ను మారిస్తే త‌ప్ప ప‌రిస్థితి మారే అవ‌కాశం లేద‌ని అధిష్టానానికి చెప్పారంట.. ముఖ్యంగా నెల్లూరు సిటీలో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ కి వైసీపీ ముఖ్య నేత‌ల‌కు మ‌ధ్య ఏర్ప‌డ్డ అగాధం.. పార్టీని ఇబ్బంది పెడుతోందని జగన్ దృష్టికి తీసుకెళ్లారంట. 2019 లో అనిల్ విజయానికి అన్ని విధాలా స‌హ‌క‌రించిన వేమిరెడ్డికి ఇప్పుడు ఆయనతో గ్యాప్ పెరిగింది. వివిధ కార‌ణాల‌తో వేమిరెడ్డితో అనిల్ విభేదిస్తున్నారు . దాంతో అభ్య‌ర్థి మార్పు త‌ప్ప‌నిస‌రి అని వేమిరెడ్డి గ‌ట్టిగా ప‌ట్టుపట్టతారంట.

ఇక ఉద‌య‌గిరి, కావలి, కందుకూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం వేమిరెడ్డి అభ్య‌ర్థుల‌ను మార్చాల‌నే ప్ర‌తిపాద‌న‌లు పెట్టార‌ట‌. ఉద‌య‌గిరిలో ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని వైసీసీ స‌స్పెండ్ చేసింది. దాంతో ఆయ‌న టీడీపీకి ద‌గ్గ‌ర‌య్యారు. ఆయ‌న సోద‌రుడు రాజారెడ్డికి ఇన్ చార్జ్ ఇవ్వ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు వైసీపీలో ఉన్న వ‌ర్గ విభేదాలు మ‌రి కాస్త పెరిగాయి. మేక‌పాటి కుటుంబంపై ఉద‌య‌గిరిలో తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోందని.. అక్కడ కొత్త నేత‌ను ప్ర‌క‌టించాల‌ని వేమిరెడ్డి కోరుతున్నారంట.. కందుకూరులో సైతం ఎమ్మెల్యే మానుగుంట మ‌హిధ‌ర్‌రెడ్డిపై వ్య‌తిరేక‌త‌ ఉందని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

కావలి నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేక వర్గం ఉంది. తన గెలుపుకి రెండుసార్లు విశేషంగా కృషి చేసిన మాజీ ఏఎంసి చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డిని ఎమ్మెల్యే వైసీపీ నుంచి సస్పెండ్ చేయించారు. ఆ తర్వాత తిరిగి సుకుమార్ రెడ్డి వైసీపీలోకి రావాలని ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యే అడ్డుపడ్డారు. దీంతో ప్రస్తుతం సుకుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు ఒకటయ్యారు. ఎమ్మెల్యే ప్రతాపరెడ్డిని ఈసారి ఎలాగైనా ఇక్కడ ఓడించడానికి వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో అక్కడ కూడా అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకోవాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధిష్టానానికి గట్టిగా చెప్పరట.

సీఎం జ‌గ‌న్‌కి కూడా వేమిరెడ్డి అత్యంత స‌న్నిహితులు.. అనేక విష‌యాల్లో వేమిరెడ్డి చెప్పింది జ‌గ‌న్ చేశార‌నేది పార్టీలో ఉన్న టాక్‌.. 2024 ఎన్నిక‌ల్లో వేమిరెడ్డి ప్ర‌భావం ఉమ్మ‌డి నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌పైన కూడా ఉంటుంది. అయితే అభ్యర్ధులకు సంబంధించి తాను చేసిన సూచనలను అధిష్టానం పట్టిచుకోకపోవడంతో ఆయన కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సైలెంట్ అయ్యారు. అది గమనించిన జగన్.. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయ సాయిరెడ్డిల ద్వారా బుజ్జగింపుల పర్వం మొదలు పెట్టించారు. మూడు గంటల పాటు జరిగిన ఈ బుజ్జగింపుల పర్వం అనంతరం పార్టీ అధిష్టానం ఎలాంటి హామీ ఇచ్చిందో ఏమో తెలియదు గానీ.. ఎంపీగా తానే పోటీ చేస్తున్నానని పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు వేమిరెడ్డి.. దాంతో ఆయన పార్టీ పెద్దల బుజ్జగింపులతో ప్రస్తుతానికి ఒక మెట్టు దిగినట్టేనని అనుచరవర్గం చెపుతోంది. మరి నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లను ప్రకటించాక.. వేమిరెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

.

.

Related News

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Big Stories

×