EPAPER

Tipper Hit to Travel Bus: పల్నాడులో ఘోరం ప్రమాదం.. ట్రావెల్ బస్సు ఢీకొట్టిన టిప్పర్.. ఐదుగురు సజీవ దహనం

Tipper Hit to Travel Bus: పల్నాడులో ఘోరం ప్రమాదం.. ట్రావెల్ బస్సు ఢీకొట్టిన టిప్పర్.. ఐదుగురు సజీవ దహనం

5 Burned in Tipper Hit to Travel Bus at Palnadu: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సొంత ఊరులో ఓటు వేసి మళ్లీ హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సులో కొంతమంది బయలుదేరారు. బస్సు కొంతదూరం వెళ్లగానే మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చింది. టిప్పర్ వెనుక నుంచి బస్సును బలంగా ఢీ కొట్టింది. వెంటనే చెలరేగిన మంటల్లో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు.


అసలేం జరిగింది? మంగళవారం రాత్రి బాపట్ల జిల్లా నుంచి అరవింద ప్రైవేటు టావెల్స్‌కి చెందిన ఓ బస్సు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సులో ఎక్కువమంది చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం ప్రాంతానికి చెందినవారు ఎక్కువగా ఉన్నారు. వీరిలో చాలావరకు ఎన్నికల పోలింగ్‌కు హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వచ్చారు. ఓటు వేసి తిరిగి బయలుదేరారు.

అర్థరాత్రి ఒంటిగంటన్నర సమయంలో చిలకలూరిపేట సమీపంలోని ఈవూరివారిపాలెం వద్ద బస్సు వచ్చేసరికి వేగంగా వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు వ్యాపించాయి.  ఆ మంటలు కాస్త బస్సుకు అంటుకున్నాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునే సరికి ఐదుగురు సజీవ దహనమయ్యారు. బస్సు డ్రైవర్‌తోపాటు నలుగురు ప్రయాణికులు కాలి బూడిదయ్యారు. మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా ప్రయాణికుల ఆర్తనాదాలతో విషాదంగా మారింది.


Also Read: కియా.. భారీ అగ్నిప్రమాదం, భారీగా ఆస్థి నష్టం.. ఏం జరిగింది?

tipper hit to travel bus at palnadu
tipper hit to travel bus at palnadu

వెంటనే స్థానికులు పోలీసులు, అంబులెన్స్‌, ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇచ్చారు. బస్సులో చిక్కుకుపోయినవారిని బయటకు తీశారు. 108 వాహనాల్లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈలోగా ఫైర్ ఇంజన్లు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపట్టారు. మరణించిన బాధితుల గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించారు పోలీసులు.

Also Read: బీఎస్-4 వాహనాల కోనుగోళ్లలో అక్రమాలు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ ఛార్జ్‌షీట్

మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామంలో రహదారి పక్కన ట్రాక్టర్‌పై ధాన్యం బస్తాలు ఎగుమతి చేస్తుండగా కూలీలను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురి మృతి చెందారు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్‌లు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు విచారణ మొదలుపెట్టేశారు.

Tags

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×