EPAPER

Big Twist in Shanthi Episode: మా ఆవిడ వెరీగుడ్.. వాళ్లిద్దరిపైనే నాకు అనుమానం : మదన్

Big Twist in Shanthi Episode: మా ఆవిడ వెరీగుడ్.. వాళ్లిద్దరిపైనే నాకు అనుమానం : మదన్

Big Twist in Shanthi Episode: సస్పెండెడ్ ఎండోమెంట్ అడిషినల్ కమిషనర్ శాంతి విషయంలో రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. శాంతికి పుట్టిన మగబిడ్డ తనకు పుట్టలేదని, తనకు విడాకులు ఇవ్వకుండా ఆమె మరోవ్యక్తిని ఎలా పెళ్లిచేసుకుంటుందంటూ.. ఆమె భర్తైన మదన్ మోహన్ ఎండోమెంట్ కమిషనర్ కు పంపిన లేఖతో మొదలైందీ వివాదం. అప్పట్నుంచి రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తూనే ఉంది. ఆ లేఖ బయటికి రావడంతో.. ప్రెస్ మీట్ పెట్టిన శాంతి.. ఆ బిడ్డ తన రెండో భర్త సుభాష్ కు పుట్టాడని, విజయసాయిరెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదంటూనే.. ఒక మహిళగా తనకు స్వేచ్ఛ ఉంటుందనడంతో ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారి సర్వత్రా చర్చనీయాంశమైంది.


శాంతి ప్రెస్ మీట్ తర్వాత.. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి.. తనపై ఎవరెవరు ఇలాంటి రాతలు రాశారో, మొదట ఈ విషయాన్ని ఎవరు మీడియాలో చెప్పారో వాళ్లని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మూడో ప్రెస్ మీట్ మదన్ మోహన్ ది. శాంతికి తనకు కవలలు పుట్టారని, తాను అమెరికా వెళ్లాక ఆమె గర్భవతి అయినట్లు చెప్పిందన్నారు. కానీ.. పిల్లలు పుట్టేలా తామిద్దరి మధ్య ఏం జరగలేదని, ఆ బిడ్డకు తండ్రెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత దేవాదాయశాఖ శాంతి భర్తెవరో చెప్పాలని అడుగుతూ నోటీసులు పంపింది. ఆమెపై కొన్ని ఆలయాలకు సంబంధించిన భూములు, లీజులపై అభియోగాలు మోపింది.

Also Read : ఇంతకీ నీ భర్త ఎవరో చెప్పు.. శాంతికి దేవాదాయశాఖ నోటీసులు


తాజాగా.. మా ఆవిడ వెరీ గుడ్డు అంటూ.. భర్త మదన్ మోహన్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. తనభార్యపై కుట్ర పన్నారని ఆరోపించాడు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో.. తన భార్య శాంతిచుట్టూ కుట్ర పన్నారని, ఇదంతా విశాఖపట్నంలో ఉన్న రూ.1000 కోట్ల విలువైన దేవాలయ భూములకోసమేనని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి, ప్రభుత్వ భూములకు సంబంధించిన న్యాయవాది కలిసి భూములను కాజేశారని ఆరోపించాడు మదన్ మోహన్. తనన, తన పిల్లల్ని శాంతికి దూరం చేశారని, తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారన్నాడు.

ఆ బిడ్డ ఎవరిబిడ్డో ప్రభుత్వమే డీఎన్ఏ టెస్ట్ చేయించి తేల్చాలని డిమాండ్ చేశారు. భూములకోసం శాంతికి దేవాదాయశాఖలో ఉద్యోగం ఇచ్చి.. ఎటూ కదల్లేకుండా ఇరికించారని, ఆమెను రేప్ చేసి.. ఒక బిడ్డకు తల్లిని చేశారని సంచలన ఆరోపణలు చేశాడు మదన్. సంతకం పెట్టినందుకు సుభాషే తండ్రి అని శాంతి, విజయసాయిరెడ్డే తండ్రి అని ఇతరులు, నేను తండ్రినని ఇంకొంతమంది చెప్పుకుంటున్నారని ముగ్గురిలో తండ్రెవరో తేల్చాలన్నారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్ సభ చైర్మన్ ను కలిసి తమకు జరిగిన అన్యాయంపై వినతిపత్రం అందజేస్తామని, ట్రైబల్స్ అయిన తమకు న్యాయం చేయాలని కోరుతామన్నారు. అలాగే తన కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరాడు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×