EPAPER
Kirrak Couples Episode 1

Subramanian Swamy: తిరుమల లడ్డూ వివాదం.. స్వామిని దించిన జగన్, సుప్రీంలో పిటిషన్

Subramanian Swamy: తిరుమల లడ్డూ వివాదం.. స్వామిని దించిన జగన్, సుప్రీంలో పిటిషన్

Subramanian Swamy: తిరుమల లడ్డూ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీనికి వెనుక వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. సిట్ ఏర్పాట్టు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన మరుసటి రోజు పిటిషన్ దాఖలైంది. అసలేం జరుగుతోంది?


తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యింది. కూటమి ప్రభుత్వం నుంచి ఎదురుదాడిని అడ్డుకోలేక నానా తంటాలు పడుతోంది ఆ పార్టీ. దీంతో తన అస్త్రాలను బయటకు తీస్తోంది వైసీపీ. సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్టేట్‌మెంట్ ఇచ్చిన 18 గంటల్లోపే మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది.

ఇంతకీ ఆ పిటిషన్ వేసింది ఎవరో తెలుసా? బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై ఈ పిల్ దాఖలు చేశారు. సీఎం చంద్రబాబు తన ప్రకటనతో భక్తులకు గందళగోళానికి గురి చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలన్నది అందులోని ప్రధాన పాయింట్.


తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు పడుతున్నాయి. ఇప్పటికే నాలుగైదు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎవరు కల్తీ చేశారో వారిపై చర్యలు తీసుకోవాలని వేశారు. కాకపోతే సీనియర్ రాజకీయ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ కేవలం సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వేశారు. ఆయన చేసినవన్నీ నిరాధార ఆరోపణలని ప్రస్తావించారాయన. స్వామి పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ALSO READ: తిరుమల లడ్డూ వివాదం, సిట్ ఏర్పాటు, వైసీపీ నేతలు ఇరుకున్నట్టే..

తిరుమల లడ్డూ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని వైసీపీ మొదటి నుంచి వాదిస్తోంది. ఆదివారం రాత్రి మీడియా ముందుకు వచ్చిన సీఎం చంద్రబాబు లడ్డూ వ్యవహారంపై సిట్ వేస్తున్నట్లు స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. దీంతో స్వామిని లైన్‌లోకి తీసుకొచ్చింది వైసీపీ. నేరుగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పిటిషన్ వేయించింది.

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. జగన్-సుబ్రహ్మణ్య స్వామి రిలేషన్స్ గురించి అందరికీ తెల్సిందే. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు సర్కార్‌పై పిటిషన్ వేశారు స్వామి. ముఖ్యంగా టీటీడీ నిధులు దుర్వినియోగం అయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం నుంచి టీటీడీ తప్పించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక సుబ్రహ్మణ్యస్వామిని ప్రత్యేక విమానంలో ఢిల్లీని నేరుగా తిరుపతికి రప్పించి టీడీపీపై ఆరోపణలు చేసింది. అంతేకాదు రోజంతా జగన్‌తో స్వామి గడిపారని చెప్పుకొచ్చారు.  లడ్డూ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆదివారం వరకు స్వామి స్పందించలేదు.  ఈ వ్యవహారంపై ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Related News

Target Dwarampudi: ద్వారంపూడి చిక్కినట్టేనా? కాకినాడలో షాపుల కూల్చివేత

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ

TTD Conduct On Hhomam: తిరుమలలో హోమం, నాలుగు గంటలపాటు..

Maredumilli Tour: విషాదాన్ని నింపిన మారేడుమిల్లి టూర్.. జలపాతంలో గల్లంతై మెడికోలు మృతి

SIT on Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సిట్ ఏర్పాటు, వైసీపీ నేతలు ఇరుకున్నట్టే..

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

Big Stories

×