EPAPER

Shilpa Brothers : నంద్యాల వైసీపీలో ఇంటర్నల్ వార్‌.. టీడీపీ టచ్‌లోకి శిల్పా బ్రదర్స్..?

Shilpa Brothers : వైసీపీలో ఇన్చార్జిల మార్పులు చేర్పుల హడావుడి కొనసాగుతూనే ఉంది. దాంతో తాడేపల్లి నుంచి ఫోన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ టికెట్ ఆశావహులు ఉలిక్కి పడుతున్నారు . అదే టెన్షన్ కర్నూలు జిల్లా వైసీపీ నేతల్లోనూ కనిపిస్తోంది. పార్టీ పెదల నుంచి ఫోన్ అంటే వికెట్ పడినట్లే అన్న భయం వారిలో కనిపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జరిగిన మార్పులతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక కీలకమైన నంద్యాల, శ్రీశైలం సెగ్మెంట్లపై ప్రకటన రావాల్సి ఉంది.. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర, శ్రీశైలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిలకు ఈ సారి టికెట్లు దక్కవన్న ప్రచారం జరుగుతోంది. దాంతో వారి వర్గీయుల్లో ఉత్కంఠ నెలకొంది.

Shilpa Brothers : నంద్యాల వైసీపీలో ఇంటర్నల్ వార్‌.. టీడీపీ టచ్‌లోకి శిల్పా బ్రదర్స్..?
andhra news updates

Shilpa Brothers latest news(Andhra news updates):


వైసీపీలో ఇన్చార్జిల మార్పులు చేర్పుల హడావుడి కొనసాగుతూనే ఉంది. దాంతో తాడేపల్లి నుంచి ఫోన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ టికెట్ ఆశావహులు ఉలిక్కి పడుతున్నారు . అదే టెన్షన్ కర్నూలు జిల్లా వైసీపీ నేతల్లోనూ కనిపిస్తోంది. పార్టీ పెదల నుంచి ఫోన్ అంటే వికెట్ పడినట్లే అన్న భయం వారిలో కనిపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జరిగిన మార్పులతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక కీలకమైన నంద్యాల, శ్రీశైలం సెగ్మెంట్లపై ప్రకటన రావాల్సి ఉంది.. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర, శ్రీశైలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిలకు ఈ సారి టికెట్లు దక్కవన్న ప్రచారం జరుగుతోంది. దాంతో వారి వర్గీయుల్లో ఉత్కంఠ నెలకొంది.

నంద్యాల రాజకీయాల్లో శిల్పా బ్రదర్స్‌కి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న అలాంటి శిల్పా కుటుంబంలో టికెట్ టెన్షన్ కనిపిస్తోంది .. ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యేగా సీనియర్ నేత శిల్పా మోహనరెడ్డి కుమారుడు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో మోహనరెడ్డి, తన వారసుడి విజయం కోసం పాటుపడ్డారు. అయితే ఇప్పుడు నంద్యాల వైసీపీలో నడుస్తున్న ఇంటర్నల్ వార్‌తో ఈసారి తమకు టికెట్ దక్కుతుందో ? లేదో? అన్న డైలమాలో ఉన్నారంట శిల్పా కుటుంబసభ్యులు.


నంద్యాల వైసీపీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్న నాయకులు.. తమ సొంత క్యాడర్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సొంత అజెండా నడిపిస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర వర్సెస్ గోకుల్‌రెడ్డి మధ్య కొంతకాలంగా వర్గ విభేదాలు ఉన్నాయి. ఒకే పార్టీ అయినప్పటికీ ఎమ్మెల్యేతో పనిలేకుండా .. ఆత్మగౌరవ యాత్ర పేరిట నంద్యాలలో పాదయాత్ర చేశారు గోకుల్ రెడ్డి.. యాత్రకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవటంతో ఆగ్రహానికి లోనైన గోకుల్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యేనే తన యాత్రను అడ్డుకునేలా చేశారని ఫైర్ అయ్యారు.

ఆ క్రమంలో ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర, గోకుల్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కి.. వర్గపోరుమరింత ముదిరిపోయింది. పార్టీ కార్యక్రమాల్లో రెండు వర్గాలు చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ.. కలిసి మాత్రం పనిచేయడం లేదు. ఎవరికి వారు సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తుండంతో.. పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. వైసీపీ పెద్దలు జోక్యం చేసుకుని వారిద్దరి మధ్య సఖ్యత కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.

అదలా ఉంటే నంద్యాలలో ఎమ్మెల్యే, ఎంపీలను మార్చాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు.. ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయంట.. నంద్యాల నియోజకవర్గంలో ముస్లిం ఓటింగ్ గణనీయంగా ఉంటుంది. దాంతో బలమైన ముస్లిం నేతను అభ్యర్ధిగా బరిలోకి దించాలని ఫిక్స్ అయిందట వైసీపీ. బలమైన నాయకుడి కోసం సెర్చింగ్ కూడా మొదలైందంట. బలమైన నాయకుడు కోసం పార్టీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిందట.

ఎప్పుడైతే ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్ధులను మారుస్తారన్న ప్రచారం మొదలైందో.. గోకుల్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ తనకి ఇవ్వాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. అదే సమయంలో శిల్లా కుటుంబం నంద్యాలకు నాన్ లోకల్ అన్న వాదను తెర మీదకు తెస్తున్నారు. ఈ సారి ఖచ్చితంగా స్థానిక కోటాలో తనకే టికెట్ ఇవ్వాలని పట్టబడుతున్నారు.

మరోవైపు శిల్పా బ్రదర్స్‌లో ఒకరైన శిల్పా చక్రపాణి.. శ్రీశైలం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. పార్టీ అధిష్టానం శిల్ప చక్రపాణి కు అనేకసార్లు తమ పని తీరు మార్చుకోవాలని.. ప్రజలలోకి వెళ్లాలని చెప్పిన శిల్పా చక్రపాణి పట్టించుకోలేదన్న ప్రచారం ఉంది. ఆయన వైఖరితో నియోజకవర్గ పరిధిలో నాయకులు కార్యకర్తలు ఆయన తీరుపై గుర్రుగా ఉన్నారంట.. చక్రపాణి అనుచరులు చేసిన భూదందాలు, దౌర్జన్యాలు వివాదాస్పదంగా మారాయి. ఇక అక్కడ వర్ధన్ బ్యాంకు స్కాంలో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపధ్యంలో శిల్పా బ్రదర్స్ వైసీపీ టికెట్లు దక్కుతాయన్న నమ్మకం లేక.. టీడీపీ వారితో మంతనాలు సాగిస్తున్నారన్న ప్రచారం స్టార్ట్ అయింది. అదీకాక వారు సొంతగా చేయించుకున్న సర్వేల్లో టీడీపీకి విజయావకాశాలున్నాయని వచ్చిందంట. దాంతో వారు పార్టీ మారే ప్రయత్నాలు ముమ్మరం చేశారంట.. అయితే చక్రపాణి మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించేస్తున్నారు. చూడాలి ఎన్నికల నాటికి శిల్పా ఫ్యామిలీ అడుగులు ఎటు పడతాయో?

Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×