EPAPER

JC Prabhakar Reddy: ఇసుక దందాపై జేసీ ఫైర్.. టిప్పర్ డ్రైవర్లకు వార్నింగ్

JC Prabhakar Reddy: ఇసుక దందాపై జేసీ ఫైర్.. టిప్పర్ డ్రైవర్లకు వార్నింగ్

JC Prabhakar Reddy Warning to Tipper Drivers: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు కట్టుకునే వారికి ఇసుకను ఫ్రీ గా సప్లై చేస్తున్నట్లు ప్రకటించింది సర్కార్. అయితే ఇల్లు కట్టుకునేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అందుకు కొన్ని నియమ, నిబంధనలను విధించింది. ఇసుక ఫ్రీ నే.. కానీ.. డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో జరుగుతున్న ఇసుక దందాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టిప్పర్ డ్రైవర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయనొక వీడియో విడుదల చేశారు.


తాడిపత్రి నియోజకవర్గంలో 25 మంది ఇసుక దందా చేస్తున్నారని, వారంతా వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. ఇసుక దందా చేస్తున్నవారంతా తనకు ఆప్తులేనని, పార్టీకోసం ఐదేళ్లు తన వెన్నంటే ఉండి కష్టపడ్డారని, డబ్బుకోసం ఇలాంటి పనులు చేయవద్దని సూచించారు. ఇసుక దందా గురించి తానెంతో పోరాడానని, ఎంతో నష్టపోయానని చెప్పుకొచ్చారు. అలాంటి తన ఆప్తులే ఇసుక దందా చేస్తుండటం ఏం బాగలేదన్నారు. కొప్పూరులో ఆదివారం ఏసీబీ వాళ్లు ఎంక్వైరీకి వచ్చారని, దందా చేసి.. అనవసరంగా చిక్కుల్లో పడొద్దని తెలిపారు.

Also Read: అదంతా సైకో వైసీపీ బ్యాచ్ పనే..అన్న క్యాంటీన్లపై ఫేక్ ప్రచారం మంత్రి నారా లోకేశ్ కౌంటర్


అలాగే తన నియోజకవర్ంలో ఇసుక లోడుతో బండ్లు తోలితే.. వాటిని బయటికి కూడా రానివ్వనంటూ టిప్పర్ ఓనర్లను, డ్రైవర్లను హెచ్చరించారు. పార్టీకోసం కష్టపడి చాలా పోగొట్టుకున్నానని, అలాగని ఇసుక దందా చేస్తున్నానా ? అని హెచ్చరించారు. 2,50,000 మంది ఓటర్లున్న నియోజకవర్గంలో 25 మంది ఇసుక దందా చేస్తున్నారని, వారంతా ఎవరిని ఉపయోగించుకుని ఇసుక అమ్ముకుంటున్నారో తనకు బాగా తెలుసన్నారు జేసీ. ఇకనైనా అలాంటి పనులు మానుకోవాలని, కావాలంటే వేరే విధంగా సహాయం చేస్తానని తెలిపారు. ఇలాంటి పనులు చేసి పార్టీకి, తనకు దూరం కావొద్దని కోరారాయన.

Related News

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి రాంబాబు

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Minister Kandula Durgesh: రాష్ట్రంలో స్టూడియోలు నిర్మించండి.. నిర్మాతలకు మంత్రి మరోసారి ఆహ్వానం

Tirumala Laddu: తిరుమల లడ్డూపై వివాదం.. వేంకటేశ్వరుడికి మచ్చతెచ్చేలా మాజీ సీఎం చేశారా?

Ysrcp Mlas: ఇంట్లో కుంపటి.. జగన్‌కు ఇక ఝలక్‌ల మీద ఝలక్‌లే, ఎందుకంటే?

Kadambari Jatwani: న్యాయం కోసం.. హోంమంత్రి అనితను కలిసిన.. నటి కాదంబరి జత్వానీ

Big Stories

×