Big Stories

Avinash Reddy: బెయిల్‌పై అటో ఇటో.. రేపే జడ్జిమెంట్.. అవినాష్‌లో హైటెన్షన్

avinash reddy high court

Avinash Reddy: కర్నూలు హాస్పిటల్‌లో ఎంపీ అవినాష్‌రెడ్డి వాళ్ల అమ్మ. అదే ఆసుపత్రిలో ఆయన. హాస్పిటల్ చుట్టూ అనుచరుల మోహరింపు. పోలీస్ బారికేడ్లు. సీబీఐకి నో ఎంట్రీ. వాళ్లు రమ్మంటున్నా.. ఈయన రానంటున్నారు. అమ్మ ఆరోగ్యం సెట్ అయ్యే వరకూ ఆగాలంటున్నారు. మొదట్లో బీపీ, తర్వాత గుండెనొప్పి, ఆ తర్వాత వాంతులు.. ఇలా ఆమె హెల్త్ కండీషన్‌పై ఎప్పటికప్పుడు బులిటెన్లు. ఇదంతా ఎందుకంటే.. సీబీఐ విచారణను తప్పించుకోవడానికేనని విపక్షం అటాక్ చేస్తోంది. ఆయన మాత్రం కోర్టుల చుట్టూ తిరుగుతూ బెయిల్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆ బెయిల్ ఎపిసోడ్ డైలీ సీరియల్‌గా నడుస్తోంది.

- Advertisement -

లేటెస్ట్‌గా సుప్రీంకోర్టు ఆదేశాలతో గురువారం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చింది ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్. మే 25న విచారించాలంటూ సుప్రీం డైరెక్షన్ ఉంది మరి. మధ్యాహ్నం తర్వాత జస్టిస్ ఎం.లక్ష్మణ్ ముందుకు పిటిషన్ మూవ్ అయింది. అవినాష్‌రెడ్డి, సీబీఐ తరఫు న్యాయవాదులు వాదనలకు రెడీగా ఉన్నారు.

- Advertisement -

అప్పటికే సాయంత్రం కావొస్తుండటంతో వాదనలకు ఎంత సమయం పడుతుందని జడ్జి అడిగారు. కనీసం గంట పాటు వాదనలు వినిపిస్తామని సీబీఐ తరఫు లాయర్లు చెప్పారు. అటు, అవినాష్ తరఫు న్యాయవాదులు సైతం గంటకు పైగానే పడుతుందని అన్నారు. అప్పటికే ఆలస్యం కావడంతో.. అయితే, శుక్రవారం ఉదయం పదిన్నరకు వాదనలు వింటామంటూ విచారణను వాయిదా వేశారు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి.

గురువారం ఏదో ఒకటి తేలిపోతుందని అనుకుంటే.. అది కాస్తా శుక్రవారానికి పోస్ట్‌పోన్ అయింది. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఉత్కంఠ మళ్లీ కంటిన్యూ అవుతోంది. శుక్రవారం కచ్చితంగా అటోఇటో తేలిపోతుందని అంటున్నారు. ఇంతకీ, అవినాష్‌కు బెయిల్ వస్తుందా? రాదా? సీబీఐ విచారణకు ఎంపీ వెళ్తారా? వెళ్లరా? వెళ్లకపోతే ఏం చేస్తుంది? వెళితే అరెస్ట్ చేస్తుందా? ఇలా.. అవినాష్‌రెడ్డి బెయిల్, అరెస్ట్ చుట్టూ టెన్షన్ నడుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News