EPAPER

TDP lagging in Chittoor | చిత్తూరులో ప్రచారం మొదలుపెట్టేసిన వైసీపీ.. టీడీపీలో పరిస్థితి ఏంటి?

TDP lagging in Chittor | చిత్తూరు నియోజకర్గంలో అధికార పార్టీ వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించడమే కాకుండా ప్రచారాన్ని సైతం ప్రారంభించింది. అయితే అక్కడ టీడీపీలో మాత్రం ఎలాంటి కదలికా కనపడటం లేదు. కనీసం పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ముందుండి నడిపించే నాయకుడు కూడా కనపడటం లేదు.

TDP lagging in Chittoor | చిత్తూరులో ప్రచారం మొదలుపెట్టేసిన వైసీపీ.. టీడీపీలో పరిస్థితి ఏంటి?

TDP lagging in Chittoor | చిత్తూరు నియోజకర్గంలో అధికార పార్టీ వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించడమే కాకుండా ప్రచారాన్ని సైతం ప్రారంభించింది. అయితే అక్కడ టీడీపీలో మాత్రం ఎలాంటి కదలికా కనపడటం లేదు. కనీసం పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ముందుండి నడిపించే నాయకుడు కూడా కనపడటం లేదు. చిత్తూరు టీడీపీ టికెట్ కోసం అశావహులు మాత్రం తెగ హైరానా పడిపోతున్నారు. అభ్యర్ధి ఖారారుకు అధిష్టానం నిర్వహిస్తున్న ఐవిఅర్ఎస్ ఫోన్ సర్వేలో తమ పేర్లు వినిపించడం లేదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు చిత్తూరు నగరంలో టీడీపీ పరిస్థితి ఏంటి?


చిత్తూరు జిల్లా కేంద్రంలో కేడర్ ఉన్నా లీడర్ లేడన్నట్లు తయారైంది టీడీపీ పరిస్థితి. గత ఐదు సంవత్సరాలుగా అక్కడ పార్టీని నడిపించే నాయకుడు కనిపించడం లేదు. మరో వైపు అధికార పార్టీ.. అర్టీసి వైఎస్ చైర్మన్ విజయానందరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో విజయానందారెడ్డి అప్పుడే క్షేత్ర స్థాయిలో ప్రచారం ప్రారంభించారు.

2019 ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన మాజీ ఎమ్మెల్యే మనోహర్ అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి పోయారు. దీంతో పార్టీ చుక్కాని లేని నావలా తయారయింది. పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ. తన సొంత నియోజకవర్గం చంద్రగిరిపైనే ఎక్కువ ఫోకస్ పెడతూ.. చిత్తూరులో పార్టీ కార్యక్రమాలు పెద్దగా నిర్వహించకపోతుండటంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. పార్టీ నాయకులు బాలాజీ, వసంత నాయుడు , మాజీ మేయర్ హేమలతలు అడపదడపా మాత్రమే కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. చివరకు లోకేష్ పాదయాత్రను సరిగ్గా ఉపయోగించుకోలేక పోయారు స్థానిక నాయకులు. దీంతో అప్పటి నగర కమటీని పూర్తిగా రద్దు చేసింది పార్టీ అదిష్టానం. తర్వాత ఇప్పటి వరకు కమిటి ఏర్పాటు చేయలేదు.


పొత్తులో బాగంగా చిత్తూరును జనసేన కేటాయిస్తారనే ప్రచారం ఉంది. మరో వైపు ఇక్కడ టీడీపీ టికెట్ కోసం గురజాల జగన్మోహన్ హాడావుడి చేస్తున్నారు. గుడిపాల మండలానికి చెందిన జగన్మోహన్‌కు బెంగుళూరులో విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు. చాలా కాలంగా చిత్తూరులో గురజాల జగన్మోహన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కాజూరు బాలాజీ , మాజీ మేయర్ హేమలత, మాజీ కార్పోరేటర్ వసంత నాయుడు టికెట్ రేసులో కనిపిస్తున్నారు. అయితే వారిలో అర్థికంగా బలవంతుడు గురజాల జగన్ మాత్రమే అంటున్నారు.

జిల్లా అగ్రనాయకులు మాత్రం వన్నె కాపు సామాజిక వర్గానికి చెందిన తిరుచునూరు మాజీ సర్పంచ్ సీఅర్ రాజన్‌ను పార్టీలో చేర్పించారు. అయన తాను చిత్తూరు నుంచి బరిలో ఉంటానని అంటున్నారు. ఆ క్రమంలో పార్టీ నిర్వహించిన ఐవిఅర్ఎస్ ఫోన్ సర్వేలో గురజాల జగన్మోహన్ , సీఅర్ రాజన్ పేర్లు మాత్రం రావడంతో మిగతా వారు ఢీలా పడిపోతున్నారు. మరోవైపు మాజీ ఎంపి, దివంగత డీకే అదికేశవులనాయుడి కూమారుడు డీకే శ్రీనివాస్ నూతన సంవత్సరానికి ముందు చిత్తూరులో హాడావుడి చేసారు. 2024 ఎన్నికల బరిలో ఉంటానని పేర్కొన్నారు. దాంతో పార్టీల కతీతంగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అయన చుట్టూ చేరారు.

అయితే అప్పటి నుంచి డీకే శ్రీనివాస్ వైపు నుంచి ఎలాంటి కదలికా కనపడటం లేదు. మరోవైపు గురుజాల జగన్మోహన్ తన హాడావుడి పెంచారు . పార్టీ అదిష్టానం నిర్ణయం వెలుకడక పోయినప్పటికీ .. క్షేత్ర స్థాయి నుంచి టీడీపీ క్యాడర్ ను తన వైపు తిప్పుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. మరి చిత్తూరు సీటు పొత్తుల్లో భాగంగా జనసేనకు వెళుతుందో?.. లేకపోతే టీడీపీ అధిష్టానం అభ్యర్ధిగా ఎవరిని ప్రకటిస్తుందో కాని అక్కడ టీడీపీ శ్రేణుల్లో మాత్రం తీవ్ర గందరగోళం నెలకొందిప్పుడు.

Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×