EPAPER
Kirrak Couples Episode 1

Sujana Chowdary: నేను లోకల్.. బెజవాడపై సుజనాచౌదరి నజర్!

Sujana Chowdary: నేను లోకల్.. బెజవాడపై సుజనాచౌదరి నజర్!
sujana Kesineni

Sujana Chowdary: విజయవాడ రాజకీయం మారుతోందా? సుజనాచౌదరి పోటీకి సిద్ధమవుతున్నారా? ఆయన ఏ పార్టీ తరఫున బరిలోకి దిగబోతున్నారు? ఎవర్ని ఓడించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి?


కేంద్ర మాజీ మంత్రి.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.. బీజేపీ నాయకుడు.. సుజనాచౌదరి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇదే ఇప్పుడు బెజవాడలో రీసౌండ్ ఇస్తోంది. ఒకటి కాదు.. ఏకంగా రెండు గృహప్రవేశాలతో సందడి చేశారు సుజనాచౌదరి. విజయవాడ కామినేని హాస్పిటల్ దగ్గర నూతన గృహ ప్రవేశం చేసిన బీజేపీ నేత సుజనా చౌదరి.. ఆ మరుసటి రోజే తన అమ్మమ్మ గారి ఊరి పొన్నవరంలో కూడా గృహప్రవేశం చేశారు. దీని ద్వారా రెండు సంకేతాలు పంపినట్టయింది. ఒకటి తాను లోకల్ అని.. రెండోది ఇక్కడే ఉంటానని.

విజయవాడ నుంచి సైకిల్ గుర్తుపై వరుసగా రెండుసార్లు గెలిచిన కేశినేని నాని.. టీడీపీ టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా హ్యాట్రిక్ సాధిస్తానంటూ గంట బజాయించి చెప్తున్నారు. ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని దేవినేని ఉమా వర్గం ఎంకరేజ్ చేస్తుండడంపై నాని ఫైరవుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పీవీపీ కూడా నేనున్నానంటూ ఇటీవలే ట్వీట్‌తో హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేను సైతం అంటూ రంగంలోకి దిగారు సుజనాచౌదరి.


కేశినేని నాని.. ట్రావెల్స్ బిజినెస్ నుంచి వచ్చిన పొలిటీషియన్.
పీవీపీ.. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో సుపరిచితుడు.. ఓసారి ఓడిపోయారు.
సుజనాచౌదరి.. తొలుత పారిశ్రామికవేత్త.. ఆ తర్వాతే సక్సెస్‌ఫుల్ పొలిటీషియన్.
ముగ్గురూ బిగ్‌షాట్సే. పార్టీ అధినేతలతోనే నేరుగా పరిచయాలు ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉంది. మరి, ఎవరి సీన్ ఏంటి? ఆయా పార్టీలు టికెట్ ఇస్తాయా? గెలిచే సత్తా ఎవరికుంది?

బీజేపీ, జనసేన మధ్య స్నేహం ఉంది. టీడీపీతో కలుస్తాయనే టాక్ ఉంది. అదే జరిగితే చంద్రబాబు సన్నిహితుడి కోటాలో తనకు టికెట్ ఈజీ అని సుజనా అంచనా. ఒకవేళ టీడీపీ పొత్తు పెట్టుకోకుంటే.. అప్పుడు కూడా బీజేపీ నుంచి బరిలోకి దిగి అధినాయకత్వం దగ్గర మార్కులు కొట్టేయవచ్చని మరో లెక్క. ఎలాగూ.. కేశినేని బ్రదర్స్ నాని, చిన్ని మధ్య పొలిటికల్ వార్‌తో టీడీపీ కేడర్ చీలిపోతుందని.. ఆ తాను ముక్కనైన తనకు సపోర్టు చేస్తుందని సుజనా భావిస్తున్నారు. ఆఖరి నిమిషంలో బరిలోకి దిగి అభాసుపాలు కాకుండా.. దాదాపు ఏడాది ముందే బరిలోకి దిగి.. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. రైతులకు టార్పాలిన్లు, బడి పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేస్తూ జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు సుజనాచౌదరి. కేశినేని చిన్ని తరహాలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలనే ఆలోచన కూడా చేస్తున్నారాయన. రైతులకు అవసరాలేంటో తెలుసుకుంటున్న ఆయన వారికి నియోజకవర్గానికి ఐదు, పది రోటోవేటర్లు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.

మరి, టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. కేశినేని నాని పరిస్థితేంటి? చిన్ని సంగతేంటి? వైసీపీ నుంచి పీవీపీ నే మళ్లీ బరిలోకి దిగుతారా? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయంట్. చాపకింద నీరులా సుజనాచౌదరి చొచ్చుకొస్తుండడం.. చిన్నితో తనకు చెక్ పెట్టే కుట్ర జరుగుతోందని గ్రహించిన కేశినేని నాని.. ఆ దిశగా తనదైన శైలిలోనే ముందుకెళ్తున్నారు. టీడీపీ నాయకత్వంపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు నిధులిస్తున్నారు. వాటి ప్రారంభోత్సవాలకు వెళ్తూ , వైసీపీ ఎమ్మెల్యేలను పొగిడే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు.. కేశినేని నానిని వైసీపీలోకి తీసుకునే అంశంపై అంతర్గత సమావేశాల్లో నాయకత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ జగన్ సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదిరితే ఉమ్మడి అభ్యర్థిగా సుజనాచౌదరికి అవకాశాలెక్కువే. అప్పుడు కేశినేని నాని వైసీపీ నుంచి బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ మూడు పార్టీల మధ్య పొత్తు కుదరని పక్షంలో బీజేపీ నుంచి సుజనా రంగంలోకి దిగితే.. టీడీపీ నుంచి ఎప్పట్లాగే కేశినేని నాని పోటీ పడే అవకాశాలే ఎక్కువ. ఒకవేళ కేశినేని చిన్నిని టీడీపీ ప్రోత్సహిస్తే.. నాని వైసీపీ ఆఫర్‌పై ఆలోచన చేయొచ్చు. అటు పీవీపీ విషయానికి వస్తే.. గత ఎన్నికల ముందు సడెన్ స్టార్‌లా మెరిశారు. తర్వాత పాలిటిక్స్‌లో లేరు. అప్పుడప్పుడూ నేనున్నానంటూ ట్వీట్లు చేస్తున్నారు తప్పితే.. గ్రౌండ్ లెవల్‌లో ఆయనకు పట్టు లేదు. జగన్ బొమ్మే ఆయనకు ఆశ. మరి, వైసీపీ ఆయన్నే బరిలో నిలుపుతుందా?.. కలిసొస్తే కేశినేని నానిని ఎంకరేజ్ చేస్తుందా? సుజనాచౌదరి సై అంటారా? వెయిట్ అండ్ సీ.

Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×