EPAPER

TTD : టీటీడీ కీలక నిర్ణయం.. వార్షిక బడ్జెట్‌కు ఆమోదం..

TTD : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌ను టీటీడీ ఆమోదం తెలిపింది. రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించింది. నూతన వివాహం చేసుకోనే వధూవరులకు మంగళసూత్రాల విక్రయానికి బోర్డు ఆమోదం తెలియజేసింది. టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం వివరాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి వెల్లడించారు.

TTD : టీటీడీ కీలక నిర్ణయం.. వార్షిక బడ్జెట్‌కు ఆమోదం..
AP updates

TTD latest news today(AP updates):

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌ను టీటీడీ ఆమోదం తెలిపింది. రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించింది. నూతన వివాహం చేసుకోనే వధూవరులకు మంగళసూత్రాల విక్రయానికి బోర్డు ఆమోదం తెలియజేసింది. టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం వివరాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి వెల్లడించారు.


మంగళ సూత్రాలు తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి విక్రయించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అదే తరహాలో లక్ష్మీ కాసులను కూడా విక్రయించనున్నట్లు పేర్కొంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాస్ట్ టూ కాస్ట్ విక్రయించే విధంగా చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంది. టీటీడీ దేవస్థానం పోటులో పనిచేసే 70 మంది స్కిల్డ్ కార్మికులను గుర్తించి.. వారి జీతాన్ని 15 వేలకు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇదే తరహాలో 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను రూ. 35 వేల నుంచి రూ. 54 వేలకు పెంచుతున్నట్లు నిర్ణయించింది.

టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు ఉన్నాయి. దేవస్థానం పరిధిలో 34 ఆలయాలలో భక్తులు సౌకర్యార్దం ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి లేఖ రాశారు. గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి 30 కోట్లు కేటాయించారు. నారాయణవనంలో కొలువైన భధ్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ది పనులకు 6.9 కోట్లు కేటాయించారు. స్విమ్స్ అభివృద్ది పనులుకు 148 కోట్లు కేటాయిస్తూ టీటీడీ ఆమోద ముద్ర వేసింది. రూ. 2.5 కోట్లతో సప్తగిరి అతిధి గృహలు అభివృద్ది పనులుకు. ఎస్ఏంసీ, ఎస్ఎన్ సీకాటేజీల అభివృద్ది పనులుకు 10 కోట్లు కేటాయించింది.


టీటీడీ దేవస్థానం హుండి ద్వారా 1611 కోట్లు వస్తోందని టీటీడీ పాలక మండలి అంచనా వేసింది. దర్శన టిక్కేట్లు విక్రయం ద్వారా 338 కోట్లు, వడ్డి ద్వారా 1,167 కోట్లు, ప్రసాదం విక్రయం ద్వారా 600 కోట్లను అంచనా వేసింది. జీతాలు చెల్లింపుకు 1.733 కోట్లు,కార్పస్ ఫండ్‌కుకి 750 కోట్లు, ముడిసరుకులు కోనుగోలుకు 751 కోట్లు, ఇంజనీరింగ్ పనులుకు 350 కోట్లు కేటాయించినట్లు టీటీడీ తెలిపింది.

Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×