EPAPER

Sharmila Vs Chandrababu: జగన్‌కు, చంద్రబాబుకు మధ్య తేడా లేదనిపిస్తుంది.. ఎందుకంటే? : షర్మిల సంచలన వ్యాఖ్యలు

Sharmila Vs Chandrababu: జగన్‌కు, చంద్రబాబుకు మధ్య తేడా లేదనిపిస్తుంది.. ఎందుకంటే? : షర్మిల సంచలన వ్యాఖ్యలు

Sharmila Sensational Comments on Chandrababu: తెలుగు రాష్ట్రాల రాజకీయాలల్లో వైస్ షర్మిల తీవ్ర ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణ ప్రజలకు చేరేలా ఆయన తన హయాంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా 108 స్కీమ్, ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ.. ఈ పథకాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలో ఈ రెండు పథకాలు కొనసాగుతున్నాయంటే.. వాటి ప్రభావం ఎంత ఉందో ఇట్టే అర్థమవుతుంది.


అంతెందుకు ఇప్పటికీ ఆయన అభిమానులు వైఎస్ ఫొటోను తమ ఇంట్లో దేవుళ్ల ఫొటోల పక్కన పెట్టుకుంటారు. అందులో ప్రముఖులు కూడా ఉన్నారు. అది కూడా కేబినెట్ మంత్రులు సైతం లేకపోలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా ఆయన అభిమానం సంపాదించుకున్నారు. రాష్ట్ర రాజకీయాలనే కాదు.. భవిష్యత్తులో జాతీయ రాజకీయాలను సైతం వైఎస్ శాసించగలడేమో అన్న చర్చ కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా నడిచింది. ఆయన ప్రవేశపెట్టిన పథకాల వల్ల సామాన్య ప్రజలు చాలామందికి లబ్ధి చేకూరుంది. అందుకే ఆయన మన మధ్య లేకున్నా కూడా ఇప్పటికీ ఆయన పేరును ప్రస్తావిస్తుంటారు. ఎన్టీఆర్ ఏ మాదిరిగానైతే విప్లవాత్మక మార్పులు తెచ్చారో అదేమాదిరిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పలు మార్పులు తీసుకురాగలిగాడు.

Also Read: పులివెందులలో జగన్.. ఏం చేద్దాం.. కొద్దిరోజులు ఆగితే..


ముఖ్యమంగా వైద్యం, విద్య విషయంలో పేద ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వాలను నడిపారు. ఆయన హెలికాప్టర్ క్రాష్ కు గురై దుర్మరణం చెందిన విషయం తెలిసి ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా చాలామంది ప్రజలు మృతిచెందారు. అంతలా ఆయనపై అభిమానం ప్రజలకు ఉండేది. అయితే, ఆయన మరణానంతరం జరిగిన పరిణామాలు కూడా అందరికీ తెలిసిందే. జనగ్ కాంగ్రెస్ నుండి విడిపోయి వైఎస్సార్ సీపీని ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాల్లో ఓదార్పు యాత్రలు చేశారు. ఈ క్రమంలో ఆయన జైలుకు పోయిన విషయం విధితమే. ఆ సమయంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు. ఆ తరువాత జగన్ జైలు నుంచి బయటకు వచ్చాక ఓదార్పు యాత్రను కంటిన్యూ చేశారు. ఆ తరువాత ఆయన 2019లో అధికారంలోకి వచ్చారు.

అయితే, కొద్దిరోజులు స్తబ్దుగా ఉన్న షర్మిల తన సోదరుడు జగన్ పై పలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ తరువాత తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఏపీలో కూడా తమ పార్టీని విస్తరిస్తామంటూ పలు పర్యటనలు  కూడా చేశారు. ఈ క్రమంలో జగన్ పై పలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ తరువాత ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసి ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు షర్మిల. కడప నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ సమయంలో తన అన్న జగన్, పలువురు కుటుంబ సభ్యులపై ఆమె పలు ఆరోపణలు చేస్తూ వచ్చింది. కొంతవరకు కూటమి పార్టీలకు పరోక్షంగా సపోర్ట్ కూడా ఇస్తూ వస్తున్నదన్న చర్చ కూడా కొనసాగింది ఆ సమయంలో. ఎన్నికల తరువాత కూడా జగన్ పై ఆమె పలు ఆరోపణలు చేస్తూనే వస్తున్నది.

Also Read: సెప్టెంబర్ 1 ఏపీ సీఎం చంద్రబాబుకు ఎంతో ప్రత్యేకం..ఎందుకో తెలుసా?

అయితే, తాజాగా చంద్రబాబుపై షర్మిల పలు వ్యాఖ్యలు చేసింది. కూటమి ప్రభుత్వం వైద్య, విద్య సంస్థలకు వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి పేరును తొలగించడాన్ని తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నది షర్మిల. గతంలో కూడా తన సోదరుడు జగన్ కూడా ఇదే విధంగా ఎన్టీఆర్ పేరును తొలగించి పెద్ద తప్పు చేశారన్నారు. ఇప్పుడు అదే బాటలో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నడుస్తున్నారంటూ ఆమె విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ కామెంట్స్ చేశారు.

‘ఏపీలో మెడికల్ కళాశాలలకు, కాలేజీ ఆసుపత్రులకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును తొలగించడాన్ని ప్రతీకార చర్యగానే భావిస్తున్నాం. ఇటు ఎన్టీఆర్ అయినా, అటు వైఎస్సార్ అయినా ఉమ్మడి ఏపీ అభివృద్ధికి పాల్పడినవాళ్లే. వారిద్దరూ కూడా తమ పాలనలో తమదైన ముద్ర వేసి ప్రజల మన్ననలు పొందారు. అందువల్ల వీరిని రాజకీయాలకు అతీతంగా చూడాలి కానీ, నీచ రాజకీయాలకు ఆపాదించడం సరికాదు.

వైఎస్సార్ తన హయాంలో దేశానికి ఆదర్శమైన పథకాలను ఆయన అమలు చేశాడు. అందులో ముఖ్యమైనవి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్, రుణమాఫీ, ఉచిత విద్యుత్, పెన్షన్స్ ఉన్నాయి. తెలుగువారి గుండెల్లో వైఎస్సార్ పేరు ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. అయితే, వైసీపీ మీద ఉన్న కోపాన్ని వైఎస్సార్ మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్? వైసీపీలో వైఎస్సార్ లేడు’ అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related News

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

CPI Narayana: ఏపీలో కూడా హైడ్రాను ఏర్పాటు చేసి బుడమేరును కాపాడాలి: సీపీఐ నారాయణ

kakinada GGH Rare Treatment: రోగికి “అదుర్స్” సినిమా చూపిస్తూ.. అరుదైన సర్జరీ చేసిన డాక్టర్లు

Ysrcp Leaders Missing: సాయం లేదు.. సమాచారం లేదు.. వరదల్లో మిస్సయ్యరా?

CM Chandrababu Angry on Jagan: జగన్‌‌పై సీఎం ఆగ్రహం, మెడికల్ కాలేజీ సీట్లు.. ఆ జీవో సీక్రెట్..

Big Stories

×