EPAPER

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

IPS Officers: ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన ముంబయి నటి కాదంబరి జత్వానీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీ సీతారామాంజనేయులు, ఐపీఎస్ మరో ఇద్దరు అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీలపై సస్పెన్షన్ వేటు పడింది. జత్వానీ కేసులో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలకు దిగింది. జత్వానీపై కేసు నమోదు చేసి హడావుడిగా అరెస్టు చేసిన కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్‌లు కర్త, కర్మ, క్రియలు వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి.


ఈ కేసులో ఇప్పటికే విజయవాడలో ఏసీపీగా పని చేసిన హనుమంతరావ్, నాటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలపై ఇది వరకే సస్పెన్షన్ వేటు పడింది. వీరిద్దరూ కుక్కల సాగర్ ఫిర్యాదు తర్వాత కాదంబరి జత్వానీని వీరు ఇంటరాగేషన్ చేశారని తెలుస్తున్నది. హనుమంత రావు ఈ ఇంటరాగేషన్‌లో కీలక పాత్ర పోషించగా.. సత్యనారాయణ.. ప్రభుత్వంలోని పెద్దలు చెప్పినట్టు చేసుకొచ్చారని ఆరోపణలు వచ్చాయి.

కాదంబరి జత్వానీ ఈ కేసుకు సంబంధించి ఓసారి విజయవాడకు వచ్చారు. ఈ నెల 14న ఆమె ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. కుక్కల విద్యాసాగర్ సహా ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్, కాంతి రాణా, విశాల్ గున్నిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంటరాగేషన్ పేరుతో తనను తీవ్ర ఇబందులకు గురి చేశారని, తనను, తన కుటుంబానికి వీరూ మానసిక్ష క్షోభకు కారకులయ్యారని కాదంబరి జత్వానీ ఆరోపించారు. వీరిపై యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు కూడా చేశారు. తల్లిదండ్రులు, న్యాయవాదులతోపాటుగా ఆమె ఇబ్రహీంపట్నం పీఎస్‌కు వెళ్లారు.


Also Read: Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్ర కోణం ఉన్నదని, పోలీసులే తప్పుగా వ్యవహరించారని జత్వానీ పేర్కొన్నారు. కుక్కల విద్యాసాగర్‌తో పోలీసులే ఫిర్యాదు ఇప్పించుకున్నారని, పూర్వాపరాలు చూసుకోకుండా ఆకస్మికంగా కేసు నమోదు చేశారని తెలిపారు. ఆ తర్వాత ముంబయిలో ఉన్న తనను, తన కుటుంబాన్ని వేధించారని ఆరోపించారు.

ఏపీలో కాదంబరి జత్వానీ కేసు సంచలనమైంది. ఈ కేసు బయటికి రాగానే అధికార పార్టీలు సీరియస్ అయ్యాయి. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఇలా వ్యవహరిస్తే ఎలా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ కేసులో ముద్దాయిలను శిక్షిస్తాని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహించారు. కాగా, ఈ కేసును తమ పార్టీకి ఆపాదించడమేమిటని వైసీపీ నేతలు స్పందిస్తున్నారు.

Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×