24 మంది సభ్యులతో టీటీడీ కొత్త పాలకమండలి
ఈసారి తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను వరించిన అదృష్టం
అధికారిక ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి, స్వేచ్ఛ:
TTD Chairman BR Naidu: తిరుమల తిరుమతి దేవస్థానం ఛైర్మన్‌గా టీవీ5 అధినేత బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో కొత్త పాలకమండలి ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఏపీ నుంచి, అందులోనూ టీడీపీ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ (ఐదుగురు), మహారాష్ట్ర (ఒకరు), కర్ణాటక (ముగ్గురు), తమిళనాడు (ఇద్దరు), గుజరాత్ (ఒకరు) రాష్ట్రాల నుంచి పలువురికి పాలమండలిలో చోటు దక్కింది. ఇందులో టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు, మాజీ మంత్రులు, సీనియర్లు ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నమ్మకస్తుడు, ఆర్ట్ డైరెక్టర్ బూరగాపు ఆనందసాయి టీటీడీ మెంబర్‌గా ఎన్నికయ్యారు.
సభ్యులు వీరే..
జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎమ్మెస్ రాజు, పనబాక లక్ష్మి, జాస్తి పూర్ణ సాంబశివరావు, శ్రీసదాశివరావు నన్నపనేని, జంగా కృష్ణమూర్తి, నన్నూరి నర్సిరెడ్డి, బూంగునూరు మహేందర్ రెడ్డి, బూరగాపు ఆనందసాయి, సుచిత్ర ఎల్ల, కృష్ణమూర్తి, పి.రామ్మూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, ఆర్.ఎన్ దర్శన్, జస్టిస్ హెచ్‌ఎల్ దత్, శాంతారామ్, జానకీ దేవి తమ్మిశెట్టి, అనుగోలు రంగశ్రీ, నరేశ్‌కుమార్, డా.అదిత్ దేశాయ్, శ్రీసౌరబ్ హెచ్ బోరాలు టీటీడీ మెంబర్లుగా పాలకమండలిలో ఉన్నారు.