EPAPER

Prakasam Barrage boat incident: ప్రకాశం బ్యారేజ్ బోట్ల కుట్ర రివీల్.. కొత్త విషయాలు బయటపెట్టిన టీడీపీ, కాకపోతే..

Prakasam Barrage boat incident: ప్రకాశం బ్యారేజ్ బోట్ల కుట్ర రివీల్.. కొత్త విషయాలు బయటపెట్టిన టీడీపీ, కాకపోతే..

Prakasam Barrage boat incident: ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయా? వరదల విషయంలో వైసీపీ అన్ పాపులర్ అయ్యిందా? బ్యారేజ్‌ని కూల్చేసే కుట్ర చేశారా.. చేయించారా? దీని వెనుక కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే ఉన్నారా? దీనికి కర్మ, కర్త, క్రియ ఎవరు? ఈ విషయంలో వైసీపీ అధికార పార్టీపై ఎదురుదాడి చేయలేకపోతోంది? దీనికి సంబందించి టీడీపీ కొత్త విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది.


ఏపీలో బెజవాడ వరదల రాజకీయం కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్‌ని బోట్ల ఢీ కొన్న వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటన జరిగి దాదాపు 15 రోజులు అవుతోంది. బ్యారేజీ దగ్గర ఐదురోజులుగా బోట్ల తొలగింపు పనులు మొదలయ్యాయి.

విశాఖ, కాకినాడ నుంచి వచ్చిన రెండు టీమ్‌లు ఏక కాలంలో పనిచేస్తున్నాయి. పడవలను బయటకు లాగేందుకు కటింగ్ ప్రక్రియ చేస్తున్నాయి స్కూబా టీం. పడవలు బయటికి తీసురావాలనే లక్ష్యంగా పెట్టుకున్నాయి ఆయా టీమ్‌లు.


ప్రకాశం బ్యారేజ్ కూల్చేసే కుట్ర జరిగిందన్నది ప్రధాన టీడీపీ ఆరోపణ. దీనికి సంబంధించి నిమిషం నిడివి గల వీడియోను విడుదల చేసింది. ఘటన వెనుక అధినేత అన్నీతానై వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఆయన ఆలోచనలను టీమ్‌తో చెప్పి చేయించినట్టు అందులో క్లియర్‌గా వివరించింది టీడీపీ.

ALSO READ: హాట్ కేకుల్లా సంక్రాంతి ట్రైన్ టికెట్స్.. నిమిషాల్లో రిజర్వేషన్ క్లోజ్!

ఇందులో పాత్రధారులుగా తలశిల రఘురాం, నందిగం సురేష్‌తోపాటు మరొకరు ఉన్నారు. బ్యారేజ్ కూలిపోతే లక్ష మంది చనిపోతారని, అప్పుడు ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయడం, రాష్ట్రపతి పాలన రావడంతో తాను సీఎం అవుతానని జగన్ అన్నట్లుగా ఉంది.  మరోవైపు బోట్ల ఓనర్లను కస్టడీకి తీసుకునేందుకు  న్యాయస్థానంలో పిటిషన్ వేయాలని భావిస్తోంది ప్రభుత్వం.

వివేకా హత్య కేసు. కోడి కత్తి డ్రామా, పింక్ డైమండ్ వ్యవహారాలపై వైసీపీ చేసిన రాజకీయాలను గమనించింది టీడీపీ. ప్రజలను మభ్యపెట్టి టీడీపీ నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేశారు జగన్. బోట్ల వ్యవహారాన్ని గమనించిన టీడీపీ, ఇందులో వైసీపీ ప్రమేయముందని నమ్ముతోంది. పోలీసుల విచారణలో బయటపడిన ఆధారాలతో ఈ వీడియోను రూపొందించి  రిలీజ్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వరదలను డైవర్ట్ చేసే ప్రయత్నంలో టీడీపీ ఉందని పదేపదే ఆరోపిస్తోంది వైసీపీ. శుక్రవారం కాకినాడలో వరద బాధితులను పరామర్శించిన జగన్,  సీఎం చంద్రబాబుపై బురద జల్లే ప్రయత్నం చేశారు.

వరదల వ్యవహారంపై జగన్ ఆలోచన తీరును తప్పుబట్టారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి. 60 మంది చనిపోయారని జగన్ పదేపదే చెప్పడాన్ని తనదైనశైలిలో కౌంటరిచ్చారు. జనం ఎంత ఎక్కవమంది చనిపోతే జగన్ అంత ఆనంద పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరైనా మంచి కోరుతారని, చనిపోవాలని కోరుతారా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారాయన.

 

Related News

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి రాంబాబు

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Minister Kandula Durgesh: రాష్ట్రంలో స్టూడియోలు నిర్మించండి.. నిర్మాతలకు మంత్రి మరోసారి ఆహ్వానం

Tirumala Laddu: తిరుమల లడ్డూపై వివాదం.. వేంకటేశ్వరుడికి మచ్చతెచ్చేలా మాజీ సీఎం చేశారా?

Ysrcp Mlas: ఇంట్లో కుంపటి.. జగన్‌కు ఇక ఝలక్‌ల మీద ఝలక్‌లే, ఎందుకంటే?

Kadambari Jatwani: న్యాయం కోసం.. హోంమంత్రి అనితను కలిసిన.. నటి కాదంబరి జత్వానీ

Big Stories

×