EPAPER

Divvala Maduri: దివ్వెల మాధురి ఇంటికెళ్లిన పోలీసులు.. స్వయంగా నోటీసులు జారీ.. ఏ కేసులో తెలుసా!

Divvala Maduri: దివ్వెల మాధురి ఇంటికెళ్లిన పోలీసులు.. స్వయంగా నోటీసులు జారీ.. ఏ కేసులో తెలుసా!

Divvala Maduri: తిరుమల పోలీసులు తాజాగా.. దివ్వెల మాధురికి షాకిచ్చారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి దర్శనం కోసం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో వెళ్ళిన దివ్వెల మాధురి.. తామిద్దరం పెళ్లి చేసుకుంటామని షాకిచ్చే న్యూస్ చెప్పారు. అయితే ఇప్పుడు తిరుమల పోలీసులు, మాధురికి షాకిచ్చారు.


టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి అంటే తెలియని వారు ఉండరు. ఇక పొలిటికల్ లీడర్ గా దువ్వాడకు ఎంత గుర్తింపు ఉందో.. అదే గుర్తింపు సోషల్ మీడియాలో మాధురికి ఉంది. ఇక ఎమ్మెల్సీ శ్రీనివాస్ కుటుంబ వివాద సమయంలో మాధురి తెరపైకి వచ్చారు. అయితే ఒకరికి ఒకరు తోడుగా మాత్రమే ఉంటున్నామని, తమ మధ్య ఉన్న బంధాన్ని చెడుగా అనుకోవద్దు అంటూ పలుమార్లు మీడియాతో మాధురి అన్నారు.

అయితే దువ్వాడ వివాదం సమయంలో మాధురి అండదండగా ఉన్నారు. దీనితో వీరి మధ్య రిలేషన్ షిప్ పై సోషల్ మీడియా కోడై కూసింది. ఏదిఏమైనా వీరివురు న్యాయపరమైన చిక్కులు వీడిన అనంతరం ఒక్కటవుతారని అందరూ భావించారు. ఇటీవల దువ్వాడకు సంబంధించిన కుటుంబ వివాదం కొంత సద్దుమణిగిన స్థితిలో.. మాధురి సోషల్ మీడియాలో స్పీడ్ అయ్యారనే చెప్పవచ్చు. ఈమెకు సోషల్ మీడియా పరంగా యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే ఈమెకు సంబంధించిన ప్రతి వీడియో వైరల్ కావాల్సిందే.


తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు దువ్వాడ, దివ్వెల తిరుమలకు వెళ్లారు. అక్కడ స్వామి వారిని దర్శించుకొని కొద్దిసేపు మీడియాతో కూడా మాట్లాడారు. మాధురి మాట్లాడుతూ.. కోర్టులో తమకు గల న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే.. తాము పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. అలాగే శ్రీనివాస్ కూడా తాము రెండేళ్లుగా కలిసి ఉంటున్నట్లు, తనకు కలియుగ దైవం తిరుమలేశుని బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందుకే తిరుమలకు వచ్చినట్లు తెలిపారు.

Also Read: MLC Zakia Khanam: ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయం.. భక్తుడి ఫిర్యాదు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు

అయితే వీరి పర్యటనలో రీల్స్ చేశారని, అలాగే తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే పవిత్రమైన తిరుమల మాడవీధుల్లో రీల్స్ చేసినట్లు, అలాగే తిరుమల పవిత్రతకు భంగం కలిగే విధంగా మాధురి మాట్లాడినట్లు టిటిడి విజిలెన్స్ అధికారులు, తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకు తాజాగా 41ఏ నోటీసులు జారీ చేశారు. టెక్కలిలో మాధురి నివాసానికి స్వయంగా వెళ్లిన పోలీసులు ఈ నోటీసులను అందించారు. మాధురి విచారణకు రావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారని తెలుస్తోంది.కాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదని సమాచారం.

Related News

Rain Alert: అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుఫాన్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు !

IAS PRASHANTHI : ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్… తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన అధికారిణి

Tirumala Tickets Issue: ఏ పాపం తెలియదు.. కుట్ర జరుగుతోందంటున్న జకియా ఖానమ్.. సంబంధం లేదంటున్న బొత్స

CM Chandrababu: కుప్పంలో అధికారుల నిర్వాకం.. సీఎం చంద్రబాబుకు దక్కని చోటు.. సోషల్ మీడియాలో వైరల్

MLC Zakia Khanam: ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయం.. భక్తుడి ఫిర్యాదు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు

TTD Wedding Gifts: వివాహం నిశ్చయమైందా.. అయితే ఈ గొప్ప అవకాశం మిస్ కావద్దు.. శ్రీవారి కానుక ఉచితంగా మీ చెంతకు..

Big Stories

×