EPAPER

IMD : తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్టోగ్రతలు.. ఐఎండీ హెచ్చరిక..

IMD : తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్టోగ్రతలు..  ఐఎండీ హెచ్చరిక..
Summer Effect On telugu States
Summer Effect On telugu States

Summer effect On Telugu States(Today’s state news): తెలుగు రాష్ట్రాలపై భానుడు ప్రతాపం చూపించనున్నాడు. ఇప్పటికే ఎండలు తీవ్రత క్రమ క్రమంగా పెరుగుతోంది. మార్చి ప్రారంభం నుంచి ఉష్టోగ్రతలు సాధారణంగా ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు భారత్ వాతావరణ శాఖ .. ఐఎండీ కూడా వేసవిలో ఎండలపై ముందే హెచ్చరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో సాధారణ కన్నా ఎక్కువ రోజులు ఎండల ప్రభావం ఉంటుందని తెలిపింది. వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది.


ఈ ఏడాది వేసవి కాలం ప్రచండ భానుడు ప్రతాపం చూపిస్తాడని ఐఎండీ అంచనా వేసింది. ఎల్‌ నినో ప్రభావమే కారణమని పేర్కొంది. అందువల్లే ఈ సమ్మర్ లో హై టెంపరేచర్స్ నమోదవుతాయని వెల్లడించింది. మార్చి-మే నెలల మధ్య భారత్ దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణంగా కంటే ఎక్కువగా గరిష్ఠ, కనిష్ఠ ఉష్టోగ్రతలు రికార్డవుతాయని తెలిపింది.

వేసవిలో ఎండల తీవ్రత వివరాలను ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర వివరించారు. ఉత్తర, మధ్య భారత్‌లో మాత్రం వేసవి ప్రభావం అంతగా ఉండదని పేర్కొన్నారు. అక్కడ మార్చిలో వడగాల్పుల తీవ్రత ఉండదన్నారు. ఎల్‌ నినో ఎఫెక్ట్ వేసవి వరకు ఉండే అవకాశం ఉందన్నారు. వేసవి ముగిసిన తర్వాత సాధారణ వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పారు.


Read More: గృహజ్యోతి స్కీమ్.. జీరో విద్యుత్ బిల్లులు జారీ..

మరోవైపు దేశంలో లా నినా పరిస్థితులపై ఐఎండీ అంచనా వేసింది. లా నినా అనేది వర్షపాతానికి అనుకూలంగా ఉంటుంది. లా నినా వర్షాకాలం మధ్యలో ఏర్పడుతుందని అంచనా వేసింది. దేశంలో మార్చి నెలలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఇంకోవైపు ఈ వేసవిలోనే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.  మరికొన్నిరోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ -మే నెలల్లో దేశవ్యాప్తంగా విడతలవారీగా ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు ప్రచారం నిర్వహించనున్నారు. మరి ఈ వేసవి కాలంలో రాజకీయ పార్టీ నాయకులకు ప్రత్యర్థులతోపాటు ఎండలు సవాల్ గా మారనున్నాయి.

ఏపీలో లోక్ సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుందన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ప్రచారంలో ఇబ్బందులు ఎదురుకానున్నాయి. బహిరంగ సభలకు కార్యకర్తలను తరలించడంలోనూ సమస్యలు ఎదురుకానున్నాయి.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×