EPAPER

Swiggy Services Ban: ఏపీలో స్విగ్గీ సేవలు బ్యాన్, హోటల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం, కారణం తెలుసా?

Swiggy Services Ban: ఏపీలో స్విగ్గీ సేవలు బ్యాన్, హోటల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం, కారణం తెలుసా?

Swiggy Services Ban In AP: ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బాయ్ కాట్ చేయాలని ఏపీ హోటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. రాష్ట్రంలో కొంతకాలంగా స్విగ్గీతో హోటల్స్ అసోసియేషన్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా సమావేశమైన అసోసియేషన్ సభ్యులు ఈ నెల 14 నుంచి స్విగ్గీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.


చిన్న హోటల్స్ కు తీవ్ర నష్టం

తమకు ఇవ్వాల్సిన కమిషన్ విషయంలో స్విగ్గీ సంస్ధ చాలా నిబంధనలు పెడుతుందని హోటల్స్ యాజమాన్యాల అసోసియేషన్ వెల్లడించింది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు ఏమాత్రం చెప్పకుండానే కాంబో ప్యాకేజీల పేరుతో ఆర్డర్లు బుక్ చేస్తున్నారని, వాటి ఖర్చులు, ట్యాక్సులు సైతం తమ మీదే వేస్తున్నారని మండిపడింది. ఈ విషయంలో జొమాటో సంస్థ కొంత వరకు తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపినప్పటికీ, స్విగ్గీ సంస్థ అస్సలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు.


కొంత కాలంగా హోటల్స్, ఫుడ్ డెలివరీ యాప్స్ మధ్య విబేధాలు

ఏపీలో గత కొంతకాలంగా  హోటల్ యాజమాన్యాలకు, స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ కు మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. సరైన సమయంలో పేమెంట్స్ ఇవ్వకపోవడం, ఎక్కువ కమిషన్ డిమాండ్ చేయడంతో  స్విగ్గీతో పాటు జొమాటోపైనా హోటల్స్ యాజమాన్యాలు అసంతృస్తిగా ఉన్నాయి. ఇదే విషయంపై గతంలో ఓసారి చర్చలు జరపగా, జొమాటో కొంతమేర వారి సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. అయితే, స్విగ్గీ మాత్రం పట్టించుకోలేదు. తమ హోటల్స్ ద్వారా వ్యాపారం చేసుకుంటూ తమనే ఇబ్బంది పెడతారా? అంటూ హోటల్స్ యాజమాన్యం ఏకంగా స్విగ్గీ సంస్థనే బహిష్కరించాయి.

ఈ నెల 14 నుంచి స్విగ్గీ సేవలు బంద్

తాజాగా విజయవాడలో సమావేశమైన హోటల్స్ యాజమాన్యాల అసోసియేషన్ ఆన్ లైన ఫుడ్ డెలివరీ యాప్స్ తీరుపై తీవ్ర అసంతృస్తి వ్యక్తం చేసింది. తమ సమస్యలను పరిష్కరించేందుకు స్విగ్లీ సంస్థకు ఈ నెల 14 వరకు గడువు విధించినట్లు వెల్లడించింది. అప్పటి లోగా తమకు ఇవ్వాల్సిన పేమెంట్స్ క్లియర్ చేయడంతో పాటు కమిషన్ విషయంలో ఇబ్బందులు మానుకోవాలని తేల్చి చెప్పాయి. డెడ్ లైన్ వరకు  నిర్ణయం తీసుకోకపోతే స్విగ్గీని బ్యాన్ చేస్తామని హెచ్చరించాయి. ఏపీ హోటల్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకున్నప్పటికీ స్విగ్గీ వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. హోటల్స్ యాజమాన్యం విధించే షరతులు తమకు నష్టాన్ని కలిగించే ఉన్నాయనే ఉద్దేశంతో ససేమిరా అన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు స్విగ్గీ ప్రతినిధులు వెల్లడించారు. ఒకవేళ ఆ చర్చలు సఫలమైతే స్విగ్గీ సేవలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. లేదంటే ఏపీ అంతగా స్విగ్గీ సేవలు నిలిచిపోనున్నాయి.

Read Also: ‘బిగ్ బాస్’ నూతన్ నాయుడు కూతురికి ప్రతిష్టాత్మక అవార్డు, 11 ఏళ్లకే సమాజ సేవ.. సెల్యూట్ కలశా!

Related News

AP Politics: లోకేష్ కి పోటీగా అంబటి.. గ్రీన్ బుక్ ఓపెన్.. పేర్లన్నీ రాస్తున్నా.. ఎవ్వరినీ వదలనంటూ కామెంట్

SIT inquiry: తిరుమల లడ్డూ వివాదం.. ఈ వారం రంగంలోకి సిట్, తొలుత..

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

Kalasha Naidu: ‘బిగ్ బాస్’ నూతన్ నాయుడు కూతురికి ప్రతిష్టాత్మక అవార్డు, 11 ఏళ్లకే సమాజ సేవ.. సెల్యూట్ కలశా!

Big Stories

×