EPAPER

TDP Phone Call Survey | తిరుపతిలో టిడిపి ఫోన్ కాల్ సర్వే.. అభ్యర్థుల గుండెల్లో గుబులు!

TDP Phone Call Survey | తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో టీడిపి నిర్వహించిన ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్ సర్వే.. టికెట్ అశాహహుల గుండెల్లో గుబులు రేపుతుంది. అభ్యర్థిపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జరిగే ఆ రికార్డెడ్ వాయిస్ కాల్స్‌లో తమ పేర్లు లేకపోవడంతో సీనియర్ నేతలు గాభరాపడిపోతున్నారు.

TDP Phone Call Survey | తిరుపతిలో టిడిపి ఫోన్ కాల్ సర్వే.. అభ్యర్థుల గుండెల్లో గుబులు!

TDP Phone Call Survey | తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో టీడిపి నిర్వహించిన ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్ సర్వే.. టికెట్ అశాహహుల గుండెల్లో గుబులు రేపుతుంది. అభ్యర్థిపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జరిగే ఆ రికార్డెడ్ వాయిస్ కాల్స్‌లో తమ పేర్లు లేకపోవడంతో సీనియర్ నేతలు గాభరాపడిపోతున్నారు. తిరుపతి టికెట్ కోసం టీడీపీలో పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే కేవలం నలుగురి పేర్ల మీదే సర్వే జరుగుతుండటం మిగిలిన వారిలో కలకలం రేపుతోంది. మరో వైపు పోత్తులో భాగంగా తిరుపతి సీటు జనసేన ఆశిస్తోంది. తిరుపతి తమకు వస్తుందని భావిస్తున్న వారికి.. టీడీపీ సర్వే ఇబ్బందిగా మారిందంటున్నారు.


ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరం నుంచి ప్రజా ప్రతినిధిగా ఎన్నికవ్వాలని ప్రతి లీడర్ ఆశపడతారు. దేశ విదేశాల్లోని ప్రముఖులతో పరిచయాలు సులభంగా ఏర్పడుతాయని.. సోషల్ స్టాటస్ పెరిగి, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్న ఆశతో.. తిరుపతి ఎమ్మెల్యేగా పోటీకి ప్రయత్నిస్తుంటారు. ఈ సారి వైసీపీ అక్కడ నుంచి పోటీకి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డికి అవకాశం కల్పించింది. వైసీపీలో భూమన ఫ్యామిలీకి తప్ప మరొకరికి టికెట్ దక్కే అవకాశం లేదు. తిరుపతి సెగ్మెంట్లో ఇతర సామాజికవర్గాల వారి ప్రాబల్యం ఉన్నప్పటికీ .. భూమన కుటుంబానికే వైసీపీ ప్రాధాన్యత ఇస్తుంది.

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సామాజిక పరంగా తీసుకుంటే బలిజల ఓట్ల ఎక్కువ. దాదాపు 22 శాతం ఆ వర్గం ఓట్లు ఉన్నాయి. తర్వాత వరుసలో ఎస్సీ సామాజిక వర్గం , తర్వాత కమ్మ, రెడ్డి , యాదవ సామాజిక వర్గం ఓట్లు కనిపిస్తాయి. ఆ లెక్కలతోనే టీడీపీ అవిర్భావం నుంచి రెండు సార్లు మినహా.. అన్ని ఎన్నికలలో బలిజ సామాజిక వర్గ నేతలకే అవకాశం ఇస్తూ వచ్చింది. తాజాగా కూడా అదే సామాజిక వర్గానికి సంబందించిన నేతలకు అవకాశం ఇవ్వనున్నట్లు ఐవిఅర్ఎస్ సర్వే తీరుతో స్పష్టం చేసింది.


తాజాగా తిరుపతి నగరంలో మూడు రోజుల పాటు పోన్ సర్వే నిర్వహించారు. అందులో ఉకా విజయ్ కూమార్, జేబీ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనవరాలు కీర్తి, డాక్టర్ కొడూరు బాల సుబ్రమణ్యంలపై అభిప్రాయ సేకరణ చేశారు. దానికి సంబంధించి దాదాపు 16వేల వరకు పోన్లు వచ్చినట్లు తెలుస్తోంది.ఇందులో 6వేల మంది సర్వేకు సమాదానం ఇవ్వలేదని మిగతా వారు మాత్రమే తమ అభిప్రాయం వెల్లడించినట్లు మంగళగిరిలోని టీడీపీ ఆఫీసు వర్గాల సమాచారం.

టీడీపీ అభిప్రాయ సేకరణ చేసిన ఆ నలుగురు ఆశావహులూ .. బలిజ సామాజికవర్గానికి చెందిన వారే అవ్వడం గమనార్హం. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రతయ్నం మొదలుపెట్టారంట వైసీపీ నేతలు. ఫోన్ సర్వేలో మీ పేర్లు ఎందుకు రాలేదని టీడీపీ టికెట్ ఆశిస్తున్న యాదవ, రెడ్డి సామాజిక వర్గం నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంట. దానికి తోడు సదరు నేతలకు సంబంధించి సోషల్ మీడియాలో టీడీపీకి వ్యతిరేక ప్రచారం చేస్తూ .. వర్గ విభేదాలు లేవనెత్తే ప్రయత్నాలు మొదలుపెట్టారంట. ఈ విషయాన్ని టీడీపీ వర్గాలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

తిరుపతిలో ఈ సారి కూడా బలిజ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ వర్గాలకు స్పష్టం చేశారంటున్నారు. అయితే ఐవిఅర్ఎస్ తర్వాత టిడిపి నేతలలో కూడా గుబులు మొదలు అయ్యిదంట. ముఖ్యంగా ఆ అభిప్రాయ సేకరణలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మపేరు కాకుండా కొత్తముఖమైన అమె మనవరాలు పేరు ఫోకస్ అవ్వడం వారికి ఇబ్బందిగా మారిందంట .. ఐవిఅర్ఎస్ కాల్ తర్వాత నేరుగా పార్టీ కో అర్డి నేటర్లను కలసిన మిగిలిన ఆశావహులు ముగ్గురూ.. తాము పోటీకి అర్థికంగా సిద్దంగా ఉన్నట్లు తెలిపారంట. అంతేకాక తమ ముగ్గురిలో ఎవ్వరికి టికెట్ ఇచ్చిన కలసి కట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారంట.

మొత్తం మీద తిరుపతి టిడిపిలో నూతన నాయకత్వానికి తెర లేపితే జనసేనలో టికెట్ అశిస్తున్న నాయకుడు మాత్రం హాడావుడి పడిపోతున్నారంట. తిరుపతి నుంచి గతంలో ప్రజారాజ్యం తరపున మెగాస్టార్ చిరంజీవి పోటీ చేసి గెలిచారు. ఆ లెక్కలతో ఇక్కడ నుంచి జనసేనానా పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయక పోతే తనకు అవకాశం వస్తుందని జనసేన నేత డాక్టర్ హారి ప్రసాద్ ఆశలు పెట్టుకున్నారు. అయితే టీడీపీ అభ్యర్ధి కోసం అభిప్రాయ సేకరణ జరగడంతో ఆయన తెగ టెన్షన్ పడిపోతున్నారంట.

Tags

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×