EPAPER

TTD: గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ.. ఇకనుంచి భక్తులకు ఎన్ని లడ్డూలిస్తారంటే..?

TTD: గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ.. ఇకనుంచి భక్తులకు ఎన్ని లడ్డూలిస్తారంటే..?

TTD: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయ విధానంపై వస్తున్న కథనాలను నమ్మొద్దన్నారు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి. అదంతా కూడా అపోహలు, అవాస్తవాలన్నారు. వాటిని నమ్మొద్దంటూ భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. లడ్డూ విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, లడ్డూ ప్రసాదం బ్లాక్ మార్కెట్, దళారులను అరికట్టేందుకు చిన్న మార్పు చేసినట్టు చెప్పుకొచ్చారు. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో రెండు లడ్డూలను విక్రయిస్తామని వివరించారు. దర్శన టికెట్, టోకెన్ కలిగిన భక్తులకు ఉచితంగా ఒక లడ్డూతోపాటు నాలుగు నుంచి 6 లడ్డూలను విక్రయిస్తామన్నారు. సామాన్య భక్తులకు మేలు చేసే విధంగానే లడ్డూ విక్రయ విధానమే కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.


Also Read: ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తా: మంత్రి లోకేశ్

దర్శనం టోకెన్లు లేని భక్తులకు ఆధార్ తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగా గురువారం ఉదయం నుంచి దర్శనం టోకెన్లు లేని భక్తులు లడ్డూ కౌంటర్లలో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకుని రెండు లడ్డూలు పొందొచ్చని సూచించారు. ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్ 48 నుంచి 62 నెంబర్ల కౌంటర్లలో లడ్డూలు పొందవచ్చునని పేర్కొన్నారు.


అయితే, దర్శనం టోకెన్లు లేదా టికెట్లు కలిగన భక్తులు ఒక ఉచిత లడ్డూతోపాటు గతంలో మాదిరిగా అదనపు లడ్డూలు కొనుక్కోవొచ్చంటూ వారికి ఆయన సూచించారు. కాగా, గతంలో కొందరు దళారులు లడ్డూలను కొనుగోలు చేసి, భక్తులకు అధిక ధరలకు విక్రయించినట్లు టీటీడీ గుర్తించిందని ఆయన వివరించారు. దీనిని అరకట్టేందుకే గురువారం నుంచి రోజువారీ టోకెన్ లేని ప్రతి భక్తునికి ఆధార్ పై రెండు లడ్డూలను మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

Also Read: జగన్‌పై గరంగరం.. మోపిదేవి నిర్ణయం అప్పుడే.. అందుకే సైకిల్ వైపు..

ఇదిలా ఉంటే… ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టికెట్లను ఇకపై లక్కీ డిప్ ద్వారానే కేటాయించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

అంగప్రదక్షిణ టికెట్లు కావాల్సిన భక్తులు గురువారం ఉ. 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని అధికారులు వారికి సూచించారు. అయితే, వారికి సాయంత్రం 5 గంటలకు లక్కీ డిప్ ద్వారా టికెట్లను కేటాయిస్తామంటూ అధికారులు చెప్పారు. ఈ లక్కీ డిప్ లో టికెట్లు పొందినటువంటి భక్తులకు వారి మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తూ, ఆ వివరాలను ఆన్ లైన్ లో ఉంచుతామన్నారు.

కాగా, లక్కీ డిప్ లో టికెట్లు పొందినటువంటి భక్తులు వారు ఆన్ లైన్ లో రూ. 500 డిపాజిట్ చేయించాల్సి ఉంటుందన్నారు. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు మహతి కళాక్షేత్రంలో ఆధార్ కార్డును చూపించి శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు అంగప్రదక్షిణ టికెట్లను పొందవొచ్చన్నారు. టికెట్లను పొందిన భక్తులకు శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతిస్తామంటూ వారు పేర్కొన్నారు. ఆ తరువాత భక్తులు చెల్లించిన రూ. 500 డిపాజిట్ ను తిరిగి వారి ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు వెల్లడించారు.

తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులు కానీ భక్తులు లక్కీ డిప్ లో అంగ ప్రదక్షిణ టోకెన్లను పొందిన భక్తులకు వారు చెల్లించిన రూ. 500 డిపాజిట్ తిరిగి చెల్లించబడదని, అంగప్రదక్షిణకు అనుమతించబోమని చెప్పారు.

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×