EPAPER

Uppada Beach : సముద్రమంత ఆశతో.. ఉప్పాడ ప్రజల ఎదురు చూపులు !

Uppada Beach : సముద్రమంత ఆశతో.. ఉప్పాడ ప్రజల ఎదురు చూపులు !

Uppada Beach : మొన్నటి వరకు కళ్ళ ముందు కనిపించే 8 గ్రామాలు, 1365 ఎకరాలు ఈరోజు లేవు. మిగిలిన ఊళ్ళు రేపటి రోజు ఉంటాయో లేదో అన్న గ్యారెంటీ కూడా లేదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఆంధ్రప్రదేశ్ లోని ఉప్పాడ గురించి. అసలు ఉప్పాడ వెనుక ఉన్న ఆ కథేంటో ఈ రోజు తెలుసుకుందాం.


పెద్ద ప్రళయం వచ్చి ఊళ్లన్నీ నీళ్ళల్లో కొట్టుకుపోవడం మనం సినిమాల్లో చూసి ఉంటాం. కానీ ఉప్పాడ తీరప్రాంతాల్లో ఉండే ప్రజలు గత 60 సంవత్సరాలు గా ఇలాంటి పరిస్థితి అనుభవిస్తూనే ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేయట్లేదా అంటే.. ఏదో నామ్ కె వాస్తే అన్నట్లు ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప.. సరైన ప్లానింగ్ తో అక్కడ ఉన్న ప్రజలని, వాళ్ళ ఊర్లని ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఆదుకోలేక పోయాయి.

నిజానికి ఒకప్పుడు ఉప్పాడ చుట్టూ గ్రీనరీతో సముద్రపు అలల శబ్దాలతో ఎంతో అందంగా ఉండేది. కానీ ప్రెసెంట్ పరిస్థి ఆలా లేదు. ఎగిసి పడుతున్న ప్రతి అల.. తమ ఇళ్లను, ఊళ్లను మిగేస్తుంటే.. దిక్కు తోచని ప్రస్థితిలో నిస్సహాయంగా అలలకు దూరంగా పరిగెడుతూనే ఉన్నారు. బతుకు మీద ఆశ ఉన్న, సముద్రంతో పోటీ పడే శక్తి వాళ్లకు లేదు. ఆలా అని ఊళ్లను వదిలిపెట్టి వెళ్లే ధైర్యం కూడా ఆ జనాలకు లేదు. సముద్రం మీదికి వచ్చే కొద్దీ.. వెనుకకి జరగడం తప్ప వాళ్ళ దగ్గర ఇంకో దారి లేదు.


వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఇరిగేషన్ శాఖ ఫండ్స్ తో ఉప్పాడ గ్రామంలో తీవ్రతను అడ్డుకునేందుకు జియో ట్యూబ్ ఏర్పాటు చేశారు. అప్పట్లో రూ. 12.6 కోట్ల అంచనా ఖర్చుతో పనులు చేశారు. వాటి ఫలితంగా కొంతకాలం పాటు సముద్రపు కోత నివారణ జరిగింది. కానీ ప్రెసెంట్ ఆ ట్యూబ్ ల ఆనవాళ్లే లేకుండా పోయింది.

మొత్తంగా తీరంలో సుమారు 1463 మీటర్ల మేర జియో సింథటిక్ ట్యూబులు, బ్యాగులు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ ప్రాజెక్టును మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్మించారు. ఇది ప్రయోగాత్మక ప్రాజెక్టే అయినప్పటికీ తర్వాత దీన్ని మొత్తం ఉప్పాడ గ్రామంలోని తీరమంతటికీ విస్తరించాలన్నది అప్పటి ప్రభుత్వ ఆలోచన. అప్పట్లోనే ఈ ప్రాజెక్టు కోసం రూ.135 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ అనివార్య కారణాలతో ప్రాజెక్టే ఆనవాలు లేకుండా పోయేసరికి.. మిగిలిన బడ్జెట్ కేటాయించి.. ఆ ప్రాజెక్టు పూర్తి చేసేంత ధైర్యం ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ చెయ్యలేదు.

ఇప్పటి వరకు 6కి పైగా ఆలయాలు, 3 స్కూల్స్, 2 ట్రావెలర్ బంగ్లాలు సముద్రంలో కలిసిపోయాయి. గవర్నమెంట్ లెక్కల్లో కూలిపోయిన ఇళ్ల గురించి ఉన్నాయి కానీ చెదిరిపోయిన జీవితాలు ఎవరికీ అవసరం లేని అంశం.

2011 జనాభా లెక్కల ప్రకారం 3,190 ఇళ్లతో 12 వేల మంది ఇక్కడ ఉండేవారు. 137 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన ఈ గ్రామంలో ఇప్పటికే 40 హెక్టార్లకు పైగా భూమి సముద్రంలో కలిసి పోయిందని స్వయంగా అధికారులు కూడా అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 947 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. 1990 నుంచి 2021 మధ్య కాలంలో రాష్ట్రంలో సుమారు 289.36 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం కోతకు గురయిందని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ పరిశోధనలో తేలింది. కేవలం ఉప్పాడలోనే ఏటా 1.23 మీటర్ల మేర సముద్రం కోతకు గురవుతూ వస్తోంది. ఇప్పటి వరకు కాకినాడ తీర ప్రాంతంలో సుమారు 600 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది.

అక్కడి ప్రజల జీవన ఉపాధి మెరుగుపడాలి అంటే ముందు రోడ్లు బాగుపడాలి. ఎందుకంటే కోస్టల్ రోడ్ ఏర్పాటైతే పేదలకు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాదు రోడ్లతో పటు టూరిజం కూడా డెవలప్ అవుతే ఈ ప్రాంతం అంత వైజాగ్ లాగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఎంతో మంది విశ్లేషకులు చెబుతున్న మాట.

అయితే ఈ సమస్యకు శాశ్వత పరిస్కారాన్ని చూపిస్తామని అధికారంలోకి వచ్చే ప్రతి ప్రభుత్వమూ హామీలిస్తూ వచ్చింది. కానీ ఒక్కరూ తమ సమస్యను పూర్తిగా తీర్చలేకపోయారన్నది అక్కడి స్థానికుల వాదన. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉప్పాడ ప్రాంతాన్ని పరిశీలించారు. సరిగ్గా 18 నెలల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి, దశాబ్దాలుగా కోతకు గురవుతున్న ఉప్పాడ పరిసర ప్రాంతాలకు భవిష్యత్తులో ఆ సమస్య ఇక రానివ్వకుండా, కాకినాడ నుంచి ఉప్పాడ తీరం వరకు అందమైన కోస్టల్ రోడ్‌ను నిర్మించి, ఆ ప్రాంతంలో పర్యటకంగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తా అని ఉప్పాడలో 2024 జూలై 3న ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

మరి ఏపీ ప్రభుత్వం ఉప్పాడ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని స్థానిక ప్రజలు సముద్రమంత ఆశతో ఎదురు చూస్తున్నారు.

Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×