Big Stories

Top News Channels Ban in AP: ఏపీలో ప్రముఖ న్యూస్ ఛానళ్ల ప్రసారాలు బంద్.. బ్లూ మీడియాకు బిగ్ షాక్?

Tv9, NTV, 10TV, Sakshi Broadcasting Banned in Andhra Pradesh: ఏపీలో ప్రముఖ న్యూస్ ఛానళ్ల ప్రసారాలు నిలిచిపోనున్నాయి. సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీల ప్రసారాలు నిలిపి వేయాలని కేబుల్ ఆపరేటర్లు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఆయా ఛానళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని దెబ్బతీసేలా వార్తల్ని ప్రసారం చేస్తున్నాయనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నెట్టింట ఒక వార్త చక్కర్లు కొడుతోంది. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించే వార్తల్ని ప్రసారం చేస్తే.. తగు చర్యలు తీసుకుంటామని ఆయా ఛానళ్లను ఎంఎస్ఓలు హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి విజయం సాధించి.. త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న వేళ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

- Advertisement -

వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా.. ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, వాలంటీర్లు అంతా సాక్షి పేపర్ ను చదవాలని ఆదేశాలు జారీ చేసి.. బలవంతంగా సబ్ స్క్రిప్షన్లు తీసుకునేలా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఆదేశాలను కొట్టివేయడంతో.. సాక్షిపేపర్ సర్క్యులేషన్ ఒక్కరోజులోనే 12 లక్షలుపడిపోయాయి. సాక్షి చదవాలి.. సాక్షి ఎంతమంది చదువుతున్నారో చూడండని చెబుతూ.. ప్రజాసొమ్మును వాడి ఫేక్ సర్క్యులేషన్ ను చూపించిన ఆ యాజమాన్యానికి దిమ్మతిరిగే షాక్ తగిలింది.

- Advertisement -

వైసీపీ అధికారం కోల్పోయి.. 48 గంటలు దాటిపోయినా ఆయా ఛానళ్లలో యజమానులు ఇంకా బ్లూ మీడియాకు సపోర్టివ్ గా కథనాలు ప్రసారం చేయడం, వాటిలో పనిచేసే జర్నలిస్టులు, యాంకర్లు రాష్ట్రంపై విషం చిమ్మేలా, జనం మనసుల్లో విషబీజాన్ని నాటేలా వార్తలు ప్రసారం చేస్తుండటాన్ని కేబుల్ ఆపరేటర్లు తప్పుపట్టారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైంది చాలని.. ఇకనైనా మార్పు రావాలనే అలాంటి వార్తల్ని ప్రసారం చేసే ఛానళ్లను ఆపివేస్తున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు.. ఫైబర్ గ్రిడ్ లో నడిచే ఛానల్స్ ను కూడా తక్షణమే ఆపివేయాలని నిర్ణయించుకున్నారు.

Also Read: YCP Defeat In AP Elections 2024: వైసీపీ ఓటమికి కారణం.. తిలా పాపం తలా పిడికెడు

గడిచిన ఐదేళ్లలో బ్లూ మీడియాలో ప్రకటనల కోసం.. ముఖ్యంగా సాక్షి పత్రిక, ఛానల్ లో ప్రభుత్వ ప్రకటనలకై సమాచార శాఖ చాలా బడ్జెట్ ను ఖర్చు చేసింది. దాదాపు రూ.100 కోట్లను సాక్షికే ఇచ్చినట్లు టీడీపీ గతంలో ఆరోపణలు కూడా చేసింది. మిగతా ఛానళ్ల సంగతి పక్కనపెడితే.. జగన్ సొంత ఛానల్ మాత్రం ఆర్థికంగా లాభపడినట్లు టాక్. ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయంతో.. టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ, సాక్షి ఛానళ్ల ఆదాయానికి గండిపడినట్లే. జగన్ పాలనలో ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లకు ప్రకటనలు ఇవ్వకుండా నిషేధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పని కేబుల్ ఆపరేటర్లు చేస్తున్నారని, ఇందులో తప్పేం ఉందని నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News