EPAPER

Eluru : అమాయకులే టార్గెట్.. ఏటీఎం కార్డు మార్చి .. లక్షల కాజేసి.. నయా మోసం..

Eluru :  అమాయకులే టార్గెట్.. ఏటీఎం కార్డు మార్చి ..  లక్షల కాజేసి.. నయా మోసం..

Eluru : ఏటీఎం కార్డు మార్చి నగదు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని లక్క వరం గ్రామానికి చెందిన చందమాల మంగాదేవి అనే మహిళకు స్థానిక యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ నెల 14న తన ఏటీఎం కార్డును భర్త అరుణ్ కుమార్ కు ఇచ్చి నగదు తీసుకురమ్మని చెప్పింది.


జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయగూడెం రోడ్డులో ఉన్న ఓ ఏటీఎంకు వెళ్లి నగదు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అక్కడ ఉన్న ఓ అపరిచిత వ్యక్తిని సహాయం కోరాడు. అతను ఏటీఎం నుంచి రూ.5 వేలు తీసి ఇచ్చాడు. అరుణ్ కు ఆ వ్యక్తి వేరే ఏటీఎం కార్డు ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పలు దఫాలుగా మంగాదేవి ఖాతా నుంచి రూ.1.86 లక్షలు మాయమయ్యాయి.

ఈ విషయం తెలియని బాధిత కుటుంబం సోమవారం నగదు తీసుకునేందుకు సంబంధిత బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు అధికారులు ఏటీఎం కార్డు మారిందని చెప్పారు. ఖాతాలో సొమ్ము మాయమైనట్లు గుర్తించడంతో అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Related News

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Big Stories

×