EPAPER

TTD Files Complaint: సీఎంకే ప్రాణగండం అంటూ పోస్ట్.. టీటీడీ ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు

TTD Files Complaint: సీఎంకే ప్రాణగండం అంటూ పోస్ట్.. టీటీడీ ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా టీటీడీ నిర్వహించింది. ఈ నెల 4వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. పుష్కరిణిలో శాస్త్రోక్తంగా శ్రీవారి చక్రస్నానంను నిర్వహించగా.. వరాహ పుష్కరిణిలో పుణ్యస్నానాలను భక్తులు ఆచరిస్తున్నారు. అయితే తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాల సంధర్భంగా సీఎం పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంధర్భంగానే సీఎం చంద్రబాబు దంపతులు.. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇలా సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఆపై బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వ్యక్తిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.


అసలేం జరిగింది..
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు హాజరైన సమయంలో చాలా మంది వీడియోలు తీయడం సర్వ సాధారణం. అయితే బాబు పర్యటన అనంతరం Blind Mannn అనే పేరు గల ఎక్స్ పేజీలో సీఎం పట్టువస్త్రాలు తలపై పెట్టుకొని ఉన్న షార్ట్ వీడియో‌ ని ఎక్స్ లో అప్లోడ్ చేసి ….దేవుడికి ఇష్టంలేదని స్పష్టంగా కనిపిస్తుంది, మళ్లీ చెప్తున్నా ప్రాణగండం ఉంది క్యాప్షన్ తో ఎక్స్ లో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారి.. టీటీడీ దృష్టికి వెళ్లింది. దీనితో ఒక పవిత్ర కార్యక్రమం గురించి తప్పుడు పోస్ట్ పెట్టడంపై టీటీడీ సీరియస్ అయింది. టీటీడీ ప్రతిష్ఠ భంగం కలిగించేలా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా.. ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా ఎక్స్ లో పోస్ట్ పెట్టిన Blind Mannn అకౌంట్ నిర్వహకుడు చైతన్య పై పోలీసులకు ఫిర్యాదు చేశారు విజిలెన్స్ వింగ్ ఏవిఎస్వో.


ఏవిఎస్వో ఫిర్యాదుతో చైతన్య, మరికొందరిపై వన్ టౌన్ పోలీసులు 196,298,299,353(2) r/w BNS సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇటీవల తరచూ సోషల్ మీడియా వేదికగా తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వస్తున్న పోస్టింగ్స్ పై టీటీడీ దృష్టి సారించింది. ఎవరైనా అసత్యపు ప్రచారాలు చేస్తే తప్పక చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలా రావు తెలిపారు.

Also Read: Beauty tips: ముఖానికి పసుపు ఇలా వాడారంటే రంగు పెరగడమే కాదు, చర్మ సమస్యలు రావు

అలాగే తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల తిరుమలలోని పలు షాపులపై సైతం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో శీతల పానీయాలను ఎంఆర్‌పీ కంటే అదనంగా విక్రయిస్తున్న దుకాణదారుల నుండి రూ.లక్ష జరిమానా వసూలు చేసి, కొన్ని దుకాణాలను సీజ్ కూడా చేశారు. తాము అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ టీటీడీపై అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని టీటీడీ ప్రకటించింది.

Related News

Crime News: దారుణం.. అత్తాకోడలిపై అత్యాచారం.. దుండగుల కోసం పోలీసుల గాలింపు

Vijayasai reddy Tweet: సైలెంట్ గా కాక రేపుతున్నారా.. ఆ ట్వీట్ కి అర్థం అదేనా.. నెక్స్ట్ ప్లాన్ ఏంటి ?

Mopidevi Shocks Jagan: టీడీపీలో చేరిన మోపిదేవి.. వాన్‌పిక్ కేసుల భయంలో జగన్!

Jagan INDIA Bloc: జగన్ తీరు అప్పుడలా.. ఇప్పుడిలా.. ఇండియా కూటమి వైపు చూపులు?

Nara Lokesh: ఫేక్ కి ఫ్యాక్ట్ కి తేడా తెలియని ఎంపీ గారూ.. తప్పుడు ప్రచారం మానుకోండి.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన లోకేష్

Deepak Reddy on Kodali Nani: కొడాలి నాని దాక్కున్నాడు.. ప్రజల చేతుల్లో పడితే ‘అంకుశం’ సినిమానే.. దీపక్ రెడ్డి

Big Stories

×