EPAPER
Kirrak Couples Episode 1

YSRCP: వైసీపీని తగలబెడుతున్న అసంతృప్తి సెగలు.. చేతులెత్తేసిన సీనియర్లు..

YSRCP: వైసీపీని తగలబెడుతున్న అసంతృప్తి సెగలు.. చేతులెత్తేసిన సీనియర్లు..

YSRCP: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీని అసంతృప్తి సెగలు తగలబెడుతున్నాయి. ఇన్నాళ్లు సీఎం జగన్ కి భజన చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు నిరసన గళమెత్తుతున్నారు. ఈ ఆందోళనల పర్వం ముదురుతుండడంతో.. పార్టీ సీనియర్లు కూడా బుజ్జగింపులు చేయలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక సీఎం జగన్ సైతం తలపట్టుకుంటున్నారు. రాను రాను ఈ టికెట్ల వ్యవహారం మరింత ముదురుతుండడంతో మరికొంత మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్లు సమాచారం అందుతుంది.


ఈ అసంతప్తి జాబితాలో ముందుగా సీనియర్ నాయకులు మాజీ వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన చాలాసార్లు తనకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు. స్వయంగా జగన్ వెళ్లి బాలినేని శ్రీనివాస్‌ను బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే వైసీపీ అధిష్థానం ఆయనను ఒంగోలు నుంచి తప్పించేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే గిద్దలూరు నుంచి పోటీ చేయాలని ఆయనకు ఫోన్లు వచ్చినట్లు సమాచారం. దాంతో బాలినేని ఏకంగా వేరే పార్టీలో చేరుతానని బెదిరించినట్లు టాక్ నడుస్తోంది.

అలానే విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని తప్పించి ఈసారి ఆ స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కేటాయించారు. దీంతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. ప్రస్తుతం మల్లాది విష్ణు తన అనుచరులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు విజయవాడ వెస్ట్ వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈసారి వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్‌కు మార్చడంతో ఆయన పరిస్థితి తలకిందులైంది. ఇంతకాలం విజయవాడ వెస్ట్‌లో కష్టపడి పట్టు సాధిస్తే.. ఇప్పుడు ఒక్కసారిగా సెంట్రల్ నియోజకవర్గానికి మారిస్తే ఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందనే భయంలో ఉన్నారని టాక్.


ఇదే పరిస్థితిని మరో వైసీపీ నేత దేవినేని అవినాష్ కూడా ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లు విజయవాడ ఈస్ట్‌లో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్న ఆయనకు.. తాజాగా పెనమలూరుకు వెళ్లాలని పార్టీ ఆదేశించింది. దాంతో అవినాష్ పరిస్థితి కూడా డోలాయమానంగా తయారైంది. అదే విధంగా అసంతృప్తుల జాబితాలో తాజాగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కూడా చేరారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న రామచంద్రాపురంలోనే సీటుని మరో సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యకు కేటాయించారు. మంత్రి చెల్లుబోయినకు రాజమండ్రి రూరల్ ఖాయమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంత్రి అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.

దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ స్వరం కూడా మారుతోంది. టికెట్ రాకపోతే… తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిస్తానంటూ మద్దిశెట్టి చేసిన వ్యాఖ్యలు కొత్త డౌట్స్‌ను తెరపైకి తీసుకొస్తున్నాయి. అటు.. సీఎంకి అత్యంత సన్నిహితుడుగా గుర్తింపున్న రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెప్తున్నారు. నెల్లూరు నుంచి పోటీకి విముఖత చూపుతున్నారని.. టీడీపీ నాయకులు ఆయనతో టచ్‍లోకి వెళ్లారని చర్చించుకుంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి సైతం జగన్ షరతులు పెట్టినట్టు చెప్తున్నారు. దీంతో వాళ్లు కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

ఇక ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పార్టీకి రాజీనామా చేసి.. షర్మిలతో కలిసి కాంగ్రెస్ లో చేరతానని ప్రకటించారు. ఎమ్మెల్సీ వంశీ కృష్ణ, దాడి వీరభద్రరావు, సి.రామచంద్రయ్య కూడా వైసీపీని వీడారు. అలానే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నిన్ననే పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాకుండా రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటూ కుండబద్దలు కొట్టారు. జగన్‌ని నమ్ముకున్నందుకు తన గొంతు కోశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

.

.

Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×