EPAPER

Vijayawada Central | బిగ్ టీవి సర్వే రిపోర్ట్.. విజయవాడ సెంట్రల్ లో గెలుపు టీడీపీదేనా?..

Vijayawada Central| ఏపీ రాజకీయాల్లో బెజవాడ పాలిటిక్స్ రూటే సపరేటు. ఓ రకంగా ఆంధ్ర రాజకీయాలు ఇక్కడ నుంచే శాసిస్తారనటంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు టీపీడీకి కంచుకోటగా ఉన్న బెజవాడలో.. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది.హేమాహేమీలను పక్కన పెట్టి.. విజయవాడ వాసులు..ఫ్యాన్‌కే పట్టం కట్టారు.

Vijayawada Central | బిగ్ టీవి సర్వే రిపోర్ట్.. విజయవాడ సెంట్రల్ లో గెలుపు టీడీపీదేనా?..

Vijayawada Central| ఏపీ రాజకీయాల్లో బెజవాడ పాలిటిక్స్ రూటే సపరేటు. ఓ రకంగా ఆంధ్ర రాజకీయాలు ఇక్కడ నుంచే శాసిస్తారనటంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు టీపీడీకి కంచుకోటగా ఉన్న బెజవాడలో.. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది.హేమాహేమీలను పక్కన పెట్టి.. విజయవాడ వాసులు..ఫ్యాన్‌కే పట్టం కట్టారు. ఎంపీ స్థానంలో టీడీపీ గెలిచినా.. మెజార్టీ ఎమ్మెల్యే స్థానాల్లో మాత్రం ఫ్యాన్ హవా నడిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. ఏపీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సిటీగా విజయవాడ ఉంది. విజయవాడ సెంట్రల్‌ విజయానికి వస్తే.. 2019లో మల్లాది విష్ణు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బోండా ఉమాపై స్వల్ప మెజారిటీతో గెలిచారు. తాజాగా మారుతున్న సమీకరణాలతో విజయవాడ సెంట్రల్‌ సీటు ఎవరు కైవసం చేసుకుంటారనే ఆసక్తి నెలకొంది. ఇక.. 2024 ఎన్నికల్లో బలాబలాలు ఎలా ఉండబోతున్నాయి. ఇక్కడ గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి. ఓ సారి పరిశీలిద్దాం.


2019 ఎన్నికల ఫలితాలు..
బోండా ఉమా Vs మల్లాది విష్ణు

బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు.. 2009 ఆ తర్వాత 2019లో ఇక్కడ నుంచి విజయం సాధించారు. 2019లో స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి మాజీ మంత్రి
వెల్లంపల్లి శ్రీనివాస్‌ ను వైసీపీ రంగంలోకి దించబోతోంది.


వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్లస్‌పాయింట్స్..
క్యాడర్‌ను కలుపుకునే తత్వం
పార్టీకి విధేయుడిగా ఉండటం
టీడీపీపై ఘాటు విమర్శలు చేయటం

వెల్లంపల్లి శ్రీనివాస్‌ (వైసీపీ) మైనస్‌ పాయింట్స్‌
నియోజకవర్గానికి వెల్లంపల్లి కొత్త కావటం
అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఉండటం
అందరికీ ప్రభుత్వ పథకాలు అందలేదని ఆగ్రహం

బోండా ఉమా ( టీడీపీ) ప్లస్‌పాయింట్స్‌
టీడీపీ-జనసేన పొత్తు ఉండటం
స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండటం
ప్రజాసమస్యలపై గళమెత్తడం
అమరావతి రాజధాని స్టాండ్‌పై ఉండటం

బోండా ఉమ మైనస్‌ పాయింట్స్‌
టీడీపీ-జనసేన కార్యకర్తల సమన్వయ లోపం
కేశినేని నానిపై లేనిపోని కామెంట్స్ చేశారనే ఆరోపణ
అన్నీ తానై పార్టీలో ఇతర వాయిస్‌ వినిపించరని ఆరోపణ

చిగురుపాటి బాబూరావు (సీపీఎం) ప్లస్‌పాయింట్స్‌
రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరు
స్థానిక సమస్యపై పోరాటం చేయటం
గతంలో పేదలపక్షాన పోరాడటం

చిగురుపాటి బాబూరావు మైనస్‌ పాయింట్స్‌
సీపీఎం పార్టీకి క్యాడర్ లేకపోవటం
ఉన్న ఓట్లల్లో కొన్ని ఇతర పార్టీలకు వెళ్లటం
సొంతంగా నిలదొక్కుకునే అవకాశం లేకపోవటం

కులాల లెక్కలు..
బ్రాహ్మణ 23%
కాపు 19 %
ఎస్సీ 11 %
కమ్మ 9 %
గౌడ 8 %
ముస్లిం 6 %

విజయవాడ సెంట్రల్‌లో బ్రాహ్మణ సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ 50 శాతం,టీడీపీ 40 శాతం, జనసేన 5 శాతం..సీపీఎం 5 శాతాల్లో ఓటింగ్ పంచుకోనున్నట్లు బిగ్‌టీవీ సర్వేలో తేలింది. ఈసారి సీటు.. వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ఇవ్వటంతో ఫలితాలు ఎలా రాబోతున్నాయనే ఉత్కంఠ కూడా ఉంది. అటు టీడీపీ యువనేత నారా లోకేష్‌.. పలు సభల్లో పాల్గొని… వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అవకాశం ఇస్తే.. బ్రాహ్మణుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ దోహదం చేస్తుందనే హామీతో.. ఈ సారి బ్రాహ్మణ సామాజికవర్గం కూడా తెలుగుదేశం వైపు చూసే అవకాశాలున్నాయి.

గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు వైసీపీ-టీడీపీ పంచుకోగా.. ఈ సారి టీడీపీకే ఎక్కువ పడే అవకాశాలున్నాయి. పవన్‌ కల్యాణ్‌ టీడీపీతో పొత్తులో ఉండటం సహా యువత ఎక్కువగా ఉండటం.. కాపు సామాజిక వర్గం టీడీపీ-జనసేన మైత్రికే మొగ్గు చూపుతాయని బిగ్‌టీవీ సర్వేలో తేలింది. ఎస్సీల్లో 11 శాతం ఓటింగ్‌ ఉండగా.. వైసీపీ 50 శాతం, టీడీపీ 40 శాతం, జనసేన 5 శాతం, సీపీఎం 5 శాతం.. ఓట్లు పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వేలో తేలింది. కమ్మ ఓటర్లు 9 శాతం ఉండగా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. వైసీపీకి 20 శాతం, టీడీపీకి 55 శాతం, జనసేనకు 5 శాతం, సీపీఎంకు 5 శాతం ఓట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ గౌడ కులస్థులకు 8 శాతం ఓట్ బ్యాంకు ఉంది. ఇందులో వైసీపీకి 50 శాతం, టీడీపీకి 40 శాతం, జనసేన 5 శాతం, సీపీఎం 5 శాతం ఓట్లు పంచుకునే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అటు మైనార్టీలు 6 శాతం ఓట్‌ బ్యాంక్ కలిగి ఉండగా.. అందులో వైసీపీకి 50 శాతం, టీడీపీకి 40 శాతం, జనసేనకు 5 శాతం, సీపీఎంకు 5 శాతం ఓట్లు పడతాయని సర్వేలో తేలింది. ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు పోటీలో ఉంటే… ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం….

వెల్లంపల్లి శ్రీనివాస్ Vs బోండా ఉమా
YCP 38%
TDP 46%
సీపీఎం 7 %

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. విజయవాడ సెంట్రల్‌లో టీడీపీ హవా కొనసాగుతున్నట్లు బిగ్‌టీవీ సర్వేలో తేలింది. టీడీపీ జనసేన పొత్తుతో అభ్యర్థిని దింపితే విజయావకాశాలు పెరుగుతాయని సర్వేలో తేలింది. వైసీపీ నుంచి టిక్కెట్ కన్ఫామ్ చేసుకున్న వెల్లంపల్లి శ్రీనివాస్‌.. టీడీపీ-జనసేన పొత్తుతో రంగంలోకి దిగే అభ్యర్థిని ఢీకొంటే.. వెల్లంపల్లికి 38 శాతం గెలుపు అవకాశాలు ఉండగా.. బోండా ఉమా లేదా.. టీడీపీ-జనసేన పొత్తుతో నిలబడే అభ్యర్థికి 46 శాతం విజయ అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఎడ్జ్ ఎక్కువగా ఉన్నట్లు బిగ్‌టీవీ ఎలక్షన్‌ సర్వేలో ఓటర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×