EPAPER

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

TTD Cancelled Reverse Tendering system in Tirupati: రివర్స్ టెండరింగ్.. ఇప్పుడీ విధానానికి చెక్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) బోర్డులో ఇక ఈ విధానానికి స్వస్తి చెప్పింది. ఇకపై ఏ కాంట్రాక్ట్ అయినా.. కొత్త విధానంలోనే జరగనుంది. ఇంతకీ ఈ రద్దు వెనకున్న కారణాలేంటి? ఈ విధానంలో ఇప్పటి వరకు కుదిరిన ఒప్పందాల సంగతేంటి? రివర్స్ టెండరింగ్.. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ విధానం. కరెక్టుగా  చెప్పాలంటే.. ఆగస్టు 16, 2019న ఈ విధానం అమల్లోకి వచ్చింది. జీవో నెంబర్‌ 67 పేరుతో ఈ రివర్స్‌ టెండరింగ్ అధికారికంగా అమల్లోకి వచ్చేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి కాంట్రాక్ట్‌ ఈ విధానంలోనే జరిగింది.


ప్రాజెక్టులు, రోడ్లు, నాలాలు.. ఇలా పని ఏదైనా విధానం మాత్రం ఇదే.. తిరుమల తిరుపతి దేవస్థానానికి(TTD) సంబంధించి కూడా ఇదే విధానం అమల్లో ఉండేది. కానీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని పక్కన పెట్టేసింది. జీవో నెంబర్‌ 67ను రద్దు చేసేసింది. అసలు ఈ రివర్స్‌ టెండరింగ్ ప్రక్రియ అమలులోనే అనేక లోపాలున్నాయనేది ప్రస్తుత ప్రభుత్వ మాట. అందుకే ఈ ప్రక్రియను అటకెక్కించి.. పాత టెండర్‌ ప్రక్రియ. అంటే ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్‌లలో పనులను అప్పగించాలని నిర్ణయించేసింది. సింపుల్‌గా చెప్పాలంటే 2003 నాటి జీవో 94ను ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చింది. తక్కువ ధరకు పనులు పూర్తి చస్తామని లిఖితపూర్వకంగా వేసే బిడ్లను ఆమోదించాలని నిర్ణయించారు.

ఇది మాములుగా అన్ని కాంట్రాక్ట్‌ల విషయం. ఇక టీటీడీ విషయానికి వస్తే.. ఈ బోర్డు స్వతంత్య్రపరమైన బోర్డు.. కాబట్టి.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ బోర్డుపై ప్రభావం చూపదు కాబట్టి.. ప్రభుత్వ సూచన ప్రకారం ఇప్పుడు టీటీడీ కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఆపేసింది. అయితే టీటీడీ బోర్డు ఈ ప్రక్రియను ఆపేయడానికి ప్రధాన కారణం లడ్డూ కల్తీ.. అవును.. పరమపవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ కల్తీకి కారణం నెయ్యి.. కల్తీ నెయ్యి వాడటం వల్లే శ్రీవారి లడ్డూ అపవిత్రం అయ్యిందన్నది ఆరోపణ. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి SITని కూడా ఏర్పాటు చేసింది.


Also Read: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

టీటీడీ((TTD)కి కావాల్సిన నెయ్యిని ఎలా సేకరించారు..? రివర్స్‌ టెండరింగ్‌ విధానంలోనే.. అవును.. శ్రీవారి ఆలయానికి నెయ్యిని సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లకు పిలుపునిచ్చారు. వారిలో అత్యంత తక్కువగా కోట్ చేసిన వారికి టెండర్లను కట్టబెట్టారు. దీంతో ఏఆర్‌ డెయిరీ కేవలం 355కు కిలో ఆవునెయ్యిని సరఫరా చేస్తామని ఒప్పందం చేసుకుంది. చెప్పినట్టుగానే సరఫరా చేసింది కూడా.. కానీ ఓ డౌట్.. ఓ వైపు పాల ధర పెరుగుతుంటే.. నెయ్యి ధర ఎలా తగ్గింది? ఇదే ఇప్పుడు పెద్ద డౌట్.. అంతకుముందు వారు నాలుగు వందల రూపాయలకు పైగా ధర సరఫరా చేస్తే.. కొత్తగా వచ్చిన వారు 350 రూపాయలకే ఎలా సరఫరా చేశారు? నిజానికి అంత తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేయడం ఇంపాజిబుల్ అంటూ అప్పుడే చాలా సంస్థలు ఖరాఖండిగా చెప్పేశాయి కూడా. కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం ధర తగ్గించారు. అందులో లాభాల కోసం కల్తీ చేశారు. అందుకే లడ్డూలో కల్తీ జరిగిందన్న ప్రచారం జరుగుతుంది ఇప్పుడు.

స్వామివారి దగ్గర ఈ కకృత్తి ఎందుకు అనేది ఇప్పుడు అసలు ప్రశ్న.. ఇక్కడ ధర విషయాన్ని చూసుకుంటే.. క్వాలిటీ తగ్గిపోతుంది. క్వాలిటీ తగ్గితే.. ఇదిగో పరిస్థితి ఇలానే ఉంటుందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కారణం ఏదైనా ప్రస్తుతానికైతే ఈ విధానం రద్దు అయిపోయింది. మరి ఈ విధానంలో ఇప్పటికే ఖరారైన టెండర్ల సంగతేంటి అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే టీటీడీకి సంబంధించి ప్రస్తుతం 1750 కోట్ల విలువైన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటి భవిష్యత్తు ఏంటన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే ఈ టెండర్లు ఖరారైంది ఈ విధానంలోనే అని చెప్పాలి. అయితే కొనసాగుతున్న పనులు ఆగడం అనేది కాస్త కష్టమైన పనే అని చెప్పాలి. ఎందుకంటే.. చాలా వరకు పనులు అయిపోయాయి. కాబట్టి.. ఇకముందు జరిగే కాంట్రాక్టులను మాత్రమే కొత్త విధానంలో టెండర్లు పిలిచే అవకాశం కనిపిస్తోంది.

Related News

Trolling War: ఛీ.. జనం ఉమ్మేస్తున్నా.. తుడుచుకుని మళ్లీ..

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu: ఆ విషయంలో వెనక్కి తగ్గం.. సీఎం చంద్రబాబు క్లారిటీ

Perni Nani: నా వెంట్రుక కూడ పీకలేరు.. కోసి కారం పెట్టండి.. మాజీ మంత్రి నాని సెన్సేషనల్ కామెంట్స్

AP Politics: లోకేష్ కి పోటీగా అంబటి.. గ్రీన్ బుక్ ఓపెన్.. పేర్లన్నీ రాస్తున్నా.. ఎవ్వరినీ వదలనంటూ కామెంట్

×