EPAPER

CM Chandrababu Naidu: రామానాయుడి స్టూడియో భూములపై.. చంద్రబాబు సంచలన నిర్ణయం

CM Chandrababu Naidu: రామానాయుడి స్టూడియో భూములపై.. చంద్రబాబు సంచలన నిర్ణయం

విశాఖపట్నంలో వివాదాస్పద భూములు దసపల్లా, హైగ్రీవ, రామానాయుడు స్టూడియో, ఎర్రమట్టి దిబ్బలు, స్వరూపానంద భూములను పరిశీలించారు సిసోడియా. రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ భూములు 13 లక్షల ఎకరాలు ఉంటే 25 వేల ఎకరాలను గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేశారు. విశాఖపట్నంలో దాదాపుగా 2600 ఎకరాల భూములకు ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ జారీ జరిగినట్టు గుర్తించారు. 606 ఎకరాలను 22A నుంచి తొలగించారు. 133 ఎకరాలు కొత్త వారి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు మండలాల్లో భూదందా జరిగినట్టు గుర్తించారు సిసోడియా.

ఫ్రీహోల్డ్ భూముల అగ్రిమెంట్లు జరిగి, రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూసే వారి సంఖ్య తెలియని స్థితి నెలకొంది. ఉత్తరాంధ్రలో అనాథరైజ్డ్ లేఅవుట్ చాలా ఎక్కువగా ఉన్నాయని, ఎర్రమటి దిబ్బలను కొంత వరకు లెవెల్ చేశారని, ఒకటి రెండు వాగులను కప్పేశారని గుర్తించారు. భూ అక్రమాలను సహించేది లేదని సిసోడియా పేర్కొన్నారు.


Also Read: తిరుపతి అగ్ని ప్రమాదంపై అనుమానం.. టీటీడీలో రూ.100కోట్లు చేతులు మారాయి.. వైసీపీ పనే!

విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఫ్రీహోల్డ్ భూములపై కొన్ని లోపాలు గుర్తించారు సిసోడియా. 22A, ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది. అవి ఎవరి పేరున రిజిస్టర్ అయ్యాయో గుర్తించగలం కానీ దాని వెనుక ఎవరు ఉన్నారనేది చెప్పలేమని సిసోడియా తెలుపుతున్నారు. దసపల్ల భూముల యాజమాన్య హక్కులపై వివాదం వుందని.. అందులోనే సర్క్యూట్ హౌస్, ఇతర ప్రభుత్వ నిర్మాణాలు వున్నాయన్నారు. 14 ఎకరాలు మాత్రం 22Aలో పెట్టామని తెలిపారు సిసోడియా.

దసపల్లా భూములపై న్యాయ పరిధిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం చూస్తోందని.. నగరంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం డిజిటల్ మ్యాపింగ్ చెయ్యాలన్నారు సిసోడియా. రెవిన్యూ రికార్డులకు, మున్సిపల్ రికార్డులకు మధ్య వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని.. వాటిని సరి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎర్రమట్టి కొండలు లేఅవుట్‌ స్టేటస్‌ కొనసాగించాలని సూచించినట్టు తెలిపారు. ఎర్రమట్టి దిబ్బలు రెండు వాగులను కప్పేశారని తెలిపారు. మొత్తంమీద విశాఖ ఉత్తరాంధ్రలో రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ RP సిసోడియా పర్యటనతో భూకబ్జాలకు పాల్పడ్డ ఆక్రమణదారుల్లో కేసుల భయం మొదలైంది.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×