EPAPER

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్వతంత్ర దర్యాప్తు, కాకపోతే

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్వతంత్ర దర్యాప్తు, కాకపోతే

Tirumala Laddu Row: తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. స్వతంత్ర దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఐదుగురు సభ్యులతో స్వతంత్ర టీమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ టీమ్‌లో కేంద్రం తరపున ఇద్దరు, రాష్ట్రం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒక అధికారి ఉండనున్నారు.


తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. వీటిపై దాఖలైన నాలుగు పిటిషన్లను శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు విచారణ చేపట్టింది న్యాయస్థానం. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ముందుకు నాలుగు పిటిషన్లు వచ్చాయి. వాటిలో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, సంపత్ విక్రమ్, ఓ టీవీ ఛానెల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు ఆయా పిటిషన్లు దాఖలు చేశారు.

లడ్డూ వ్యవహారంలో కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న సిట్ విచారణపై ఎలాంటి సందేహం లేదన్నారు. సమస్యను పరిశీలించామని, ఆరోపణలలో ఏదైనా నిజం ఉంటే అది ఆమోద యోగ్యం కాదన్నారు.


దేశవ్యాప్తంగా భక్తులు, ఆహార భద్రతా చట్టం కూడా ఉందని గుర్తు చేశారు సొలిసిటర్ జనరల్. ప్రస్తుత సిట్‌కి వ్యతిరేకంగా ఏమీ దాఖలు చేయలేదని, దానిని అనుమతించాలని పేర్కొన్నారు. సిట్ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి పర్యవేక్షిస్తారని, దానివల్ల విశ్వాసాన్ని కలుగుతుందన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున సిద్ధార్థ లుథ్రా, ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు.

ALSO READ: ఏపీలో మళ్లీ పర్నీచర్ లొల్లి, సిద్ధంగా ఉన్నామన్న వైసీపీ.. మంత్రి లోకేష్ ఆగ్రహం..

వైవీ సుబ్బారెడ్డి తరపున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. నెయ్యి కల్తీ మీ సమయం‌లో జరిగిందన్నారు. నెయ్యి కల్తీ జరిగితే లోపలికి ట్యాంకర్లను ఎందుకు అనుమతించారని ఎదురుదాడి మొదలుపెట్టారు. చివరకు ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. స్వతంత్ర దర్యాప్తు జరిపితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది. ఈ అంశం రాజకీయ డ్రామాగా మార్చవద్దని కోరుకుంటున్నట్లు పేర్కొంది. సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతోందన్నారు.

సెప్టెంబరు 18న తిరుమల లడ్డూ జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చెప్పడం, 25న ఎఫ్ఐఆర్ నమోదైంది. 26న సిట్ ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయింది. సీఎం మాటలు.. సిట్‌పై ప్రభావం చూపుతుందని భావించింది న్యాయస్థానం. కల్తీ జరిగిందో లేదో తెలీకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని గతంలో న్యాయస్థానం వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.

Related News

AP Politics: బాలినేని క్యూకి బూచేపల్లి అడ్డు తగిలేనా? జగన్ మార్క్ పాలిటిక్స్ ప్రకాశంలో ఫలించేనా..

AP Politics: ఏపీలో మండుతున్న రాజకీయం.. టార్గెట్ భూమన?

Supreme Court Order: కర్ర పోయి కత్తి వచ్చే? తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ-వైసీపీ రియాక్షన్స్ ఇవే!

Nara Lokesh Angry on Jagan: ఏపీలో మళ్లీ పర్నీచర్ లొల్లి, సిద్ధంగా ఉన్నామన్న వైసీపీ.. మంత్రి లోకేష్ ఆగ్రహం..

Pawan Vs Udhayanidhi stalin: సనాతన ధర్మం.. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిపై పవన్ పంచ్, ఎందుకంటే?

Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ వాయిదా.. మళ్లీ అప్పుడే..

Big Stories

×