EPAPER

Actor SureshGopi: పుష్కరకాలం తర్వాత.. తిరుమలలో సురేష్ గోపి

Actor SureshGopi: పుష్కరకాలం తర్వాత.. తిరుమలలో సురేష్ గోపి

Actor SureshGopi: కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన దర్శన కోసం ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. తిరుమలలో శ్రీవారిని దర్శించు కుంటే అంతా మంచి జరుగుతుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఎన్ని పనులున్నా.. వీలు చూసుకుని స్వామి దర్శనం కోసం వస్తుంటారు.


అలాంటి వారిలో మలయాళం నటుడు, కేంద్రమంత్రి సురేష్ గోపి కూడా ఒకరు. గతరాత్రి ఫ్యామిలీతో తిరుమల చేరుకున్న ఆయన, బుధవారం ఉదయం అర్చన సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత స్వామివారి దర్శనానికి కుటుంబంతో కలిసి వచ్చారు సురేశ్ గోపి. స్వామిని చూసి ఆయన పులకించిపోయారు. పుష్కరకాలం తర్వాత  స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు.

ALSO READ: హైకోర్టుకు ఎమ్మెల్యే ఆదిమూలం.. హనీట్రాప్ అంటూ కీలక విషయాలు


మలయాళంలో తిరుగులేని నటుడు సురేష్ గోపి. తమిళం, తెలుగులోనూ నటించారాయన. ఓ వైపు నటుడిగా, మరోవైపు కేంద్రమంత్రిగా బిజీగా ఉన్నారాయన. లోక్‌సభ ఎన్నికల్లో కేరళ నుంచి గెలిచిన ఏకైక బీజేపీ ఎంపీ ఆయనే. అంతేకాదు నేరుగా మోదీ 3.0 కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు.

సినిమాలు లేకపోతే తన జీవితం లేదని ఒకానొక దశలో చెప్పుకొచ్చారు సురేష్ గోపి. ప్రస్తుతం తాను మూడు డజను సినిమాలు ఓకే చేశానని, వాటిల్లో నటించేందుకు కేంద్ర పెద్దల పర్మిషన్ తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలను మెప్పించడమే తనకు ముఖ్యమని, ఏనాడూ మంత్రి పదవులు కోరుకోలేదని ఇటీవల కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.

 

 

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×