Big Stories

Kondapi : టీడీపీ ఎమ్మెల్యే Vs వైసీపీ ఇన్‌ఛార్జ్‌.. కొండపిలో హైటెన్షన్..

Kondapi : ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాయుడుపాలెంలోని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు టంగుటూరులోని వైసీపీ కార్యాలయానికి వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు
350 మంది పోలీసులను అక్కడ మోహరించారు.

- Advertisement -

మరోవైపు వైసీపీ తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు కౌంటర్ గా నిరసనకు ప్రయత్నించారు.
టంగుటూరులోని వరికూటి అశోక్‌బాబు ఇంటి ముట్టడికి ఎమ్మెల్యే డోలా
ఆధ్వర్యంలో భారీగా టీడీపీ కార్యకర్తలు బయలుదేరారు. మార్గంమధ్యలో 16వ నంబర్‌ జాతీయ రహదారిపై పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ సమయంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి రోడ్డుపైనే
బైఠాయించారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News