EPAPER

Chandrababu Naidu: సమస్యలు చెప్పుకోండి.. ఆలకిస్తాం!

Chandrababu Naidu: సమస్యలు చెప్పుకోండి.. ఆలకిస్తాం!

TDP Office: ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజల సమస్యలు నేరుగా ఆలకించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులకు ఈ బాధ్యతలను అప్పగించారు. పది రోజులపాటు పార్టీ శ్రేణులు, ప్రజలకు నేరుగా తమ వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకునే అవకాశాన్ని కల్పించారు. వారి వద్ద నుంచి సమస్యలు స్వీకరించి సమస్యలను పరిష్కరించడానికి వీరు కృషి చేయనున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాట్లు చేపట్టారు. పార్టీ శ్రేణులు, ప్రజలు తమ సమస్యలు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలని టీడీపీ పేర్కొంది.


పది రోజులపాటు రోజుకో మంత్రి, పార్టీ సీనియర్ నాయకులు ఈ సమస్యలు ఆలకించడానికి అందుబాటులో ఉండాలని పార్టీ ఆదేశించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం కార్యాచరణ రూపొందించింది.

వినతులు స్వీకరించే మంత్రుల జాబితా ఇలా ఉన్నది. 17వ తేదీన ఎస్ సవిత, 18వ తేదీన ఎన్ఎండీ ఫరూక్, 22వ తేదీన గుమ్మడి సంధ్యారాణి, 23వ తేదీన కొల్లు రవీంద్ర, 24వ తేదీన అనగాని సత్యప్రసాద్, 25వ తేదీన వాసంశెట్టి సుభాష్, 29వ తేదీన కొండపల్లి శ్రీనివాస్, 30వ తేదీన మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, 31వ తేదీన బిసి జనార్ధన్ రెడ్డిలతోపాటు 19, 26వ తేదీల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌లు వినతులు స్వీకరిస్తారు.


ఇక టీడీపీ ఆఫీసులో అందుబాటులో ఉండే జాతీయ నాయకుల వివరాలు ఇలా ఉన్నాయి. 17వ తేదీన బొల్లినేని రామారావు, 18వ తేదీన వైకుంఠం ప్రభాకర్ చౌదరి, 22వ తేదీన కావలి ప్రతిభ భారతి, 23వ తేదీన కొట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, 24వ తేదీన బీద రవిచంద్ర, 25వ తేదీన కెఎస్ జవహర్, 29వ తేదీన పనబాక లక్ష్మి, 30వ తేదీన కంభంపాటి రామ్మోహన్ రావు, 31వ తేదీన తోటా సీతారామ లక్షమిలు వినతులు స్వీకరించడానికి అందుబాటులో ఉంటారు.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×