EPAPER

TTD News: దీపావళికి తిరుమల వెళ్తున్నారా.. ఆ సేవలు రద్దు చేసిన టీటీడీ.. దర్శనానికి ఎన్నిగంటల సమయం పడుతుందంటే?

TTD News: దీపావళికి తిరుమల వెళ్తున్నారా.. ఆ సేవలు రద్దు చేసిన టీటీడీ.. దర్శనానికి ఎన్నిగంటల సమయం పడుతుందంటే?

TTD News: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ శ్రీనివాసుడి దర్శనభాగ్యంతో భక్తి పారవశ్యంలో భక్తులు పరవశించి పోతుంటారు. గోవిందా నామస్మరణను భక్తిశ్రద్దలతో పఠిస్తే చాలు.. ఆ స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది. అటువంటి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. స్వామివారిని దర్శించిన భక్తులు, లడ్డూ ప్రసాదాన్ని పవిత్రంగా భావించి.. నిశ్చలమైన భక్తితో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. శ్రీవారి సేవలో భక్తులు తరిస్తే.. భక్తుల సేవలో టీటీడీ (TTD) నిరంతరం తరిస్తోంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనార్థం ఎన్ని గంటల సమయం పడుతుంది? తాజాగా ఎందరు భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారో తెలుసుకుందాం.


తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వస్తుంటారు. అంతేకాదు విదేశాల నుండి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు రావడం పరిపాటి. అందుకే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ (TTD) నిరంతరం కృషి చేస్తోంది. స్వామివారి దర్శనంకై ఎందరో భక్తులు సుదూర ప్రాంతాల నుండి పాదయాత్ర ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అంతేకాదు అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్ల మార్గం నుండి కాలినడకన నిర్మలకు చేరుకుంటారు భక్తులు. కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ (TTD).

శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 64894 మంది భక్తులు దర్శించుకోగా.. 23355 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.82 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు.


Also Read: Diwali 2024: దీపావళి వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఎన్ని రోజులు ఈ దీపాల పండుగ జరుపుకోవాలి?

31న ఆ సేవలు రద్దు..
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి (Diwali) పండుగ సందర్భంగా అక్టోబరు 31వ తేదీన‌ దీపావళి ఆస్థానాన్ని టీటీడీ (TTD) శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. దీపావళి రోజు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుందన్నారు. ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారని, సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారన్నారు.

అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారని ఈవో అన్నారు. కాగా సాయంత్రం 5 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నట్లు, ఇప్పటికే ఆ ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. దీపావ‌ళి ఆస్థానం కార‌ణంగా అక్టోబరు 31న తిరుప్పావ‌డ‌, క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసినట్లు, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారని ఈవో ప్రకటించారు. ఈ విషయాన్ని తిరుమలకు వచ్చే భక్తులు గమనించాలన్నారు.

Related News

Ysrcp MVV Satyanarayana: మాజీ ఎంపీకి మరిన్ని కష్టాలు.. సోదాలపై ఈడీ క్లారిటీ, ఎంవీవీ మునిగిపోయినట్టేనా?

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

Borugadda: పీకల్లోతు కష్టాల్లో బోరుగడ్డ!

AP Speaker Ayyanna Patrudu: నమస్కారం పెట్టాల్సిందే..

Sharmila on YS Jagan: మోడీ వారసుడిగా జగన్.. అవి ఎప్పుడో మర్చిపోయాడు.. వైయస్ షర్మిళ

Super Six in AP: సూపర్ సిక్స్ ఆలస్యం అందుకేనా.. నాలుగు నెలలవుతున్నా ఏదీ ముందడుగు?

Big Stories

×